తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Periods: పీరియడ్స్ సమయంలో లైంగికంగా కలిస్తే గర్భం వచ్చే అవకాశం ఉందా?

Periods: పీరియడ్స్ సమయంలో లైంగికంగా కలిస్తే గర్భం వచ్చే అవకాశం ఉందా?

Haritha Chappa HT Telugu

20 March 2024, 12:30 IST

    • Periods: కొత్తగా పెళ్లయిన జంటలకు ఎన్నో సందేహాలు ఉంటాయి. అందులో ఒకటి పీరియడ్స్ సమయంలో లైంగికంగా కలిస్తే గర్భం వచ్చే అవకాశం ఉందా? లేదా? అన్నది. దీనికి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
పీరియడ్స్‌లో గర్భం వస్తుందా?
పీరియడ్స్‌లో గర్భం వస్తుందా? (Pixabay)

పీరియడ్స్‌లో గర్భం వస్తుందా?

Periods: కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలకు చాలా సందేహాలు ఉంటాయి. అందులో ఒకటి పీరియడ్స్ సమయంలో లైంగికంగా కలవచ్చా? అలా కలిస్తే గర్భం వచ్చే అవకాశం ఉందా? అని వారికి ప్రశ్నలు తలెత్తుతాయి. పీరియడ్స్ సమయంలో లైంగికంగా కలవడం పూర్తిగా సురక్షితమని వైద్యులు చెబుతున్నారు. అయితే అది వారి సొంత సౌలభ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇక పీరియడ్స్ సమయంలో కలవడం వల్ల గర్భం వస్తుందా? లేదా? అనే విషయాన్ని కూడా ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Mango Fruit Bobbatlu: మామిడిపండు బొబ్బట్లు చేసి చూడండి, రుచి అదిరిపోతుంది

Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి ఎందుకు తినకూడదో అసలైన కారణాలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

హ్యూమన్ ప్రొడక్షన్ జర్నల్లో 2013లో ఒక అధ్యయనాన్ని ప్రచురించారు. దాని ప్రకారం పీరియడ్స్ సమయంలో లైంగికంగా కలవడం వల్ల గర్భవతి అయ్యే అవకాశం దాదాపు లేదని తేలింది. ఈ అధ్యయనంలో 6000 మంది వ్యక్తులు పాల్గొన్నారు.

గర్భం వస్తుందా?

అండోత్సర్గం జరిగే సమయంలో విడుదలైన అండాన్ని.. వీర్యకణం కలిసినప్పుడు ఫలదీకరణం జరుగుతుంది. ఆ సమయంలో గర్భం వచ్చే అవకాశం ఉంది. అండోత్సర్గము సాధారణంగా నెలసరి రావడానికి పది నుంచి 15 రోజుల ముందు జరుగుతుంది. ఆ సమయంలో కలిస్తే గర్భం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

స్త్రీ శరీరంలో చేరిన వీర్యకణాలు ఎక్కువ రోజులపాటు అక్కడ జీవించ గలవు. లైంగిక ప్రక్రియ జరిగిన కొద్దిసేపటికి అండోత్సర్గం జరిగితే అక్కడే పునరుత్పత్తి మార్గంలో ఉన్న వీర్యకణంతో అండం కలిసే అవకాశం ఉంది. అప్పుడు ఫలదీకరణం జరగవచ్చు.

క్రమరహిత పీరియడ్స్ వల్ల ఎప్పుడు అండోత్సర్గము జరుగుతుందో అంచనా వేయడం చాలా కష్టంగా మారుతుంది. అలాంటి సమయంలో గర్భం వచ్చే అవకాశాలపై కూడా అంచనా వేయలేము. ఒత్తిడి, ఇతర మందులు, హార్మోన్ అసమతుల్యత వంటివి అండోత్సర్గాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఒక స్త్రీ ఎప్పుడు గర్భం దాలుస్తుందో చెప్పడం కష్టం.

ప్రతినెలా ఒకే సమయానికి నెలసరి అయ్యే మహిళల్లో మాత్రం పీరియడ్స్ సమయంలో లైంగిక ప్రక్రియలో పాల్గొనడం వల్ల గర్భం వచ్చే అవకాశం చాలా తక్కువ. గర్భం ధరించకూడదు అనుకునేవారు ఉత్తమ గర్భనిరోధక పద్ధతులను పాటించాలి.

ఉత్తమ గర్భనిరోధక పద్ధతుల్లో ముఖ్యమైనది కండోమ్‌లు. ఇవి గర్భాన్ని అడ్డుకోవడమే కాదు లైంగికంగా సంక్రమించే అంటు వ్యాధుల నుంచి కూడా రక్షణలో కల్పిస్తాయి. అలాగే మగవారికే కాదు, ఆడవాళ్ళకి కూడా కండోమ్‌లు వచ్చాయి. ఆడవాళ్ల కండోమ్‌లను లైంగిక ప్రక్రియకు ముందు వెజినాలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఇద్దరు భాగస్వాములకు రక్షణ ఇస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం