HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bride Things: పెళ్లికూతురి సామాన్ల లిస్టు, అవసరమున్న వాళ్లకి పంపితే పెళ్లి షాపింగ్ సులభం

Bride things: పెళ్లికూతురి సామాన్ల లిస్టు, అవసరమున్న వాళ్లకి పంపితే పెళ్లి షాపింగ్ సులభం

02 September 2024, 20:00 IST

  • Bride things: పెళ్లికూతురికి అవసరమయ్యే కొన్ని వస్తువులుంటాయి. వాటిలో కొన్ని తరచూ మర్చిపోతుంటారు. ఆ ఇబ్బంది లేకుండా పెళ్లికూతురికి కావాల్సిన వస్తువులన్నీ ఈ లిస్టులో ఇచ్చాం. అవసరమున్న వాళ్లకి ఈ లిస్టు పంపండి. మీకూ అవసరమైతే సేవ్ చేసి పెట్టుకోండి.

పెళ్లికూతురికి కావాల్సిన వస్తువులు
పెళ్లికూతురికి కావాల్సిన వస్తువులు (pexels)

పెళ్లికూతురికి కావాల్సిన వస్తువులు

బంధువుల పెళ్లంటేనే రెడీ అవ్వడానికి హడావుడి చేస్తాం. ఏవేవో కొనేసుకుంటాం. అలాంటిది మన పెళ్లికి ఏ లోటూ లేకుండా ప్రతిదీ కొనుక్కోవాల్సిందే. ఎంత లిస్టు తయారు చేసుకున్నా కొన్ని వస్తువులు సందర్భం వచ్చేదాకా గుర్తురావు. అలాంటి తప్పు జరగకుండా పెళ్లికోసం అవసరమయ్యే వస్తువులేంటో ముందుగానే ఓచోట రాసుకుని పెట్టుకోవాలి. జుట్టు కోసం, మేకప్ కోసం, నగలు ఇలా ఏమేం అవసరమవుతాయో అంచనాకు రావాలి. అంత సమయం మీకు లేకపోతే, ఏమైనా మర్చిపోతాం అనిపిస్తే కింద ఇచ్చిన లిస్టు చూడండి. ప్రతిదీ గుర్తుంటుంది. మీ అవసరాన్ని బట్టి వీటిలో కొన్ని కొనక్కర్లేదు. మరికొన్ని అదనంగా కొనాల్సి రావచ్చు. ఒకసారి చూసేయండి..

1. జుట్టుకోసం అవసరమ్యే వస్తువులు:

జడ కుచ్చులు

ఆర్టిఫిషియల్ పువ్వులు

జడ కొప్పు

పూల జడ

పాపిడ బిల్ల పెట్టడానికి నల్లటి దారం

హెయిర్ పిన్స్ (చిన్నవి, పెద్దవి)

యూ పిన్స్

టిక్ టాక్ పిన్స్ (నలుపు రంగువి)

రబ్బర్ బ్యాండ్లు ( నలుపువి)

హెయిర్ ఎక్స్‌టెన్షన్ లేదా సవరం (మీ హెయిర్ స్టైల్ బట్టి)

చిన్న క్లిప్పులు

మీ హెయిర్ స్టైల్ బట్టి ముత్యాలు, స్టోన్ స్టిక్కర్లు అవసరమైతే చూసుకోండి.

2. జ్యువెలరీ

పాపిడ బిల్ల

ముక్కు పుడక (నోజ్ రింగ్)

W ఆకారం మాంగ్ టిక్కా

జుంకాలు

చంప స్వరాలు

చోకర్

మెడలో వేసుకునే హారాలు

బాజూబంద్ లేతా వంకీలు

చేతి ఉంగరం

వడ్డాణం

చీర పిన్ను

పట్టీలు

3. మేకప్ సామాన్లు:

ఐషాడో

ఐలైనర్

ఐబ్రో పెన్సిల్

మాయిశ్చరైజర్

ప్రైమర్

బ్లష్

మేకప్ స్ప్రే

సెట్టింగ్ పౌడర్

మేకప్ బ్రష్

మేకప్ స్పాంజి

లిప్‌స్టిక్

మేకప్ రిమూవర్

మేకప్ రిమూవర్ ప్యాడ్స్

నెయిల్ పాలిష్

నెయిల్ పాలిష్ రిమూవర్

4. ఫ్రెషప్ అవ్వడానికి అవసరమయ్యేవి

సబ్బు

ఫేస్‌వాష్

షాంపూ

టవెల్

బాత్‌రూం స్లిప్పర్లు

మేకప్ వేసుకునేటప్పుడు అవసరమయ్యే బాత్ రోబ్

టవెల్

5. ముఖం కోసం

తిలకం లేదా బింది

తిలకం పెట్టడానికి టూత్‌పిక్

కుంకుమ

బుగ్గమీద పెట్టడానికి నలుపు రంగు స్టిక్కర్లు

6. బట్టలు

ఏ చీరకు ఆ చీరకు సంబంధించిన బ్లవుజు, పెటికోట్ ఒకదగ్గర పెట్టుకోవాలి

పెటికోట్ కోసం అవసరమనుకుంటే అదనంగా నాడాలు వెంట ఉంచుకోవాలి

7. కొన్ని ఇతర వస్తువులు:

పారాణి పెట్టడానికి క్యూ టిప్ లేదా ఇయర్ బడ్

టిష్యూలు (వెట్, డ్రై)

సేఫ్టీ పిన్నులు

స్వెట్ ప్యాడ్స్ (బ్లవుజుకు పెట్టడానికి)

అద్దం

దువ్వెన

కర్చీఫ్

సూది, దారం ఉండ

ఎమర్జెన్సీ కోసం మెడిసిన్

మెహందీ కోన్స్

టాపిక్

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్