Kobbari Charu: కొబ్బరి ముక్క మిగిలితే కొబ్బరి చారు చేసేయండి, ఇష్టంగా తింటారు
29 September 2024, 17:30 IST
Kobbari Charu: కొబ్బరితో చారు చేయొచ్చని చాలా మందికి తెలీదు. ఒకరకమైన పప్పుచారు రెసిపీ అనుకోండి. కాకపోతే కొబ్బరి ఫ్లేవర్ ఉంటుంది. తయారీ సులభమే.
కొబ్బరి చారు
కొబ్బరి ఫ్లేవర్ రుచితో చేసే చారు లేదా రసం రెసిపీ కమ్మగా ఉంటుంది. ఈ చారుతో ఎంత అన్నం అయినా తినేయొచ్చు. అంచుకు పాపడ్, వడియాలు పెట్టుకున్నారంటే ఇంకే కర్రీ అవసరం లేదు. కమ్మదనంతో నిండి ఉండే ఈ కొబ్బరి చారు రెసిపీ చూసేయండి.
కొబ్బరి చారు తయారీకి కావాల్సినవి:
సగం పచ్చి కొబ్బరి ముక్క
2 టమాటాలు, సన్నం ముక్కల తరుగు
2 పచ్చిమిర్చి
2 చెంచాల నూనె
సగం కప్పు కందిపప్పు, ఉడికించుకోవాలి
పావు కప్పు చింతపండు రసం
అరచెంచా ఉప్పు
అరచెంచా కారం
అరచెంచా పసుపు
అరచెంచా జీలకర్రపొడి
గుప్పెడు కొత్తిమీర తరుగు
అర టీస్పూన్ ఆవాలు
అర టీస్పూన్ మెంతులు
అరచెంచా జీలకర్ర
2 ఎండుమిర్చి
అరచెంచా మినప్పప్పు
మిక్సీ పట్టడం కోసం:
4 వెల్లుల్లి రెబ్బలు
2 ఎండుమిర్చి
అరచెంచా మిరియాలు
1 చెంచా జీలకర్ర
కొబ్బరి చారు తయారీ విధానం:
- ముందు మిక్సీ జార్ లో వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి వేసి బరకగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు పచ్చికొబ్బరిని ముక్కలుగా చేసుకుని మిక్సీ పట్టుకోండి. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీ పడితే మెత్తగా అయిపోతుంది. ఈ మిశ్రమాన్ని ఒక గుడ్డలోకి తీసుకుని పిండితే కొబ్బరి పాలు వస్తాయి. వాటిని పక్కన పెట్టుకోండి. మీకు రెడీమేడ్ గా పాలు
- ఒక ప్యాన్ తీసుకుని రెండు చెంచాల నూనె వేసుకోండి. వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకుని నిమిషం వేయించండి.
- అందులోనే మిక్సీ పట్టుకున్న మసాలాకూడా వేసి కలపండి. పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కూడా వేసి మెత్తబడనివ్వండి.
- ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి వేసి మరోసారి కలియబెట్టండి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న కందిపప్పు, చింతపండు రసం, నీళ్లు పోసుకోండి.
- రుచికి తగినంత ఉప్పు చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. మీకిష్టముండే అర టీస్పూన్ పంచదార వేశారంటే రుచి మరింత బాగుంటుంది.
- అన్నీ వేశాక ఒక పొంగువచ్చేదాకా ఉడికించండి. ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు పోసేయండి. ఒక పొగు రాగానే స్టవ్ కట్టేసి కొత్తిమీర తరుగు చల్లి దించేసుకుంటే మీరు మర్చిపోలేని రుచితో కొబ్బరి చారు రెడీ.
టాపిక్