Dhana Prapthi : శుక్రవారం లక్ష్మీ దేవి కటాక్షం కావాలంటే.. ఈ చిన్న పని చేయండి
24 June 2022, 6:39 IST
- డబ్బును సంపాదించాలని అందరికీ ఉంటుంది. దాని కోసం కష్టపడతారు కూడా. అయితే కొందరు ఎంత సంపాదించినా.. వారి దగ్గర డబ్బు నిల్వదు. అలాంటి వారు ఈ చిన్న పని చేస్తే.. లక్ష్మీ దేవి కటాక్షిస్తుందని అంటున్నారు జ్యోతిష్యులు. మీరు ట్రై చేయండి.
లక్ష్మీ దేవి కటాక్షం
Ashta Lakshmi Stotram : హిందువులు లక్ష్మీ దేవిని సంపదకు దేవతగా భావిస్తారు. ఆ దేవి అనుగ్రహం ఉంటే వ్యక్తి సంపదను, అన్నిరకాల ఆనందాలను పొందుతాడని భక్తులు నమ్ముతారు. అయితే శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అందుకే ఈ రోజున భక్తులు లక్ష్మీదేవిని పూజిస్తారు. కొందరు ఎంత కష్టపడినా వారి దగ్గర డబ్బు నిల్వదు. కారణం లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడమే అని చాలా మంది భావిస్తారు. అలాంటి వారు లక్ష్మీదేవిని చాలా సులువుగా ప్రసన్నం చేసుకోవాలంటే శుక్రవారం ఈ చిన్ని చిట్కా పాటిస్తే చాలు అంటున్నారు జ్యోతిష్యులు.
లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం రోజు అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించాలి అంటున్నారు. ఈ అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని తెలిపారు. రోజూ కూడా అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించవచ్చని అంటున్నారు.
శ్రీ అష్టలక్ష్మీ స్త్రోతం:
ఆది లక్ష్మి
సుమనస వందిత సుందరి మాధవి, చంద్రసహోదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే |
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ ||
ధాన్య లక్ష్మి
అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ ||
ధైర్యలక్ష్మి
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, జ్ఞాన వికాసిని శాస్త్రనుతే |
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ ||
గజలక్ష్మి
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే |
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ ||
సంతాన లక్ష్మి
అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్థిని జ్ఞానమయే
గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే |
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ ||
విజయలక్ష్మి
జయ కమలాసిని సద్గతి దాయిని, జ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే |
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ ||
విద్యాలక్ష్మి
ప్రణత సురేశ్వరి భారత భార్గవి, శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధు సూధన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ ||
ధనలక్ష్మి
ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే |
వేద పురాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ ||
ఇది సంపూర్ణ శ్రీ అష్టలక్ష్మీ స్తోత్రం.
టాపిక్