తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Anemia Symptoms : రక్తహీనత (ఎనీమియా)కు కారణాలు ఇవే.. పోవాలంటే ఏం తినాలి?

Anemia symptoms : రక్తహీనత (ఎనీమియా)కు కారణాలు ఇవే.. పోవాలంటే ఏం తినాలి?

27 December 2022, 14:00 IST

    • Anemia symptoms : రక్తహీనత (ఎనీమియా) శరీరంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్య. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను శరీరంలోని ఇతర టిష్యూ, అవయవాలకు మోసుకెళ్లే బాధ్యత ఈ హిమోగ్లోబిన్‌దే. శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచడంలో దీనిదే ప్రధాన పాత్ర. ఇది లోపించినప్పుడు చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ మహిళలు, చిన్నారుల్లో అనారోగ్యాల బారినపడతారు.
రక్తహీనత (ఎనీమియా)కు కారణాలు
రక్తహీనత (ఎనీమియా)కు కారణాలు

రక్తహీనత (ఎనీమియా)కు కారణాలు

Anemia symptoms : మూడేళ్లలోపు చిన్నారులు 47.4 శాతం.. ప్రెగ్నెంట్ మహిళలు 41.8 శాతం.. సాధారణ మహిళల్లో 30.3 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని తాజాగా నిర్వహించిన గణాంకాలు చెబుతున్నాయి. హిమోగ్లోబిన్ నార్మల్ లెవెల్ 14 నుంచి 15 జీ/డీఎల్‌గా నిర్దేశించారు. ఇది 12 కంటే తక్కువగా ఉన్నప్పుడు రక్తహీనతతో బాధపడుతున్నట్టు గుర్తిస్తారు. 10 కంటే తక్కువగా ఉంటే రక్తహీనత ఎక్కువగా ఉన్నట్టు, 7 జీ/డీఎల్ కంటే తక్కువగా ఉంటే రక్తహీనత తీవ్రంగా ఉన్నట్టు పరిగణిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Ayurvedam Tips: నానబెట్టిన కిస్‌మిస్‌లు, కుంకుమ పువ్వును కలిపి తినమని చెబుతున్న ఆయుర్వేదం, అలా తింటే ఏం జరుగుతుందంటే

Avoid Tea and Coffee: టీ కాఫీలు ఎప్పుడు తాగాలో, ఎంత తాగాలో చెబుతున్న ICMR వైద్యులు, వాటి వల్ల ప్రమాదాలు ఇవే

Chanakya Niti In Telugu : ఈ లక్షణాలు ఉన్న పురుషులను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడుతారు

Aloo Dosa : ఆలూ దోసెను ఇలా రెండు రకాలు తయారు చేసుకోండి

ఐరన్ లోపం వల్ల వచ్చే సమస్యలు..

ఐరన్ లోపం వల్ల ఏర్పడే ఈ రక్తహీనత వల్ల ఇతర సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. గ్రహణ శక్తి తగ్గిపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. మెమొరీ లాస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. తీవ్ర అలసట, నీరసం కనిపిస్తాయి. చర్మం పసుపు రంగులోకి మారుతుంది. శ్వాస ఆడడంలో ఇబ్బంది ఎదురవుతుంది. తలనొప్పితో బాధపడాల్సి ఉంటుంది. ఇక ప్రెగ్నెన్సీలో ఐరన్ లోపం ఉంటే పిండం ఎదుగుదల లోపాలు ఏర్పడతాయి. బరువు తక్కువ గల శిశువు జన్మిస్తారు. పిండంతో పాటు ఆ ప్రెగ్నెంట్ మహిళకు కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు కూడా రక్తహీనత ఏర్పడుతుంది.

ఎవరికి ఎంత ఐరన్ అవసరమంటే..

ఐరన్ లోపం వల్ల ఎనీమియా ఏర్పడుతుందని తెలుసుకున్నాం కదా.. 4 నుంచి 12 నెలల వయస్సున్న చిన్నారులకు రోజుకు 120 మైక్రోగ్రాముల ఐరన్ అవసరమవుతుంది. అలాగే 13--14 నెలల వయస్సు ఉన్న వారికి 56 మైక్రోగ్రాములు, 2 నుంచి 5 ఏళ్ల వయస్సు ఉన్న వారికి 44 మైక్రోగ్రాములు, ప్రెగ్నెంట్ వుమెన్‌కు 24 మైక్రోగ్రాముల ఐరన్ అవసరం. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు 43 మైక్రోగ్రాములు అవసరం.

ఐరన్ ఏ ఫుడ్‌లో లభిస్తుంది?

ఐరన్ అనేక ఆహార పదార్థాల్లో లభిస్తుంది. బాజ్రా, రాగి, గోధుమలు, శనగ పప్పు, బఠానీ, తోటకూర, గొర్రె కాలేయం, మాంసం వంటి వాటిల లభిస్తుంది.

తదుపరి వ్యాసం