తెలుగు న్యూస్  /  ఫోటో  /  Independence Day 2022 : ప్రతి ఇంట్లో జెండా ఎగరాలి.. అందరూ దేశభక్తిని చాటుకోవాలి

Independence Day 2022 : ప్రతి ఇంట్లో జెండా ఎగరాలి.. అందరూ దేశభక్తిని చాటుకోవాలి

13 August 2022, 12:49 IST

Har Ghar Tiranga Abhiyan : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది 75 సంవత్సరాల స్వాతంత్య్రంలో భారతదేశ ప్రజల అద్భుతమైన చరిత్ర, సంస్కృతి, విజయాలు, అమరవీరులను స్మరించుకోవడమే. దీనిలో భాగంగా.. 'హర్ ఘర్ తిరంగ' ప్రచారం నేటి నుంచి ప్రారంభమైంది. ప్రధాని పిలుపుమేరకు భారతీయ పౌరులు ఇంటి వద్ద జెండా ఎగురవేస్తున్నారు. 

Har Ghar Tiranga Abhiyan : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది 75 సంవత్సరాల స్వాతంత్య్రంలో భారతదేశ ప్రజల అద్భుతమైన చరిత్ర, సంస్కృతి, విజయాలు, అమరవీరులను స్మరించుకోవడమే. దీనిలో భాగంగా.. 'హర్ ఘర్ తిరంగ' ప్రచారం నేటి నుంచి ప్రారంభమైంది. ప్రధాని పిలుపుమేరకు భారతీయ పౌరులు ఇంటి వద్ద జెండా ఎగురవేస్తున్నారు. 

'హర్ ఘర్ తిరంగ' ప్రచారం శనివారం ప్రారంభమైంది. ఆగస్టు 15 వరకు ఈ ప్రచారం కొనసాగనుంది. భారతదేశ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం, 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయులు తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయడానికి స్ఫూర్తినిస్తోంది. జాతీయ జెండాతో సంబంధాన్ని మరింత వ్యక్తిగతంగా మార్చడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
(1 / 8)
'హర్ ఘర్ తిరంగ' ప్రచారం శనివారం ప్రారంభమైంది. ఆగస్టు 15 వరకు ఈ ప్రచారం కొనసాగనుంది. భారతదేశ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం, 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయులు తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయడానికి స్ఫూర్తినిస్తోంది. జాతీయ జెండాతో సంబంధాన్ని మరింత వ్యక్తిగతంగా మార్చడమే ఈ కార్యక్రమం లక్ష్యం.(ANI)
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆయన సతీమణి సోనాల్ షా న్యూఢిల్లీలోని తమ నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
(2 / 8)
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆయన సతీమణి సోనాల్ షా న్యూఢిల్లీలోని తమ నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.(ANI)
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటివద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
(3 / 8)
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటివద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.(ANI)
ప్రజల మదిలో దేశభక్తిని పెంపొందించడంతోపాటు.. త్రివర్ణ పతాకంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం వెనుక ఉద్దేశం.
(4 / 8)
ప్రజల మదిలో దేశభక్తిని పెంపొందించడంతోపాటు.. త్రివర్ణ పతాకంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం వెనుక ఉద్దేశం.(ANI)
భారతదేశంలోని ప్రతి ఇంటిలో త్రివర్ణ పతాకం ఎగురవేయాలని ప్రధానిమంత్రి నరేంద్రమోదీ జాతి ప్రజలకు పిలుపునిచ్చారు."From August 13 to 15, the Tricolour will be hoisted in every house of India. People from every section of society, every caste and creed are spontaneously joining with only one identity. This is the identity of the conscientious citizen of India," అంటూ మోదీ ట్వీట్ చేశారు.
(5 / 8)
భారతదేశంలోని ప్రతి ఇంటిలో త్రివర్ణ పతాకం ఎగురవేయాలని ప్రధానిమంత్రి నరేంద్రమోదీ జాతి ప్రజలకు పిలుపునిచ్చారు."From August 13 to 15, the Tricolour will be hoisted in every house of India. People from every section of society, every caste and creed are spontaneously joining with only one identity. This is the identity of the conscientious citizen of India," అంటూ మోదీ ట్వీట్ చేశారు.(ANI)
బృందావన్‌లోని తన నివాసంలో 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంలో భాగంగా ఎంపీ హేమమాలిని జాతీయ జెండాతో కనిపించారు.
(6 / 8)
బృందావన్‌లోని తన నివాసంలో 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంలో భాగంగా ఎంపీ హేమమాలిని జాతీయ జెండాతో కనిపించారు.(ANI)
కేంద్రం 'హర్ ఘర్ తిరంగా' ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తుంది. ప్రతి భారతీయుడు.. 'హర్ దిన్ తిరంగ'ను తమ నినాదంగా మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతుంది.
(7 / 8)
కేంద్రం 'హర్ ఘర్ తిరంగా' ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తుంది. ప్రతి భారతీయుడు.. 'హర్ దిన్ తిరంగ'ను తమ నినాదంగా మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతుంది.(PTI)
బాలీవుడ్ నటుడు హీరో అమీర్ ఖాన్ కూడా 'హర్ ఘర్ తిరంగా'లో చేరాడు. ముంబైలోని తన నివాసంలో అమీర్ త్రివర్ణ పతాకాన్ని ఉంచారు.
(8 / 8)
బాలీవుడ్ నటుడు హీరో అమీర్ ఖాన్ కూడా 'హర్ ఘర్ తిరంగా'లో చేరాడు. ముంబైలోని తన నివాసంలో అమీర్ త్రివర్ణ పతాకాన్ని ఉంచారు.(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి