తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monsoon Snacks: గుప్పెడు పల్లీలుంటే పల్లీల చాట్, మొక్కజొన్నతో క్రిస్పీ కార్న్ చాట్.. ఇలా చేసేయండి

Monsoon Snacks: గుప్పెడు పల్లీలుంటే పల్లీల చాట్, మొక్కజొన్నతో క్రిస్పీ కార్న్ చాట్.. ఇలా చేసేయండి

20 July 2024, 15:30 IST

google News
  • Monsoon Snacks: వేయించిన పల్లీలతో వేరుశనగ చాట్, మొక్కజొన్న గింజలతో క్రిస్పీ కార్న్ చాట్ ఎలా చేసుకోవాలో వివరంగా చూసేయండి. వర్షాకాలంలో బెస్ట్ స్నాక్ రెసిపీలు ఇవి. 

కార్న్ చాట్, పీనట్ చాట్
కార్న్ చాట్, పీనట్ చాట్

కార్న్ చాట్, పీనట్ చాట్

వర్షం పడుతుందీ అంటే నోటికి వేడిగా, కారంగా ఏదైనా తగలాల్సిందే. ఇక సాయంత్రం సమయంలో ఏదైనా స్నాక్ చేస్తే ఇంటిళ్లిపాదీ ఇష్టంగా తింటారు. అలాగనీ ఎక్కువ సమయం కేటాయించక్కర్లేదు. చాలా సింపుల్ గా రెడీ అయిపోయే రెండు చాట్ రెసిపీలు చూడండి. ఒకటి వేయించిన పల్లీలతో, మరొకటి మొక్కజొన్న గింజలతో చేసుకోవచ్చు. ఆ రెసిపీలు చూడండి.

1. వేరుశనగ చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

200 గ్రాముల వేరుశనగలు

సగం చెంచా కారం

పావు టీస్పూన్ పసుపు

1 చెంచా చాట్ మసాలా

సగం చెంచా జీలకర్ర పొడి

1 చెంచా నూనె

తగినంత ఉప్పు

బేల్ కోసం:

1 ఉల్లిపాయ సన్నటి ముక్కలు

1 టమాటా సన్నటి ముక్కలు

పావు కప్పు సన్నగా తరిగిన కీరదోస ముక్కలు

గుప్పెడు కొత్తిమీర తరుగు

1 చెంచా నిమ్మరసం

2 చెంచాల సేవ్

కొద్దిగా ఉప్పు

పల్లీలతో చాట్ తయారీ విధానం:

  1. ఈ పల్లీల చాట్ తయారీ కోసం ముందుగా మసాలా పల్లీలను రెడీ చేసుకోవాలి.
  2. ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. పల్లీలను రంగు మారేదాకా ఒక రెండు నిమిషాలు వేయించుకుని తీసుకోవాలి. నూనె వాడటం ఇష్ట లేకపోతే కేవలం నూనె లేకుండా వేయించిన పల్లీలు కూడా వాడుకోవచ్చు.
  3. పల్లీలలో కారం, పసుపు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం పాటూ అన్నీ కలిసేలా పల్లీలు వేయించాలి. మసాలా పల్లీలు రెడీ అయినట్లే.
  4. ఇప్పుడు చాట్ కోసం ఒక పెద్ద గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కీరదోస ముక్కలు, కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి.
  5. అందులోనే మసాలా పల్లీలు, నిమ్మరసం వేసుకుని తగినంత ఉప్పు చల్లి బాగా కలుపుకుంటే చాలు.
  6. ప్లేట్ లో ఈ పల్లీల మిశ్రమం కొద్దిగా పెట్టి మీద సేవ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి.
  7. చాయ్ లోకి, సాయంత్రం పూట స్నాక్ లోకి అదిరిపోతుంది.

2. క్రిస్పీ కార్న్ చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

2 కప్పుల స్వీట్ కార్న్

2 చెంచాల మైదా

1 చెంచా కారం

పావు టీస్పూన్ ఆమ్‌చూర్ పొడి

తగినంత ఉప్పు

డీప్ ఫ్రై కోసం నూనె

1 ఉల్లిపాయ సన్నం ముక్కలు

1 చెంచా నిమ్మరసం

కొద్దిగా కొత్తిమీర తరుగు

క్రిస్పీ కార్న్ చాట్ తయారీ విధానం:

  1. ఒక పెద్ద గిన్నెలో స్వీట్ కార్న్ వేసుకోవాలి. అందులో మైదా, కారం, ఉప్పు, ఆమ్‌చూర్ పొడి వేసుకుని కలుపుకోవాలి. చెంచా నీళ్లు పోసుకుంటే మొక్కజొన్న గింజలకు పిండి అతుక్కుంటుంది.
  2. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని నూనె పోసుకోవాలి. అది వేడెక్కాక సిద్దం చేసి పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని వేసుకోవాలి. ముద్దలాగా కాకుండా విడివిడిగా వేసుకోవాలి. లేదంటే లోపల వేగవు. ముద్దలాగా వస్తాయి.
  3. కాస్త రంగు మారాక మొక్కజొన్నల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని సర్వ్ చేసుకుంటే చాలు. బెస్ట్ స్నాక్ రెడీ.

టాపిక్

తదుపరి వ్యాసం