iQOO Z6 Lite 5G:స్నాప్‌డ్రాగన్ 4 ప్రాసెసర్‌తో iQOO Z6 ఫోన్.. ధర రూ. 15,000 లోపే!
02 September 2022, 17:11 IST
- iQOO Z6 Lite 5G: భారత్‌లో మొట్టమొదటి స్నాప్‌డ్రాగన్ 4 ప్రాసెసర్ iQOO Z6 Lite 5G ఫోన్ త్వరలో విడుదల కానుంది. దీని ధర రూ. 15,000 లోపు ఉంటుందని సమాచారం. ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ అందించారు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ మొత్తం రెండు స్టోరేజ్ వేరియంట్‌లను కలిగి ఉంటుంది.
iQOO Z6 Lite
Vivo సబ్-బ్రాండ్ iQOO భారతదేశంలో న్యూ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రారంభించబోతోంది. అనేక మిడిల్-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల తర్వాత, iQOO తన లెటెస్ట్ Z6 సిరీస్‌ను భారతదేశంలో విస్తరించాలని చూస్తోంది. త్వరలో iQOO Z6 Lite 5Gని ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనుంది. ఇది Z6 ఫోన్ ట్రిమ్డ్ డౌన్ వెర్షన్‌కు సంబందించినది. ఇక iQOO Z6 Lite 5G ఫోన్ సెప్టెంబర్‌లో దేశీయ మార్కెట్‌లో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 4 చిప్‌సెట్ వంటి అత్యాధునికి ఫీచర్స్‌ను అందించినట్లు సమాచారం. అలాగే ఇది అప్‌గ్రేడ్ ప్రాసెసర్‌ను కలిగి ఉన్న ఫోన్‌గా భారతదేశంలో విడుదలయే మొదటి హ్యాండ్‌సెట్ అవుతుందని టెక్ నిపుణులు అంటున్నారు.
iQOO Z6 Lite 5G ధర
iQOO ఈ లెటెస్ట్ మోడల్ గురించి ఎలాంటి విషయాలు వెల్లడించనప్పటికీ అంతర్గత సమాచారం ప్రకారం Z6 Lite 5G ఫోన్‌ను రూ. 15,000 కంటే తక్కువ ధరతో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ మునుపటి జనరేషన్ iQOO Z6 ఇప్పుడు భారతదేశంలో రూ. 17,000కి విక్రయిస్తున్నారు. ఈ ఫోన్ 4GB, 6GB, 8Gతో మొత్తం మూడు వేరియంట్‌లను కలిగి ఉంది. ఈ మూడు వేరియంట్‌లు కొత్త ఫోన్‌కు కూడా అందిస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు.
iQOO Z6 Lite 5G: స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు
iQOO Z6 Lite 5G క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 సిరీస్ చిప్‌సెట్‌ను కలిగి ఉన్న మొదటి స్మార్ట్‌ఫోన్. ఈ తాజా చిప్‌సెట్‌ను సంబంధించి Qualcomm ఇంకా ప్రకటన చేయలేదు. Qualcomm త్వరలో స్నాప్‌డ్రాగన్ 4 సిరీస్‌ను ప్రకటించే అవకాశం ఉంది. టెక్ న్యూస్ అవుట్‌లెట్ డిజిట్ నివేదిక ప్రకారం, iQOO Z6 లైట్ ఫోన్ 6.58-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ అందించబడుతుంది, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ మొత్తం రెండు స్టోరేజ్ వేరియంట్‌లను కలిగి ఉంటుంది. ఒకటి 4GB RAM , 64GB స్టోరెజ్ కాగా మరొకటి 6GB RAM, 128GB స్టోరెజ్‌తో వస్తుంది. ఈ iQOO Z6 లైట్ ఫోన్‌లో 13MP ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్ 8MP ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్‌ను అందిస్తుంది. iQOO రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఫోన్ సంబంధించిన పూర్తి సమాచారం తెలియనుంది.
టాపిక్