తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Malabari Fish Curry Recipe : కేరళ స్టైల్ మలబారి ఫిష్ కర్రీ.. కొబ్బరితో అలా చేస్తే టేస్ట్ అదుర్స్

Malabari Fish Curry Recipe : కేరళ స్టైల్ మలబారి ఫిష్ కర్రీ.. కొబ్బరితో అలా చేస్తే టేస్ట్ అదుర్స్

20 January 2023, 13:07 IST

    • Malabari Fish Curry Recipe : కేరళలో మలబారి ఫిష్ కర్రీ చాలా ఫేమస్. అయితే దీనిని మనం కూడా సులువుగా చేసుకోవచ్చు. చాలా టేస్టీ, హెల్తీగా ఫిష్ కర్రీ చేసుకోవాలి అనుకుంటున్నారా.. అయితే మీరు కచ్చితంగా మలబారి ఫిష్ కర్రీ చేసుకోవచ్చు. 
మలబారి ఫిష్ కర్రీ
మలబారి ఫిష్ కర్రీ

మలబారి ఫిష్ కర్రీ

Malabari Fish Curry Recipe : మీరు కేరళ సైడ్ వంటకాలు ఇష్టపడేవారైతే.. టేస్టీ టేస్టీ మలబారి ఫిష్ కర్రీని కచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయవచ్చు. సముద్ర ఫుడ్ ఇష్టంగా తినేవారికి కూడా ఇది మంచిగా ఉంటుంది. మరి ఈ కేరళ స్టైల్ డిష్ ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..

* చేపలు - 100 గ్రాములు

* కొబ్బరి తురుము - 50 గ్రాములు

* అల్లం - 1/4 అంగుళం తురిమినది

* చింత పండు ప్యూరీ - 1/2 కప్పు

* ఉప్పు - తగినంత

* పసుపు - 1/4 టీస్పూన్

* పచ్చిమిర్చి - 2 చిన్నవి

* కారం - 1/2 టీస్పూన్

* ఉల్లిపాయలు - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగిన)

మలబారి ఫిష్ కర్రీ తయారీ విధానం

కొబ్బరిలో పసుపు వేసి.. కొద్దిగా నీళ్లతో మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేయండి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిలో కాస్త నూనె వేయండి. ఇప్పుడు దానిలో చింతపండు ప్యూరీ, కారం, అల్లం, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కలపండి. దానిలో రుబ్బిన కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలపాలి. మీడియం మంట మీద ఉంచి.. రెండు నిమిషాలు ఉడికించండి.

ఇప్పుడు దానిలో చేపలు, ఉప్పు వేసి బాగా కలపండి. గ్రేవీ దగ్గరగా అయ్యేవరకు కొన్ని నిమిషాలు ఉడికించాలి. అనంతరం నూనెలో ఉల్లిపాయలను వేయించి.. దానిని ఈ గ్రేవీలో వేసి బాగా కలపండి. కాస్త ఉడికించి దింపేయండి. అంతే వేడి వేడి మలబార్ చేపల కర్రీ రెడీ. దీనిని అన్నంతో వేడిగా తినొచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం