Evening Snacks| సాయంత్రం వేళ.. ఈ స్పాంజ్ కేక్‌ను ఆస్వాదించేయండి
09 March 2022, 18:15 IST
- అసలే సాయంత్రం. పనులకు బ్రేక్ ఇచ్చి.. కాఫీనో, టీనో తాగాలని మనసు ఆరాటపడే సమయం. ఈ సమయంలో ఈ ఛాయ్‌కు ఓ చక్కని స్నాక్ తోడైతే.. ఆహా అనిపిస్తుంది. అది ఇంట్లోనే చేసుకునేదే అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని పదార్థాలతోనే ఓ చక్కని హెల్తీ, టేస్టీ వంటకాన్ని చేసుకుని తింటే వచ్చే తృప్తే వేరు. అలాంటి వారికోసమే ఈ ఎగ్ లెస్ వెనీలా స్పాంజ్ కేక్.
ఎగ్ లెస్ వెనీలా స్పాంజ్ కేక్
Eggless Vanilla Sponge Cake | ఎగ్‌లెస్ వెనీలా స్పాంజ్ కేక్ పేరు వింటుంటేనే నోరూరుతుంది కదూ. కానీ ఇది ఇంట్లో తయారు చేసుకోగలమా అంటే చేసుకోవచ్చు మరి. కాస్త ఓపిక ఉంటే మెత్తని నోరూరించే ఎగ్‌లెస్ వెనిలా స్పాంజ్ కేక్ తయారు చేసుకోవచ్చు. దీనిని శాఖాహారులు కూడా హ్యాపిగా ఇంట్లో చేసుకుని.. ఇంటిల్లాపాది తినొచ్చు.
ఈ ఎగ్‌లెస్ వెనీలా స్పాంజ్ కేక్ తయారు చేయడానికి కేవలం 7 పదార్థాలే అవసరమవుతాయి. దీనిలో వెనీలా మాత్రమే కాకుండా వేరే ఫ్లేవర్‌తో లేదా నచ్చిన ఫ్లేవర్‌తో ఈ కేక్‌ను సిద్ధం చేయవచ్చు.
కావాల్సిన పదార్థాలు
* ఫ్లోర్- ఒకటిన్నర కప్పు
* బేకింగ్ సోడా- అర టీ స్పూన్
* బేకింగ్ పౌడర్-1 టేబుల్ స్పూన్
* కన్డెన్స్డ్ మిల్క్ - ముప్పావు కప్పు
* సాల్టడ్ బటర్- అరకప్పు
* పాలు- కప్పు
* వెనీలా ఎక్స్ట్రాక్ట్- 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
బటర్‌ను కరిగించి ఓ ట్రేలో వేయాలి. దానిలో కండెన్స్డ్ మిల్క్‌లో వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసి బాగా కలపాలి. దానిలో ఫ్లోర్ వేసి.. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి, పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని 180 డిగ్రీల హీట్‌లో ఉంచిన ఓవెన్లో 35-40 నిమిషాలు కుక్ చేయాలి.
ఓవెన్ నుంచి బయటకు తీసిన తర్వాత కట్ చేసుకుని.. సర్వ్ చేసుకుంటే.. అందరూ తినొచ్చు. టీ లేదా కాఫీతో దీనిని తీసుకుంటే చాలా ఈవెనింగ్ని హ్యాపీగా గడిపేయవచ్చు.