తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  How To Eat Dry Fruits: ఆయుర్వేదం ప్రకారం డ్రై ఫ్రూట్స్‌ని ఇలా తింటేనే.. లాభాలెక్కువ..

How to eat Dry Fruits: ఆయుర్వేదం ప్రకారం డ్రై ఫ్రూట్స్‌ని ఇలా తింటేనే.. లాభాలెక్కువ..

19 October 2023, 12:00 IST

google News
  • How to eat Dry Fruits: డ్రై ఫ్రూట్స్ తినడంతో పాటే.. వాటి నుంచి పూర్తి ప్రయోజనాలు పొందాలంటే అవి తినడానికి ఒక పద్ధతుంది. అదేంటో తెలుసుకోండి.

డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్

అనాదిగా భారత దేశంలో అత్యంత ప్రజాదరణ పొందింది ఆయుర్వేద వైద్యం. మనిషి శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలను సరి సమానంగా చేస్తే రోగాలు రావని చెబుతుంది. వీటిని బ్యాలెన్స్‌ చేయడం ఈ వైద్యంలో ఒక భాగం. మనం జీడి పప్పు, బాదాం, ఎండు ద్రాక్ష, ఖర్జూరం లాంటి ఎన్నో డ్రై ఫ్రూట్స్ ని ఆరోగ్య ప్రయోజనాల కోసం తింటుంటాం. ఎప్పుడు, ఎలా తింటే వీటి వల్ల వచ్చే ప్రయోజనాలు చక్కగా శరీరానికి అందుతాయో ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుని ఆచరించేందుకు ప్రయత్నిద్దాం.

శరీర స్వభావాన్ని బట్టి తినాల్సి ఉంటుంది :

డ్రై ఫ్రూట్స్‌లో కిస్‌మిస్‌లు, అంజీర్‌ల లాంటివి చలవ చేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. మన శరీరంలో పిత్త దోషం ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే జీడిపప్పు, పిస్తా.. లాంటివి కొద్దిగా వేడి చేసే లక్షణాలతో ఉంటాయి. అంటే మన శరీరంలో వాత, కఫ లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని తినడం వల్ల సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి శరీరంలో ఉన్న మూడు దోషాలనూ బ్యాలెన్స్‌ చేస్తాయి. ఈ గుణాలను, మన శారీరక స్వభావాలను దృష్టిలో ఉంచుకుని వీటిని తినాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

  • వాత దోషం ఉన్న వారికి ఒళ్లు నొప్పులు, నడుం నొప్పులు, మెడ నొప్పుల్లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారు బాదాం, ఖర్జూరం, జీడిపప్పు లాంటి వాటిని తినాల్సి ఉంటుంది.
  • పిత్త దోషం ఎక్కువగా ఉండటం అంటే వేడి శరీరం గలవారని అర్థం. వీరిలో తలనొప్పులు, కాళ్లు పగలడం, జుట్టు రాలడం లాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వారు చలవ చేసే ఎండు ద్రాక్ష, ఎండు కిస్‌మిస్‌, అంజీర్‌ లాంటివి తినొచ్చు.
  • అదే కఫ దోషం ఎక్కువగా ఉన్న వారికి శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కఫం ఎక్కువగా ఉండటం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, ఆస్తమా లాంటివి ఉంటాయి. ఇలాంటి వారు పిస్తా, బాదం లాంటి వాటిని ఎంచుకోవచ్చు. ఈ మూడు దోషాలు ఉన్న వారూ వాల్‌నట్స్‌ని తినొచ్చు.

డ్రై ఫ్రూట్స్‌ని ఎలా తినాలి :

కొందరు డ్రై ఫ్రూట్స్‌ని రోస్ట్‌ చేసుకుని తింటారు. కొందరు నెయ్యిలో ఉప్పూ కారం, మసాలాలు చల్లి తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఆయుర్వేద నిపుణులు మాత్రం వీటిని ఏమీ చేయకుండా సహజంగా ఉన్న వాటిని ఉన్నట్లుగా తినమంటున్నారు. నెయ్యిలో వేయించడం, ఉప్పును పై నుంచి చల్లుకోవడం లాంటి వాటి వల్ల మనలోకి ఎక్కువగా కొవ్వులు, సోడియం చేరతాయంటున్నారు. అందువల్ల దుష్ప్రభావాలు ఉంటాయని చెబుతున్నారు. వీటిలో పోషకాలు, పీచు పదార్థం అధికంగా ఉంటాయి కాబట్టి బాగా నమిలి తినమని సలహా ఇస్తున్నారు.

తదుపరి వ్యాసం