తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Right Ghee For You: నెయ్యి కొనేముందు ఈ విషయాలు తెల్సుకోండి.. ఏదైనా మంచిదే అనుకుంటే పొరపాటేనండోయ్..

Right Ghee For You: నెయ్యి కొనేముందు ఈ విషయాలు తెల్సుకోండి.. ఏదైనా మంచిదే అనుకుంటే పొరపాటేనండోయ్..

HT Telugu Desk HT Telugu

09 November 2023, 10:30 IST

google News
  • Right Ghee For You: ఏ నెయ్యి అయినా బాగుంటుందిలే అనుకుంటూ పొరపాటే. నెయ్యిలో రకాలు, అది తయారు చేసి పద్ధతి బట్టి దాంట్లో పోషకాలు మారతాయి. మంచి నెయ్యి అంటే ఏదో తెలుసుకుంటే సరైన నెయ్యిని వాడొచ్చు.

ఏ నెయ్యి మంచిది
ఏ నెయ్యి మంచిది (freepik)

ఏ నెయ్యి మంచిది

భోజనంలో నెయ్యి వడ్డించుకుని తినడానికి మనలో చాలా మంది ఇష్ట పడుతూ ఉంటారు. ముఖ్యంగా పచ్చళ్లు, పొడుల్లో దీన్ని చేర్చుకుని తినడం వల్ల కమ్మదనం ఇంకా పెరిగి ఆ పదార్థాలు మరింత రుచిగా అనిపిస్తాయి. ఇక చక్కెర పొంగలి, పాయసం.. లాంటి తీపి పదార్థాల్లోనూ దీన్ని చేర్చడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. అందుకనే నేతిలో జీడి పప్పు, కిస్‌మిస్‌లాంటి వాటిని వేయించ చక్కగా ఈ పదార్థాల్లో కలిపేసుకుంటూ ఉంటాం. మరి ఇలా నెయ్యిని ఎంత బడితే అంత తినొచ్చా? అసలు నెయ్యిలో రకాలుంటాయా? ఏ నెయ్యి మంచిది? లాంటి వివరాలన్నింటినీ ఇక్కడ చూసేద్దాం.

ఏ నెయ్యి మంచిది:

సాధారణంగా మనం ఆవు నెయ్యి, గేదె నెయ్యిల్ని ఎక్కువగా ఆహారాల్లో వాడుతుంటాం. ఈ రెండింటిలో గేదె నెయ్యితో పోలిస్తే ఆవు నెయ్యిలో మరిన్ని ఔషధ గుణాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాగే మార్కెట్లో దొరికేవి చాలా వరకు పాల మీద మీగడతో తయారవుతాయి. లేదా కొందరు రెడీమేడ్ గా దొరికే ఫ్రెష్ క్రీం నుంచి కూడా నెయ్యి తయారు చేసి అమ్మేస్తున్నారు. దీన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా వేరు చేసి దాని నుంచి వెన్న తీస్తారు. దాన్ని కాచి నెయ్యిగా చేస్తారు.అలా చేసిన నెయ్యిలో తక్కువగా పోషకాలు ఉంటాయని, ఆరోగ్యానికీ అంత మంచిది కాదనీ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు తింటున్న నెయ్యి ఎలా తయారు చేసింది? అనే దాన్ని బట్టి దానిలో పోషకాల విలువ ఆధార పడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇంట్లో చేసుకున్నా కూడా ఎలాంటి క్విక్ మెథడ్స్ జోలికి పోకుండా సాంప్రదాయ పద్ధతిలో నెయ్యి చేసుకోవడమే మంచిది.

ఏ1 నెయ్యి, ఏ2 నెయ్యి?

ఆవు నెయ్యిలో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయని చెప్పుకొన్నాం కదా. అయితే మళ్లీ ఈ ఆవుల జాతుల్లో తేడాల్ని బట్టి ఈ నెయ్యిల్ని ఏ1 నెయ్యి అని, ఏ2 నెయ్యి అని రెండు రకాలుగా చెబుతారు. వీటిలో ఏ1 నెయ్యిలో పోషకాలు తక్కువ. సంకర జాతి ఆవుల నుంచి ఉత్పత్తి అయ్యే పాల ద్వారా ఇది వస్తుంది. అలాగే శివాల్‌, గిర్‌ లాంటి దేశీ ఆవుల పాల నుంచి తయారు చేసే నేతినే ఏ2 నెయ్యి అంటారు. ఇది ఏ1 కంటే ఎక్కువగా పోషకాలను కలిగి ఉంటుంది. తేలికగానూ జీర్ణం అవుతుంది.

నెయ్యిని ఎలా తినాలి :

సాధారణంగా మనం అన్నంలో నెయ్యి వేసుకుని తింటూ ఉంటాం. అందువల్ల ఎక్కువగా కొవ్వులు, కేలరీలు మన శరీరంలోకి సులభంగా చేరిపోతాయి. అలా కాకుండా మనం చేసుకునే కూరలో నూనెకు బదులుగా నెయ్యిని వాడుకోవడం వల్ల వీటి పరిమాణం తగ్గించడానికి వీలవుతుంది. అంటే నెయ్యితో కూర వండితే ఇక నూనె వేసుకునే పని ఉండదు. లేదంటే సగం నూనె, సగం నెయ్యి వేసుకుని కూర చేసుకోవడం వల్ల ఇక అన్నంలో మళ్లీ నెయ్యిని చేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. అందువల్ల అదనపు కొవ్వులు చెప్పుకోదగినంత పరిమాణంలో మన శరీరంలోకి వెళ్లడం తగ్గిపోతుంది. దీంతో తిన్న క్యాలరీలను కరిగించుకోవడానికి మనం మళ్లీ పెద్ద ఎత్తున కష్ట పడి వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉండదు.

తదుపరి వ్యాసం