తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Blood Type Diet | మీరు మీ బ్లడ్ గ్రూప్ ప్రకారంగానే తింటున్నారా? ఈజీగా బరువు తగ్గొచ్చు!

Blood Type Diet | మీరు మీ బ్లడ్ గ్రూప్ ప్రకారంగానే తింటున్నారా? ఈజీగా బరువు తగ్గొచ్చు!

HT Telugu Desk HT Telugu

01 December 2022, 11:45 IST

    • Blood Type Diet: అందరికీ అన్ని రకాల ఆహారాలు పడవు. ప్రతి వ్యక్తి వారి బ్లడ్ గ్రూప్ ఆధారంగా ఆహారం తీసుకోవాలి. బరువు తగ్గేందుకు ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూడండి.
Blood Type Diet
Blood Type Diet (Stock Photo)

Blood Type Diet

ఊబకాయం అనేది ఇప్పుడు చిన్న వయసు నుంచి వ్యక్తులను పట్టి పీడిస్తున్న సమస్య. భారీకాయం మీ వ్యక్తిత్వాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా మీకు అనేక వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. మీరు నిరంతరం పెరుగుతున్న బరువుతో ఇబ్బంది పడుతున్నట్లయితే, వజన్ తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి నిరాశలో ఉన్నట్లయితే మీ ముందు మరో మార్గం కూడా ఉంది.ఇది చాలా సులభమైనది కూడా.

బరువు తగ్గడానికి ఇది తినాలి, అది తినాలి అని చాలా చెబుతారు. కానీ ఇది అందరికీ వర్తించదు, బరువు తగ్గాలనుకునేవారు అదీ ఇదీ కాకుండా వారి బ్లడ్ గ్రూప్ ప్రకారం ఆహారం తీసుకోవాలని న్యూట్రిషనిష్టులు చెబుతున్నారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఫలితాలు అద్భుతంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

బరువు తగ్గడానికి చాలా మంది కడుపు మాడ్చుకుంటారు, విపరీతమైన వ్యాయామాలు చేస్తుంటారు, ఇంకా అనేక ఇతర పద్ధతులను అనుసరిస్తారు. కానీ ఈ పద్ధతులు అందరు వ్యక్తులపై ఒకే విధంగా పనిచేయవు. ఫలితంగా మీరు ఎంత కష్టపడినా అది వృధా ప్రయాసనే. ఇందుకు కారణం ప్రతి వ్యక్తి భిన్నమైన బ్లడ్ గ్రూప్ కలిగి ఉండటమే అని న్యూట్రిషనిస్టులు అంటున్నారు.

Blood Type Diet for Weight Loss- రక్త నమూనా ఆధారిత ఆహారం

బరువు తగ్గాలనుకునేవారు వారి బ్లడ్ గ్రూప్ ఆధారంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలో పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ సూచించారు. అది ఈ కింద తెలుసుకోండి.

A బ్లడ్ గ్రూప్ వారు తినాల్సిన ఆహారం

A బ్లడ్ గ్రూప్ ఉన్నవారి రోగనిరోధక వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. బరువు తగ్గేందుకు వారు ఆహారంలో ఎక్కువగా పండ్లను చేర్చుకోవాలి. అంతే కాకుండా పచ్చి ఆకు కూరలతో పాటు, సలాడ్లు కూడా తీసుకోవాలని సూచించారు. A బ్లడ్ గ్రూప్‌ కలిగిన వారు మాంసాహారం తక్కువగా తీసుకోవాలి. బీన్స్, కాయ ధాన్యాలు, చిక్కుళ్ళు వంటి ధాన్యాలు తీసుకోవడం వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

B బ్లడ్ గ్రూప్ వారు తినాల్సిన ఆహారం

బ్లడ్ గ్రూప్ B కలిగిన వారు తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులను, ప్రోటీన్ ఎక్కువ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకా ఈ గ్రూప్ వారు సోయాబీన్, గుడ్లు, పప్పులు, వివిధ రకాల కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. B బ్లడ్ గ్రూప్ ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రోటీన్-రిచ్ హెల్తీ ఫుడ్ తీసుకోవడంపై ఆధారపడాలి.

AB బ్లడ్ గ్రూప్ వారు తినాల్సిన ఆహారం

ఎసిడిటీ, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు మద్యం, ధూమపానం, కెఫిన్, స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మీ బ్లడ్ గ్రూప్ AB అయితే మీరు టోఫు, సీ ఫుడ్, పాల ఉత్పత్తులతో పాటు ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటివి తింటూ ఉండటం వలన సులభంగా బరువు తగ్గుతారు.

O బ్లడ్ గ్రూప్ వారు తినాల్సిన ఆహారం

O బ్లడ్ గ్రూప్ ఉన్నవారు AB బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలాగా ఎసిడిటీ కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దీనితో పాటు మాంసం, బీన్స్, ధాన్యాలు తక్కువగా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారంపై శ్రద్ధ పెట్టడంతోపాటు, క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి.

తదుపరి వ్యాసం