తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Longevity Boosting Habits। ఈ 8 అలవాట్లతో మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చు!

Longevity boosting Habits। ఈ 8 అలవాట్లతో మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చు!

HT Telugu Desk HT Telugu

25 July 2023, 16:06 IST

google News
    • Longevity boosting habits: వయసు మీరిన వారు, ఇప్పటికే అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా జీవితంపై ఆశ కోల్పోవాల్సిన అవసరం లేదు, మీ జీవిత కాలాన్ని పొడగించుకోవడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలో ఈ కింద చూడండి.
Longevity boosting habits
Longevity boosting habits (istock)

Longevity boosting habits

Longevity boosters: సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించటానికి సమయం ఎప్పుడూ మించిపోదు. మీరు 50 లేదా 60 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పటికీ కూడా, ఆరోగ్యకరమైన అలవాట్లను స్వీకరించటం ద్వారా చురుకుగా ఉండవచ్చు. కొన్ని జీవనశైలి మార్పులతో మీ ఆయుష్షును మరిన్ని దశాబ్దాలు పొడగించుకోవచ్చు. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చునని ఒక తాజా పరిశోధనలో తేలింది. వెటరన్స్ అఫైర్స్ మిలియన్ వెటరన్ ప్రోగ్రామ్‌ అధ్యయనంలో 40 నుంచి 99 సంవత్సరాల వయస్సు గల 700,000 మందిపై అధ్యయనం చేశారు. 40, 50 లేదా 60 ఏళ్ల తర్వాత ప్రజలు ఏం చేస్తే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చో అధ్యయనం చేశారు. ఈ మేరకు సమర్థవంతమైన జీవనశైలి మార్పులను జాబితా చేసినట్లు ది గార్డియన్ నివేదించింది.

VA బోస్టన్ హెల్త్‌కేర్ సిస్టమ్‌లోని మిలియన్ వెటరన్ ప్రోగ్రామ్‌ ప్రధాన అధ్యయన రచయిత, ఆరోగ్య శాస్త్ర నిపుణుడు అయినటువంటి జువాన్-మై టి న్గుయెన్ మాట్లాడుతూ " వయసు మీరిన వారు, ఇప్పటికే అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా జీవితంపై ఆశ కోల్పోవాల్సిన అవసరం లేదు. కేవలం జీవనశైలిలో చిన్న మార్పులను చేయడం ద్వారా వారి జీవితకాలం పెంచుకోవచ్చు" అని చెప్పారు. అయితే టైప్ 2 మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, స్ట్రోక్, క్యాన్సర్ మొదలైన వ్యాధులను ఈ జీవనశైలి మార్పులతో నయం చేయగలం అని చెప్పడం లేదు గానీ, ఎలాంటి సమస్యలు రాని జీవితాన్ని అనుభవించడానికి ఇది సహాయపడుతుందని ఆయన చెప్పారు.

మిమ్మల్ని ఎక్కువ కాలం జీవించేలా చేసే ఆరోగ్యకరమైన అలవాట్ల కోసం ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం లేదు, కావాల్సింది బలమైన సంకల్పం అని పరిశోధకులు చెబుతున్నారు. పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుండటం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల తీవ్రత మరింత ముదరకుండా నియంత్రించవచ్చు. క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, కాలేయ వ్యాధులు వంటి వ్యాధులు సిగరెట్లు తాగడం లేదా మద్యం సేవించడం వంటి అలవాట్లతో ముడిపడి ఉంటాయి, కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. వ్యాయామం చేయకుండా, శారీరక శ్రమ లేకుండా కూర్చోవడానికి బదులు ఎల్లప్పుడూ చురుకుగా ఉండటానికి ప్రయత్నిస్తే నిండుగా వందేళ్లు బ్రతకవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇది కాకుండా, అధిక స్థాయి ఒత్తిడి కొలెస్ట్రాల్ స్థాయిలు, బ్లడ్ షుగర్, రక్తపోటును పెంచుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశం అని స్పష్టం చేస్తున్నారు.

ఈ అధ్యయనం ప్రకారం మీ జీవిత కాలాన్ని పొడగించుకోవడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలో ఈ కింద చూడండి.

1. మంచి ఆహారాన్ని తినండి

2. సిగరెట్లు మానుకోండి

3. రాత్రికి హాయిగా నిద్రపోండి

4. శారీరకంగా చురుకుగా ఉండండి

5. ఒత్తిడిని నియంత్రించండి

6. అతిగా మద్యం తాగడం మానుకోండి

7. ఓపియాయిడ్ వ్యసనం నుండి విముక్తి పొందండి

8. సానుకూల సామాజిక సంబంధాలను కలిగి ఉండండి.

ఈ ఎనిమిది జీవనశైలి మార్పులను స్వీకరించిన పురుషులు, మహిళలు వారి జీవితకాలాన్ని అదనంగా 23.7 ఏళ్లు లేదా 22.6 సంవత్సరాల ఆయుర్దాయం పొందగలరు అని అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

తదుపరి వ్యాసం