తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bellam Kommulu: దీపావళి వంటల్లో బెల్లం కొమ్ములు పక్కాగా చేయండి, సింపుల్ స్వీట్ స్నాక్

Bellam Kommulu: దీపావళి వంటల్లో బెల్లం కొమ్ములు పక్కాగా చేయండి, సింపుల్ స్వీట్ స్నాక్

24 October 2024, 15:30 IST

google News
    • Bellam Kommulu: దీపావళికి ఏవైనా సింపుల్ స్వీట్స్ స్నాక్ చేయాలనుకుంటే  బెల్లం కొమ్ములు చేసి చూడండి. చాలా సింపుల్ గా అయిపోతాయి. రుచిగానూ ఉండే మంచి స్నాక్ రెసిపీ ఇది.
బెల్లం కొమ్ములు
బెల్లం కొమ్ములు

బెల్లం కొమ్ములు

బెల్లం పాకం కట్టి తయారు చేసే తీపి వంటకం ఈ బెల్లం కొమ్ములు. కొన్ని ప్రాంతాల్లో దీపావళి సమయంలో ఈ స్నాక్ తప్పక చేసుకుంటారు. మురుకులను చేసి బెల్లం పూత వేసినట్లుండే ఈ వంటకం తయారీ ఎలాగో చూసేయండి.

బెల్లం కొమ్ముల తయారీకి కావాల్సిన పదార్థాలు:

పావు కేజీ శనగపిండి

పావు కప్పు బియ్యం పిండి

కప్పున్నర బెల్లం తురుము

అర టీస్పూన్ యాలకుల పొడి

కప్పు నెయ్యి

డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె

బెల్లం కొమ్ముల తయారీ విధానం:

  1. ముందుగా శనగపిండి ఒక పెద్ద బౌల్ లో తీసుకోండి. అందులోనే బియ్యం పిండి కలపండి. ఇప్పుడు నెయ్యి కొద్దిగా వేడి చేసి అందులో పోసేయండి.
  2. ఒకసారి పొడిపొడిగా పిండి కలుపుకున్నాక నీళ్లు పోసుకుని గట్టిగా కలుపుకోవాలి. పూరీ పిండిలాగా కాస్త గట్టిగానే ఉంటే సరిపోతుంది. కొమ్ముల తయారీకి పిండి సిద్ధమైనట్లే.
  3. ఇప్పుడు కడాయి పెట్టుకుని నూనె పోసుకోండి. నూనె వేడెక్కాక స్టవ్ సన్నం మంట మీద ఉంచండి.
  4. ఈలోపు మురుకులు చేసే మెషీన్ తీసుకుని అందులో లోపలి వైపు నూనె రాసుకోండి. పిండి ముద్దను పెట్టి కాస్త లావు పాటి మురుకుల అచ్చు నుంచి ఒత్తుకోండి.
  5. నేరుగా వేడెక్కిన నూనెలోనే వాటిని మురుకుల్లాగే ఒత్తేసుకోండి. ఒక నిమిషం నూనెలో వేగిపోయాక మరో వైపు కూడా వేగనివ్వండి. నూనెలో బుడగలు రావడం ఆగిపోతే మురుకు వేగినట్లే. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి.
  6. ఇలా పిండి మొత్తం మురుకులు ఒత్తుకోండి. చల్లారాక వాటిని కాస్త పొడవుగా ఉండే ముక్కల్లాగా విరగ్గొట్టి పక్కన ఉంచండి.
  7. పాకం కోసం ఒక ప్యాన్ లో బెల్లం, నీళ్లు వేసి వేడి చేయండి. బెల్లం కరిగి ఒక ఉడుకు రాగానే అందులో యాలకుల పొడి వేసి బాగా కలపండి. స్టవ్ కట్టేయండి.
  8. విరగ్గొట్టి పెట్టుకున్న మురుకుల ముక్కలను ఈ పాకంలో వేసి బాగా కలిపేయండి. పాకం అంతటా అంటుకోవాలి.
  9. చల్లారాక అన్నింటినీ వేరు వేరుగా చేసేయండి. ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నారంటే కనీసం నెల అయినా నిల్వ ఉండే బెల్లం కొమ్ములు రెడీ.

 

 

 

టాపిక్

తదుపరి వ్యాసం