తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Smoothie For Weight Loss | ఈ గ్లూటన్​ ఫ్రీ స్మూతీతో బరువు తగ్గవచ్చు

Smoothie For Weight loss | ఈ గ్లూటన్​ ఫ్రీ స్మూతీతో బరువు తగ్గవచ్చు

22 March 2022, 10:32 IST

    • ఉదయాన్నే వంట చేసుకోవడం నచ్చని వారికి ఈ స్మూతీ ఓ మంచి ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. తయారు చేసుకోవటం చాలా సులువు కానీ.. రాత్రి మాత్రం కొంచెం పని ఉంటుంది. ఈ గ్లూటన్ ఫ్రీ స్మూతీ.. మీ బరువును అదుపులో ఉంచడమే కాకుండా చాలా లాభాలను అందిస్తుంది. మరి దానిని ఎలా తయారు చేసుకోవాలో, దాని వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం.
స్మూతీ
స్మూతీ

స్మూతీ

ఆరోగ్యాన్ని ఇస్తూ, బరువు తగ్గించే ఆహారపదార్థాలను ఎవరు కాదనగలరు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది ఈ స్మూతీ. ఇది బరువు తగ్గేందుకు కృషి చేయడమే కాకుండా.. బ్లడ్ ప్రెజర్​ను అదుపులో ఉంచేందుకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి దీనిని మీరు మీ డైట్​లో యాడ్​ చేసుకోవచ్చు. పైగా ఇది గ్లూటన్ ఫ్రీ. మీరు ఫిట్​నెస్​ ఫ్రీక్​ అయితే ఇది మీ రోజూవారీ డైట్​లో భాగమైపోతుంది. ఇప్పుడు దానిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

కావాల్సిన పదార్థాలు

* ఓట్స్- 10 గ్రాములు (రాత్రంతా నానబెట్టాలి)

* వేరుశనగ-1 టేబుల్ స్పూన్ (రాత్రంతా నానబెట్టాలి)

* ఖర్జూరం-15 గ్రాములు (సీడ్స్ లేనివి)

* చియా సీడ్స్- 1 టేబుల్ స్పూన్

* బాదం- 4 (రాత్రంతా నానబెట్టాలి)

* మామిడి- 70 గ్రాములు

* దాల్చినచెక్క పొడి - అర టీ స్పూన్

* పాలు- 1 కప్పు (లేదా మంచి నీళ్లు తీసుకోవచ్చు)

తయారీ విధానం

మిక్సీ జార్​లో ఓట్స్, వేరుశనగ, ఖర్జూరం, చియాసీడ్స్, బాదం, మామిడి ముక్కలు, దాల్చిన చెక్క పొడి, పాలు లేదా నీళ్లు వేసి మిక్సీ చేయాలి. ఈ స్మూతీని గ్లాస్​లోకి తీసుకుని దానిపై బాదం, పిస్తా, మామిడి ముక్కలతో లేదా మీకు నచ్చిన నట్స్, ఫ్రూట్స్​తో దానిని గార్నిష్ చేసుకోవాలి. అంతే సింపుల్​గా ఉండే ప్రోటీన్స్​తో నిండిన హెల్తీ స్మూతీ రెడీ. ఉదయాన్నే లేదా లంచ్​కి ముందు దీనిని హ్యాపీగా లాగించేవచ్చు.

ఈ స్మూతీ మొత్తం 237 క్యాలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది మీ డైట్​లో తప్పక చేర్చుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులువు కాబట్టి.. మీరు ట్రై చేయండి.

* ప్రోటీన్- 5.7 గ్రాములు

* కొవ్వులు- 8.4 గ్రాములు

* కార్బ్స్- 35 గ్రాములు

* ఫైబర్- 6.5 గ్రాములు

ఓట్స్ ఆరోగ్యకరమైన హెల్తీ డైట్​లో ఓ భాగం. ప్రతి ఉదయాని ఓట్స్​తో ప్రారంభించేవారు చాలా మందే ఉన్నారు. ఓట్స్​లో చాలా న్యూట్రిషన్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్​తో పూర్తిగా నిండి ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువ మోతాదులో ఫైబర్, ప్రోటీన్​ కలిగి ఉంటాయి. ఇవి కొలస్ట్రాల్, బ్లడ్ షుగర్ తగ్గించేందుకు సహాయం చేస్తాయి.

 

తదుపరి వ్యాసం