Evening Snack | దేశీ స్టైల్లో మ్యాగీ నూడుల్స్ మాస్టర్‌చెఫ్ రెసిపీ ఇది!
22 March 2022, 17:53 IST
- సాయంత్రం వేళ స్నాక్స్ లాగా ఏదైనా తినాలనిపిస్తే మాస్టర్‌చెఫ్ పంకజ్ బదౌరియా సరికొత్త హక్కా నూడుల్స్ రెసిపీని పరిచయం చేస్తున్నారు.
Noodles
నూడుల్స్ అంటే మనలో చాలా మందికి ఇష్టం ఉంటుంది. కొంతమంది అమ్మాయిలకు కూడా ముద్దుగా నూడుల్స్, మ్యాగీ అనే పేర్లతో పిలుచుకుంటుంటారు. సాయంత్రం సమయంలో కొద్దిగా ఏదైనా తినాలి అనిపించినపుడు మనకు తక్కువ టైంలో తక్షణమే ఏదైనా చేసుకునే వంటకం ఉందీ అంటే అది నూడుల్స్.
ఇప్పుడు నూడుల్స్‌తో రకరకాల ప్రయోగాలు చేస్తూ సరికొత్త రుచులను పరిచయం చేస్తున్నారు. వెజిటేబుల్ నూడుల్స్, శాండ్‌విచ్ నూడుల్స్, నూడుల్ కట్‌లెట్‌లు ఇలా ఎన్నో వచ్చాయి. మీకు నచ్చినట్లుగా, మీరు మెచ్చేట్లుగా సరికొత్తగా మాస్టర్‌చెఫ్ పంకజ్ బదౌరియా సరికొత్త హక్కా నూడుల్స్ రెసిపీని పరిచయం చేస్తున్నారు. మరి ఇందుకు కావాల్సినవి, ఎలా తయారో చేసుకోవాలో ఇక్కడ చూడండి.
మ్యాగీ హక్కా నూడుల్స్ మాస్టర్‌చెఫ్ పంకజ్ బదౌరియా రెసిపీ కోసం కావాల్సిన పదార్థాలు
- 2 ప్యాక్‌ల ఇన్‌స్టంట్ నూడుల్స్
- తురిమిన క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ అలాగే బీన్స్
- తరిగిన ఉల్లి కాడలు
- ఎండు మిర్చి ముక్కలు
- 2 tsp తరిగిన వెల్లుల్లి
- 1 టీస్పూన్ నువ్వులు
- వైట్ వెనిగర్
తయారీ విధానం
* ఒక పాన్ తీసుకుని అందులో 3 కప్పుల నీటిని మరిగించాలి.
* వేడినీళ్లలో రెండు ప్యాక్‌ల ఇన్‌స్టంట్ నూడిల్స్ వేసి రెండు నిమిషాలు ఉడికించాలి.
* ఉడికిన మ్యాగీ నూడుల్స్ గిన్నెలో చల్లటి నీరు పోసి, ఆపై ఆ నీటినంతా తీసేయండి.
* ఇప్పుడు ఆ నూడుల్స్ కి 1 స్పూన్ నూనె వేసి బాగా కలపండి
* పాన్‌లో 1 టేబుల్‌స్పూను నూనెను వేడి చేయండి. ఆ నూనెలో 1 స్పూన్ వెల్లుల్లి వేసి వేయించాలి. తర్వాత తురిమిన బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ వేసి బాగా కలపాలి.
* ఇప్పుడు పాన్‌లో నూడుల్స్ వేసి కలపండి
* ఆపై 1/2 టీస్పూన్ సోయా సాస్, ఒక 1/2 టీస్పూన్ వైట్ వెనిగర్ వేయండి
* ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయండి. 2 నిమిషాలు వేయించి కదిలించాలి.
* ఇప్పుడు ఇంకొక గిన్నెలో కొద్దిగా నూనె వేడి చేసి, అందులో స్ప్రింగ్ ఆనియన్స్, ఎండుమిర్చి, 1 tsp తరిగిన వెల్లుల్లి, 1 tsp నువ్వులు వేసి పోపు వేసుకోవాలి. ఈ పోపును నూడుల్స్ పై వేసి కలపండి.
ఘుమఘుమలు వెదజల్లే, నూరురించే వేడివేడి హక్కా నూడుల్స్ రెడీ అయింది. కుమ్మేయండి!
టాపిక్