తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  శృంగారం అంటేనే చెమటలు పట్టేస్తున్నాయా? ఈ భయం నుంచి ఇలా బయటపడండి..

శృంగారం అంటేనే చెమటలు పట్టేస్తున్నాయా? ఈ భయం నుంచి ఇలా బయటపడండి..

13 August 2024, 8:02 IST

google News
  • శృంగారం అంటే మీలో తెలియని ఆందోళన, భయం వస్తున్నాయా? అయితే మీకు ఎరోటోఫోబియా ఉన్నట్లే. దాని కారణాలు, దాన్నుంచి ఎలా బయటపడాలో తెల్సుకోండి.

శృంగార భయం
శృంగార భయం (freepik)

శృంగార భయం

ఒకరితో శారీరకంగా సన్నిహితంగా ఉండాలనే ఆలోచన వస్తే చాలు మీలో వణుకు పుడుతోందా, చెమటలు పట్టేసి ఆందోళనగా అనిపిస్తోందా? దీన్నే ఎరోటోఫోబియా అంటారు. శృంగార భయం అనుకోవచ్చు. సెక్స్ అంటే ఇష్టం లేకపోవడానికి, ఆ పేరు చెబితేనే భయపడటానికి తేడా ఉంది. ఇదివరకు మీ జీవితంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనల వల్ల, ఒకరు మిమ్మల్ని తాకుతారనే భయం వల్ల, ఎదుటి వ్యక్తికి శరీరం చూయించాలంటే భయం కారణంగా ఈ ఫోబియా మొదలవుతుంది. ఈ భయాన్ని నిర్లక్ష్యం చేయలేం. దీనివల్ల మీ భాగస్వామికి దూరమవుతారు. అందుకే దీన్ని గమనించి సరైన చర్యలు తీసుకోవాల్సిందే.

ఎరోటోఫోబియా కారణాలు:

వెజినిస్మస్:

శృంగార సమయంలో యోని కండరాలు బిగుతుగా అయిపోతాయి. దీనివల్ల లైంగిక సంభోగం సాధ్యం కాదు. లేదంటే అసౌకర్యం, నొప్పి ఉంటుంది. దీనివల్ల శృంగారం అంటే భయం ఎక్కువవుతుంది.

లైంగిక వేదింపులు:

చిన్న వయసులో ఎదుర్కొన్న కొన్ని అనుభవాలు, లైంగిక వేదింపుల వల్ల శృంగారం అంటే చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ భయం పెద్దయ్యాక కూడా అలాగే ఉండిపోతుంది.

అంగస్తంభన లోపం:

శృంగారంలో అంగస్తంభన లోపం వల్ల ఎదుటి వ్యక్తికి ఆ విషయం చెప్పలేక శృంగారం అంటేనే ఫోబియాలాగా మారిపోతుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఈ భయాన్ని మరింత పెంచుతాయి.

శరీరం గురించి ఆందోళన:

అందంగా లేమనో, శరీర ఆకృతి గురించి ఆందోళన వల్లనో ఒకరితో సన్నిహితంగా ఉండాలంటే భయం మొదలవుతుంది. ఈ భయం వల్ల కొంతమంది శృంగారానికి పూర్తిగా దూరమవుతారు కూడా.

ఎరోటోఫోబియా లక్షణాలు:

వ్యక్తివ్యక్తికీ ఈ లక్షణాలు మారతాయి. కానీ ఈ సమస్య ఉన్నవాళ్లలో సాధారణంగా ఉండే లక్షణాలు తెల్సుకుందాం.

  1. శృంగారానికి సంబంధించిన విషయాలు మాట్లాడగానే వాటినుంచి దూరంగా వెళ్లిపోతారు.
  2. ఈ విషయం గురించి మాట్లాడితే గుండె దడ, చెమట పట్టడం, వణుకు లాంటివి కనిపిస్తాయి.
  3. శృంగారలో పాల్గొనడం, శృంగార సామర్థ్యం, తర్వాత ఏమైనా ఇబ్బందులొస్తాయోమో అని.. ఇలాంటి వాటి గురించి విపరీత మైన ఆలోచనలుంటాయి.
  4. భాగస్వామితో సన్నిహితంగా మసులుకోలేరు. చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతారు.

దీన్నుంచి ఎలా బయటపడాలి?

శృంగార ఆరోగ్యం గురించి, ఇతర సమస్యల గురించి వాళ్లకున్న భయాలను, అపనమ్మకాలను పోగొట్టే వైద్యుల్ని సంప్రదించాలి. లేదంటే పుస్తకాలు చదవాలి. ఆన్‌లైన్ క్లాసులు, వర్క్ షాప్స్ హాజరవ్వాలి. సెక్స్ అంటే మంచిది కాదని, చాలా ప్రమాదకరమని భావించే అపనమ్మకాన్ని తగ్గించుకోవాలి. భాగస్వామితో మీకున్న సమస్యను స్పష్టంగా చెప్పి చూడాలి. భయంతో చెప్పకుండా ఆగిపోతే బంధానికే దూరమవుతారు. శ్వాస వ్యాయామాలు, ధ్యానం లాంటివి అభ్యసించాలి. ఇవి ఆందోళన తగ్గిస్తాయి.

చికిత్సలు:

కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ వల్ల దీనికి చికిత్స తీసుకోవచ్చు. ఆందోళన తగ్గి మెల్లగా భయం తగ్గిపోతుంది. అలాగే సెక్స్ థెరపీ మరో మార్గం. సెక్స్ థెరపిస్టులు ఈ సమస్యల గురించి కౌన్సిలింగ్ ఇస్తారు. కొన్ని సార్లు దీన్నుంచి బయటపడటానికి వైద్యులు మందులు సూచిస్తారు. ఇవి ఆందోళన, భయం తగ్గిస్తాయి.

 

తదుపరి వ్యాసం