తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Radhika Merchant Sister: లండన్ రిసెప్షన్‌‌కు రాధికా మర్చంట్ అక్క వేసుకున్న ఈ డ్రెస్ ఇంత తక్కువ ఖరీదా?

Radhika Merchant Sister: లండన్ రిసెప్షన్‌‌కు రాధికా మర్చంట్ అక్క వేసుకున్న ఈ డ్రెస్ ఇంత తక్కువ ఖరీదా?

Haritha Chappa HT Telugu

18 July 2024, 9:36 IST

google News
  • లండన్ లో జరిగిన రాధికా మర్చంట్, అనంత్ అంబానీల వివాహ వేడుకకు అంజలి మర్చంట్ హాజరయ్యారు. వధువు సోదరి అక్షరాలా రూ.21 వేల విలువైన క్లాసీ డ్రెస్ లో మెరిసింది.

అంజలి మర్చంట్
అంజలి మర్చంట్ (Instagram )

అంజలి మర్చంట్

రాధికా మర్చంట్, అనంత్ అంబానీల పెళ్లి వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలెబ్రిటీలందరూ హాజరయ్యారు. వారి పెళ్లి పదికాలాల పాటూ గుర్తుండిపోయేలా నిర్వహించారు. పెళ్లికి ముందు మూడు నెలల నుంచి నిత్యం ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పెళ్లి ముగిశాక లండన్లో వేడుకలు మొదలయ్యాయి. అక్కడే రిసెప్షన్ ప్లాన్ చేశారు. దీంతో అంబానీ కుటుంబమంతా లండన్ కు చేరుకుంది. ఎంతో మంది బంధువులు కూడా లండన్ వెళ్లారు. రాధిక మర్చంట్ ఒకే ఒక్క సోదరి అంజలి మర్చంట్ కూడా తన కుటుంబంతో లండన్ వెళ్లింది.

అనంత్ అంబానీ, రాధికల వివాహ వేడుకల్లో అంజలి మర్చంట్ తన కట్టుబొట్టుతో ఎందరినో ఆకట్టుకుంది. ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో భాగంగా లండన్ గాలా కార్యక్రమం జరిగింది. ఆ వేడుకలో అంజలి పసుపు రంగు స్ట్రాప్లెస్ డ్రెస్ ధరించి మెరిసే మేకప్ తో కొత్తగా కనిపిస్తోంది.

సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మీరా సఖ్రానీ లండన్ గాలా కోసం అంజలి మర్చంట్ గ్లామర్ లుక్ వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 'లండన్‌లో జరిగిన ఈ థీమ్ గాలా కోసం ఆమె కొత్తగా మేకప్ చేసుకుంది. ఈ ఆధునిక లుక్ లో అంజలి అందంగా మెరిసిపోతుంది. ఈ డ్రెస్‌లో ఆమె క్లాసీగా, కాన్ఫిడెంట్ గా కనపిస్తోంది. ఆమె ఒక ఐకాన్, ఆమె ఒక లెజెండ్" అంటూ ఆమె కామెంట్ చేసింది.

అంజలి ఎల్లో స్ట్రాప్ లెస్ డ్రెస్ ను మెరిసే మెష్ ప్యానెల్స్ తో అలంకరించారు. సిల్హౌట్ బొమ్మలా కనిపిస్తోంది అంజలి. భుజాల చుట్టూ కప్పుకున్న పింక్ కలర్ దుపట్టా ఆమె లుక్ లేటెస్ట్ గా కనిపిస్తోంది.

ఈ యాక్సెసరీస్ కోసం అంజలి పూలతో కట్ చేసిన డైమండ్ చోకర్ నెక్లెస్, ఫ్లవర్ చెవిపోగులు, స్టేట్మెంట్ మేకింగ్ రింగ్స్‌తో సహా మెరిసే డైమండ్ ఆభరణాలను ధరించింది. మెరిసే చిన్న చిన్న రాళ్లతో నుదుటిని, కళ్లను అలంకరించింది. కాలర్ బోన్‌లు, భుజాలపై ఈ మెరుపులు పూసుకుంది. చివరగా, సొగసైన పోనీటెయిల్, నల్లగా ఉన్న కనుబొమ్మలు, ఐలైనర్, బుగ్గలకు పింగ్ రంగు, నిగనిగలాడే గులాబీ పెదవులు, మస్కారా అలంకరించిన కనురెప్పలు ఆమె అందాన్ని మరింతగా పెంచాయి.

అంజలి మర్చంట్ దుస్తుల ధర ఎంత?

అంజలి మర్చంట్ డ్రెస్ ఖరీదు

అంజలి మర్చంట్ వేసుకున్న స్ట్రాప్ లెస్ గౌన్ డ్రెస్ విలువ చాలా తక్కువ అని నెటిజన్లు కామెంట్లు చేస్తారు. అంబానీల కుటుంబం వేడుకల్లో లక్షల ఖరీదైనా చీరలు, డ్రెస్సులు ధరిస్తారు. కానీ అంజలి మర్చంట్ కేవలం రూ .21,500 ఖరీదైన డ్రెస్సును మాత్రమే ధరించడం చర్చనీయాంశంగా మారింది. ఇంత తక్కువ ధరలో అంజలి మర్చంట్ ఎందుకు డ్రెస్ ను ఎంచుకుందని ఫ్యాషన్ నిపుణులు చర్చిస్తున్నారు. అంజలి మర్చెంట్ కు కూడా కోట్ల ఆస్తి ఉంది.

ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తన ప్రేమసి అయిన రాధికా మర్చంట్ ను వివాహం చేసుకున్నారు. ఫార్మా టైకూన్లు వీరేన్ మర్చంట్, షైలా మర్చంట్ ల కుమార్తె రాధికా మర్చంట్. జులై 12న అనంత్, రాధికల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ తారలు, అంతర్జాతీయ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రపంచ నాయకులు హాజరైన ఈ వివాహ వేడుకలు జూలై 14 వరకు కొనసాగాయి. ప్రస్తుతం లండన్లో ఈ వేడుకలు జరుగుతున్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం