తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Blood Clotting: ప్రతి విషయానికి ఆందోళన పడకండి, రక్తం గడ్డ కట్టేస్తుందంటున్న అధ్యయనం

Blood clotting: ప్రతి విషయానికి ఆందోళన పడకండి, రక్తం గడ్డ కట్టేస్తుందంటున్న అధ్యయనం

21 July 2024, 9:30 IST

google News
  • Blood clotting: ఆందోళన, డిప్రెషన్ వల్ల సిరల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ వివరాలు తెల్సుకోండి.

ఆందోళనకు రక్తం గడ్డకట్టడానికి సంబంధం
ఆందోళనకు రక్తం గడ్డకట్టడానికి సంబంధం (Photo by Unsplash)

ఆందోళనకు రక్తం గడ్డకట్టడానికి సంబంధం

ఆందోళన లేదా నిరాశ ఎక్కువగా ఉండటం వల్ల తీవ్రమైన రక్తం గడ్డకట్టే పరిస్థితి వచ్చే ప్రమాదం దాదాపు 50 శాతం పెరుగుతుందని కొత్త అధ్యయనం చెబుతోంది.

మెదడులో పెరిగిన ఒత్తిడి-సంబంధిత చర్యలు, మంటతో పాటు - మానసిక అనారోగ్యాల కారణంగా - లోతైన సిరల థ్రోంబోసిస్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని బ్రెయిన్ ఇమేజింగ్ లో తెలిసింది. దీనిలో సిర లోపల రక్తం గడ్డకడుతుంది.

ఎంతమంది మీద పరిశోధన చేశారంటే..

అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు ఆందోళన, నిరాశ మధ్య సంబంధాన్ని, సిర థ్రోంబోసిస్ ప్రమాదాన్ని అర్థం చేసుకోవడానికి 1.1 లక్షలకు పైగా మంది డేటాను పరిశీలించారు. ఇందులో 1,520 మందితో కూడిన చిన్న గ్రూప్ బ్రెయిన్ ఇమేజింగ్ కూడా చేయించుకుంది.

మూడేళ్ల వ్యవధిలో 1,781 మంది పాల్గొన్నవాళ్లలో (1.5 శాతం) రక్తం గడ్డకట్టే పరిస్థితిని కనుగొన్నారు.

డిప్రెషన్ వల్ల రక్తం గడ్డ కడుతుంది:

ఆందోళన లేదా డిప్రెషన్ రెండింట్లో ఏదో ఒకటి ఉన్నా సిర థ్రాంబోసిస్ రావడానికి 50 శాతం కారణం అని తేలింది. అదే రెండూ ఉంటే 70 శాతం అవకాశాలు పెరుగుతాయని ఈ పరిశోధనలో తెలిసింది.

అందుకే ఈ ఫలితాల వల్ల ఆందోళన రుగ్మతలు, డిప్రెషన్‌ను సిర థ్రాంబోసిస్కు శక్తివంతమైన ప్రమాద కారకాలుగా గుర్తించవచ్చు అని అమెరికన్ జర్నల్ ఆఫ్ హెమటాలజీలో ప్రచురించిన అధ్యయనంలో రాశారు. ఈ సర్వేలో పాల్గొన్న వాళ్లలో 57 శాతం మంది మహిళలు కాగా, వాళ్ల వయసు అటూఇటూగా 58 ఏళ్ల వయసు ఉంది. మొత్తం పాల్గొన్నవాళ్లలో 44 శాతం మందికి క్యాన్సర్ చరిత్ర ఉంది. క్యాన్సర్ వల్ల ఫలితాలలో మార్పు ఉండదని ఈ పరిశోధకులు వివరించారు.

టాపిక్

తదుపరి వ్యాసం