తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Raitha Side Effects: రైతాతో భోజనం ముగిస్తే మేలు చేసినట్లు కాదు.. ఎందుకో చూడండి

Raitha side effects: రైతాతో భోజనం ముగిస్తే మేలు చేసినట్లు కాదు.. ఎందుకో చూడండి

26 September 2024, 19:00 IST

google News
  • Raitha side effects: ఆయుర్వేదం ప్రకారం ఉల్లిపాయ, పెరుగు రెండింటి స్వభావాలు వేరుగా ఉంటాయి. రైతా కోసం పెరుగలో ఉల్లిపాయ ముక్కలను కలిపి తినడం వల్ల దాని ప్రభావం ఎలా ఉంటుందో వివరంగా తెల్సుకోండి. 

రైతా
రైతా (shutterstock)

రైతా

ఆయుర్వేదంలో, ఆరోగ్యంగా ఉండటానికి ఆహారానికి సంబంధించిన అనేక నియమాలు వివరించారు. వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి నియమాల్లో ఒకటి పెరుగు, ఉల్లిపాయల కలయిక. ఆయుర్వేదం ప్రకారం ఉల్లి, పెరుగు కలిపి తినే తప్పు చేయకూడదు. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు, జీర్ణ సంబంధ సమస్యలు ఇబ్బంది పెడతాయి.

ఆయుర్వేదం ప్రకారం ఉల్లిపాయ, పెరుగు రెండింటికి విభిన్న స్వభావాలుంటాయి. ఉల్లిపాయ వేడి చేసే స్వభావం అయితే, పెరుగు ప్రభావం చల్లగా ఉంటుంది. అంతే కాక ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి పెరుగులో ఉన్న కాల్షియం వంటి పోషకాలను గ్రహించడానికి ఆటంకం కలిగిస్తాయి. పెరుగు, ఉల్లిపాయ కలిపి తింటే కలిగే అనర్థాలేంటో తెలుసుకుందాం.

పెరుగు, ఉల్లి కలిపి తినడం వల్ల నష్టాలు:

గ్యాస్ట్రిక్ సమస్యలు:

ఉల్లిపాయలను ఎక్కువ మోతాదులో తీసుకుంటే అందులో ఉండే అనేక సమ్మేళనాలు ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తాయి. పెరుగు ఎక్కువగా తీసుకున్నా కూడా ఇంచుమించు ఇదే ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల గ్యాస్ట్రిక్, ఉబ్బరం, అజీర్ణ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

వేడి పెరగడం:

పెరుగు స్వభావం చల్లగా ఉంటే, ఉల్లిలో ఉండే సల్ఫర్ కారణంగా అది వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఉల్లిపాయ, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది టాక్సిన్స్ స్థాయిని పెంచుతుంది. ఇది చర్మం మీద దద్దుర్లు, తామర, సోరియాసిస్, ఇతర చర్మ అలెర్జీలకు దారితీస్తుంది.

అజీర్ణం:

పెరుగు, ఉల్లిపాయలను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు. పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి, ఉల్లిపాయలలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఈ రెండింటి కలయిక జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది. ప్రొబయాటిక్స్ ఆహారం జీర్ణం అవ్వడానికి సాయపడతాయి. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ , పీచు శాతం పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా పని చేయకుండా చేస్తుంది. జీర్ణ శక్తికి ఇది ఆటంకం కావచ్చు. దాంతో గ్యాస్, అజీర్ణం సమస్యలొస్తాయి.

పెరుగు మరియు ఉల్లిపాయలను ఎలా తినొచ్చు?

పాతకాలం వంటల్లో పెరుగు, ఉల్లిపాయ కలిపి తింటాం కదా? అనుకోవచ్చు. ఎన్నో సాంప్రదాయ వంటల్లోనూ వీటి కలయికతో రుచులుంటాయి. కానీ మీరు కాస్త నిశితంగా పరిశీలిస్తే వేటిలోనూ పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని నేరుగా పెరుగులో కలపరు. అక్కడే ఉంది మ్యాజిక్ అంతా.. మీకు ఉల్లిపాయ, పెరుగు కాంబినేషన్ నచ్చితే వాటిని నూనెలో కాస్త వేయించి వాటిని చల్లారాక పెరుగులో కలపండి. మజ్జిగ పులుసు లాంటివి ఇదే పద్ధతిలో చేస్తారని గమనించండి. ఉల్లిపాయల్ని ఫ్రై చేయడం వల్ల అనారోగ్యం కలిగించే సమ్మేళనాల ప్రభావం తగ్గిపోతుంది. హ్యాపీగా ఈ కాంబినేషన్ ఆస్వాదించొచ్చు.

కాబట్టి బిర్యానీలు, మసాలాలు దట్టించిన ఆహారం తిన్నాక రైతాతో ముగించి శరీరానికి మేలు చేస్తున్నాం అనుకోకండి. ముఖ్యంగా గిన్నెల కొద్దీ లాగించకండి.

తదుపరి వ్యాసం