తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthiest Salt: నల్లుప్పు, పింక్ సాల్ట్, కల్లుప్పు.. ఇన్ని రకాల ఉప్పుల్లో ఏది ఆరోగ్యకరం

Healthiest Salt: నల్లుప్పు, పింక్ సాల్ట్, కల్లుప్పు.. ఇన్ని రకాల ఉప్పుల్లో ఏది ఆరోగ్యకరం

HT Telugu Desk HT Telugu

22 November 2023, 11:00 IST

google News
  • Healthiest Salt: పింక్ సాల్ట్, కల్లుప్ప, పొటాషియం ఉప్పు, టేబుల్ సాల్ట్.. ఈ రకరకాల ఉప్పుల్లో ఏది వాడితో మంచిదనే సందేహం ఉంటుంది. ఆ విషయాలన్నీ వివరంగా తెల్సుకోండి.

ఉప్పు రకాలు
ఉప్పు రకాలు (freepik)

ఉప్పు రకాలు

ఇటీవల వరకు అందరిళ్లల్లోనూ టేబుల్‌ సాల్ట్‌ని ఎక్కువగా ఉపయోగిస్తూ వచ్చారు. అయితే ఇది ఆరోగ్యానికి అంతగా మంచిది కాదని, దీని వల్ల థైరాయిడ్‌ సమస్యలు వస్తున్నాయని తెలిసొచ్చాక చాలా మంది మళ్లీ పాత తరం ఉప్పులను వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే సముద్రపు రాళ్ల ఉప్పుతో పాటుగా ఈ మధ్య కాలంలో పింక్‌ సాల్ట్‌, బ్లాక్ సాల్ట్‌.. అంటూ చాలా ఉప్పుల పేర్లు వినిపిస్తున్నాయి. మరసలు వీటిలో ఏది మంచిది?

హిమాలయన్‌ పింక్‌ :

ఇటీవల కాలంలో ఈ హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌ అనేది ఎక్కువగా వాడకంలోకి వచ్చింది. హిమాలయ పర్వతాల దగ్గర్లో సహజ నిక్షేపాల నుంచి దీన్ని తవ్వి తీస్తారు. కొద్దిగా గులాబీ రంగులో ఉండే ఈ ఉప్పు చూడ్డానికే కాదండీ ఆరోగ్యానికీ చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీనిలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం లాంటి అనేక ఖనిజాలు ఉంటాయంటున్నారు. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని మెరుగ్గా చేయడానికి ఉపయోగ పడతాయని చెబుతున్నారు.

సముద్రపు ఉప్పు:

సముద్రపు నీటిని ఎండగట్టడం ద్వారా ఉప్పును తయారు చేస్తారు. దీన్నే మనం రాళ్లుప్పు అని కల్లుప్పు అని కూడా పిలుస్తూ ఉంటాం. సముద్రంలో లభ్యం అయ్యే ఖనిజాలు ఈ ఉప్పు ద్వారా మనకు కొద్ది మొత్తంలో లభ్యం అవుతాయి. పూర్వ కాలం నుంచి దీన్ని అంతా ఎక్కువగా వాడుతూ ఉండేవారు. అయితే దీనిలో పింక్‌ సాల్ట్‌లో ఉన్నంత ఖనిజాలు అయితే దొరకవు.

నల్ల ఉప్పు:

హిమాలయాల దగ్గర్లో ఉండే ఉప్పు గనుల నుంచి ఈ నల్ల ఉప్పును తవ్వి వెలికి తీస్తారు. రంగు కాస్త నల్లగా ఉండటమే కాకుండా దీని రుచి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. అందుకనే ఆయుర్వేదంలో దీన్ని ఔషధంగానూ ఉపయోగిస్తారు. దీన్ని రోజూ వాడటం వల్ల చర్మం, జుట్టుకు కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

పొటాషియం ఉప్పు:

ఉప్పుకు బదులుగా పొటాషియం ఉప్పును కొంత మంది వాడుతూ ఉంటారు. సాధారణ టేబుల్‌ సాల్ట్‌తో పోలిస్తే ఇందులో 70శాతం వరకు సోడియం తక్కువగా ఉంటుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్నవారికి ఇది బాగా పనికి వస్తుంది.

టేబుల్‌ సాల్ట్‌:

అందరి ఇళ్లల్లో ఎక్కువగా ఉపయోగించే ఉప్పు ఈ టేబుల్‌ సాల్ట్‌. దీన్నే అయోడైజ్డ్‌ ఉప్పు అని అంటుంటారు. సముద్రపు నీళ్లను ఎండగట్టడం ద్వారా ముడి ఉప్పును తీసుకుంటారు. దీనిలో ఉన్న మలినాల్ని కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా ప్రాసెసింగ్‌ చేసి తీసివేస్తారు. అలాగే మెత్తటి, తెల్లటి ఉప్పుగా మార్చడానికి ఇందులో కొన్ని రసాయనాలను కలుపుతారు. ఇది గడ్డకట్టకుండా, జారుడుగా ఉండేందుకు వీలుగా చేసి ప్యాక్‌ చేస్తారు. దీని వల్ల అయోడిన్‌ మన శరీరంలోకి అదనంగా చేరుతుంది. అయితే అయోడిన్‌ లోపం ఉన్న వారు మాత్రం ఇది వాడుకోవచ్చు. అందరూ దీన్ని వాడాల్సిన అవసరం లేదు.

తదుపరి వ్యాసం