Cauliflower pakodi: స్పైసీ, క్రిస్పీ క్యాలీఫ్లవర్ పకోడీ, టేస్టీ స్నాక్ రెసిపీ
25 October 2024, 15:30 IST
- Cauliflower pakodi: క్యాలీఫ్లవర్‌తో కూర నచ్చకపోతే ఎవరికైనా నచ్చేసే పకోడీ చేసేయండి. ఇవి స్పైసీగా నోరూరించే క్రిస్పీ స్నాక్. సాయంత్రం పూట టీ టైంలో వీటిని తిన్నారంటే అదిరిపోతుంది. క్యాలీఫ్లవర్ పకోడీ తయారీ ఎలాగో చూడండి.
క్యాలీఫ్లవర్ పకోడీ
క్యాలీఫ్లవర్ పకోడీ
కూర చేశాక క్యాలీఫ్లవర్ కాస్త మిగిలిపోతే ఇలా కాలీఫ్లవర్ పకోడీలు చేసేయండి. చాలా అంటే చాలా సింపుల్ స్పైసీ స్నాక్ ఇది. బజ్జీలు వేసినట్లే చేయడం. కాకపోతే క్యాలీఫ్లవర్ రుచి పిల్లలకూ నచ్చాలంటే కొన్ని మసాలాలు వేసి మరింత రుచిగా చేస్తాం. తయారీ ఎలాగో చూసేయండి.
క్యాలీఫ్లవర్ పకోడీ తయారీకి కావాల్సినవి:
1 క్యాలీఫ్లవర్
2 కప్పుల శనగపిండి
అరచెంచా అల్లం వెల్లుల్లి ముద్ద
అర టీస్పూన్ వాము
అర చెంచాడు కారం
చిటికెడు ఇంగువ
అర టీస్పూన్ పసుపు
1 చెంచాడు నిమ్మరసం
గుప్పెడు కొత్తిమీర తరుగు
క్యాలీఫ్లవర్ పకోడీ తయారీకి కావాల్సినవి:
- ముందుగా క్యాలీఫ్లవర్ కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నీళ్లు పోసుకుని మరిగించి ఆ నీళ్లలో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి నిమిషం ఉడికించాలి.
- తర్వాత స్టవ్ కట్టేసి వేడి నీళ్లలో పావుగంట అలాగే వదిలేయాలి. తర్వాత బయటకు ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
- ఈ ముక్కల్లోనే కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలుపుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి.
- మరో పాత్రలో పకోడీ కోసం పిండి రెడీ చేసుకోవాలి. అందుకోసం శనగపిండి, కాస్త వంటసోడా, ఉప్పు వేసి నీళ్లు, వాము వేసి జారుడుగా కలుపుకోవాలి.
- కడాయి పెట్టుకుని నూనె పోసుకుని వేడెక్కనివ్వాలి.
- ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు తీసుకుని పిండిలో ముంచి నూనెలో వేసుకోండి. బాగా రంగు మారేంత వరకు వేయించుకోండి.
- అంతే కాస్త క్రిస్పీగా మారాయంటే క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ అయినట్లే. వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని మీకిష్టం ఉంటే మీద కాస్త చాట్ మసాలా, నిమ్మరసం, నూనెలో ఫ్రై చే కొత్తిమీర చల్లి తినేయండి. రుచిగా ఉంటాయి.