శనివారం రోజున ఈ దేవుళ్ళను పూజిస్తే అంతా శుభమే జరుగుతుంది!
17 June 2022, 23:14 IST
- శనివారం రోజున హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా, హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. శనిదేవుని అశుభ ప్రభావాలకు బయటపడతారు. హనుమంతుడిని పూజించే వ్యక్తిపై శని అశుభ ప్రభావం కలుగుతుంది.
worship
హిందూ మతంలో శనివారానికి చాలా ప్రాముఖ్యత ఉంది.శనివారం హనుమాన్ , శని దేవ్‌లకు ప్రత్యేకమైన రోజు. ఈ పవిత్రమైన రోజున, శని దేవున్ని, హనుమంతుని పూజించడం వల్ల అంతా శుభమే జరుగుతుంది. శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా హనుమాన్ ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. శనిదేవుని అశుభ ప్రభావాలకు భయపడతారు. హనుమంతుడిని పూజించే వ్యక్తిపై శని ప్రభావం ఉండదు. అన్ని రకాల బాధలు, దుఃఖాల నుండి బయటపడటానికి, శనివారం నాడు హనుమాన్ చాలీసాను ఒకటి కంటే ఎక్కువసార్లు చదవాలి.
ముఖ్యంగా ఈ రోజు ఉదయం పూట స్నానం ఆచరించి. వీలైతే ఉపవాసం ఉండి.. హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజా చేయాలి. హనుమాన్ చాలీసా పఠనంతో పాటు ఆంజనేయ స్వామి దండకం పఠించడం పుణ్యఫలం లభిస్తోంది.
అలాగే శ్రీరామ రక్షా స్త్రోత్ర పఠనం చదవడం ద్వారా దోషాలను తొలిగిపోతాయి. కాషాయం లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజా చేయడం వల్ల కుజ దోషం తొలిగి పెళ్లి కానీ పిల్లలకు త్వరగా వివాహం జరుగుతుందని శాస్త్ర వచనం.
టాపిక్