తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Independence Day 2022 : స్వాతంత్య్ర దినోత్సవం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Independence Day 2022 : స్వాతంత్య్ర దినోత్సవం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

13 August 2022, 16:36 IST

    • Independence Day 2022 : భారతదేశం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. అయితే ఈ ఘనత గురించి ఆసక్తికరమైన వాస్తవాల గురించి.. మీకు చాలా విషయాలు తెలియవు. జాతీయ గీతాన్ని ఎప్పుడు ఆమోదించారో, భారతీయ జెండాను ఎగురవేశారో వంటి విషయాలు మీకు తెలుసా?
స్వాతంత్య్ర దినోత్సవం
స్వాతంత్య్ర దినోత్సవం

స్వాతంత్య్ర దినోత్సవం

Independence Day 2022 : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే స్వాతంత్య్రంతో ముడిపడి ఉన్న కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. భారత జాతీయ గీతాన్ని ఎప్పుడు ఆమోదించారో తెలుసా?

స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో అధికారిక జాతీయ గీతం లేదు. 1911లో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘భరోతో భాగ్యో బిధాత’ పాటను 1950 జనవరి 24న ‘జన్ గన్ మాన్’గా మార్చారు. దానిని భారత రాజ్యాంగ సభ జాతీయ గీతంగా ఆమోదించింది.

2. భారత జెండాను తొలిసారిగా ఎప్పుడు ఎగురవేశారంటే?

మూడు రంగుల భారత జాతీయ జెండాను మొదటిసారిగా ఆగస్టు 7, 1906న కోల్‌కతాలోని పార్సీ బగన్ స్క్వేర్‌లో ఎగురవేశారు. మన ప్రస్తుత జాతీయ పతాకం మొదటి రూపాంతరాన్ని 1921లో స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య రూపొందించారు. ఈ జెండా మధ్య గీతపై 24-చుక్కల అశోక్ చక్రంతో ఆరెంజ్, తెలుపు, ఆకుపచ్చ రంగులను కలిగి ఉంది. ఇది జూలై 22, 1947న స్వీకరించి.. ఆగస్టు 15, 1947న ఎగురవేశారు.

3. స్వాతంత్య్ర దినోత్సవంగా లార్డ్ మౌంట్ బాటన్ ఆగస్ట్ 15ని ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?

ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? భారత స్వాతంత్య్ర చట్టం జూలై 18, 1947న ఆమోదం పొందగా.. స్వాతంత్య్ర దినోత్సవం కోసం ఆగస్టు 15 తేదీని లార్డ్ మౌంట్ బాటన్ ఎంచుకున్నారు. ఆగస్టు 15, 1945న రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ మిత్రరాజ్యాల దళాలకు లొంగిపోయిన తేదీతో సమానంగా ఉన్నందున అతను ఈ తేదీని ఎంచుకున్నాడు.

4. జాతీయ గీతం 'వందేమాతరం' ఓ నవల వచ్చిందని తెలుసా?

దేశంలోని జాతీయ గీతమైన ‘వందేమాతరం’ బెంగాలీ నవల ఆనందమథ్‌లో భాగం. ఈ నవల 1880లలో బంకిం చంద్ర ఛటర్జీ రచించారు. ఈ పాటను మొదటిసారిగా 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ పాడారు. 20 నవంబర్ 1909న కర్మయోగిన్‌లో శ్రీ అరబిందో గద్యంలోకి అనువదించారు. దానిని జనవరి 24, 1950న జాతీయ గీతంగా ప్రకటించారు.

తదుపరి వ్యాసం