తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Breakfast Foods । బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి కొన్ని ఉత్తమమైన, ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవే!

Healthy Breakfast Foods । బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి కొన్ని ఉత్తమమైన, ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవే!

HT Telugu Desk HT Telugu

25 June 2023, 6:30 IST

google News
    • Healthy Breakfast Foods: బ్రేక్‌ఫాస్ట్ చేయడాన్ని రోజులో మీరు తీసుకునే ముఖ్యమైన భోజనంగా చెప్తారు. ఉదయం వేళ ఎలాంటి అల్పాహారం చేయాలో ఈ కింద తెలుసుకోండి.
Healthy Breakfast Foods
Healthy Breakfast Foods (istock)

Healthy Breakfast Foods

Healthy Breakfast Foods: ఉదయం మీరు తినే అల్పాహరం బలవర్ధకమైనది, పోషకాలతో నిండినది, ఆరోగ్యకరమైనది అయి ఉండాలి. ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ మీరు చేస్తే, మీరు ఆ రోజంతా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. అందుకనే బ్రేక్‌ఫాస్ట్ చేయడాన్ని రోజులో మీరు తీసుకునే ముఖ్యమైన భోజనంగా చెప్తారు. రాత్రి నుండి ఉదయం వరకు మీరు నిద్రపోతారు, ఈ సమయంలో మీరు ఏం తినకుండా, తాగకుండా ఉంటారు. అందువల్ల శరీరానికి జీవక్రియలు నిర్వహించటానికి శక్తి ఉండదు. కాబట్టి ఉదయం కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేసి తీరాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్నందున, ఆరోగ్యమైన అల్పాహారం తిని ఉదయం మీ దినచర్యను ప్రారంభించాలని చెబుతున్నారు. ఉదయం వేళ ఎలాంటి అల్పాహారం చేయాలో కూడా తెలుపుతూ న్యూట్రిషనిస్టులు కొన్ని ఆహారాలను సిఫారసు చేశారు. అవి ఈ కింద తెలుసుకోండి.

1. ఉడికించిన గుడ్లు

ఉడికించిన గుడ్లు, టోస్ట్‌లు అల్పాహారంలో చేర్చుకోవాలి. ఇది మీకు మంచి ప్రొటీన్ ఆహారం అవుతుంది. మీ కడుపును చాలా సేపు నిండుగా ఉంచుతుంది. వీటితో పాటు తాజాగా చేసిన పుదీనా కొత్తిమీర జ్యూస్ తీసుకుంటే పోషక విలువలు మరింత పెరుగుతాయని అంటున్నారు.

2. క్యాబేజీ పరాటా

క్యాబేజీ పరాటాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే పెరుగుతో కలిపి గోబీ పరాటా తినాలి. మీకు పరాటాలు అలవాటు లేకపోతే క్యాబేజీ కూరతో చపాతీలు, జొన్నరొట్టలు తినవచ్చు. దీనితో పాటు ఏదైనా వెజిటెబుల్ జ్యూస్ తాగితే ఇంకా మంచిది.

3. ప్రోటీన్ దోశ

దోశ చాలా మందికి ఇష్టమైన అల్పాహారం. దోశలు రుచికరంగా ఉంటాయి, సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. అయితే రెగ్యులర్ గా చేసే బియ్యం పిండిని ఉపయోగించి చేసే దోశలకు బదులుగా పోషక విలువలు పెంచడానికి పెసర్లు (పెసరట్టు), మినుములు, శనగలు వంటి పప్పులతో చేసే దోశలు తినాలి. ఇవి మీకు మరింత శక్తిని అందించగలవు.

4. సీజనల్ పండ్లు

సీజనల్ గా లభించే తాజా పండ్లు తినడం ఆరోగ్యకరం. పండ్లలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి కాబట్టి, మీరు తినే అల్పాహారంతో పాటుగా ఏదైనా పండు కూడా తినాలి లేదా ఒక కప్పు వివిధ రకాల తాజా పండ్ల ముక్కలను తీసుకుంటే అది శరీరానికి అవసరమైన పోషకాలను అందజేస్తుంది.

5. నట్స్ - సీడ్స్

ఉదయాన్ని అల్పాహరం చేయడం ఇష్టం లేనివారు, లేదా సమయం లేనపుడు. కనీసం 1-2 ఉడికించిన గుడ్లు సిద్ధంగా ఉంచుకొని తినాలి లేదా కొన్ని బాదంపప్పులు, పిస్తా పప్పులు, వాల్ నట్స్, సబ్జా విత్తనాలు, తృణధాన్యాలు వంటివి తినాలి. అలాగే ఒక గ్లాసు వెజిటెబుల్ జ్యూస్‌ తాగితే కడుపు తేలికగా ఉంటుంది, శక్తి కూడా ఉంటుంది.

తదుపరి వ్యాసం