Drink for Cholesterol: ఖాళీ పొట్టతో ఈ నీటిని తాగారంటే శరీరంలోని కొవ్వు కొన్ని రోజులకే మంచులా కరిగిపోతుంది
09 June 2024, 13:17 IST
- Drink for Cholesterol: ప్రతిరోజూ కొత్తిమీర ఆకుల పానీయాన్ని తాగడం అలవాటు చేసుకుంటే శరీరంలోని కొవ్వు కొన్ని రోజులకే కరిగిపోవడం మొదలవుతుంది. దీన్ని తాగడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
కొవ్వును కరిగించే పానీయం
కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మంచిది. కూరల్లో అదనపు రుచి కోసం వీటిని వాడుతూ ఉంటాం. అయితే కొత్తిమీర ఒక శక్తివంతమైన ఔషధం కూడా. దీని రసాన్ని పరగడుపున తాగితే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. జీర్ణ సమస్యలకు చికిత్స చేయడానికి పురాతన కాలం నుండి దీన్ని వినియోగిస్తున్నారు. కొత్తిమీరతో రుచికరమైన చట్నీ చేసుకోవచ్చు. దీనిలో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీరను కచ్చితంగా మీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో ఉత్తమం. కొత్తిమీరను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి
కొత్తిమీరలో అధిక కొలెస్ట్రాల్ తో పోరాడే అనేక సహజ సమ్మేళనాలు ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్స్ అధికంగా ఉండే కొత్తిమీర పానీయాన్ని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కొత్తిమీరలోని పోషకాలు ప్రేగులోని కొలెస్ట్రాల్ శోషణను నిరోధించే మొక్కల సమ్మేళనాలు. ఇది గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. కొత్తిమీరతో చేసిన పానీయాన్ని తాగడం వల్ల PMS, ఎసిడిటీ, థైరాయిడ్, మైగ్రేన్, రాత్రి చెమటలు పట్టడం, పిత్త సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
కొత్తిమీరతో పానీయాన్ని ఎలా చేయాలి?
గుప్పెడు కొత్తిమీర ఆకులను తీసుకుని 500 మిల్లీలీటర్ల నీటిలో 10 నిమిషాలు మరిగించి, ఆపై వడకట్టాలి. తరువాత దాన్ని గోరువెచ్చగా అయ్యాక తాగేయాలి. దీన్ని పరగడుపున ఖాళీ పొట్టతో తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. లేదా భోజనం తినడానికి 45 నిమిషాల ముందు తింటే మంచిది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. కొన్ని రోజుల ఈ పానీయాన్ని తాగి చూడండి. నెల రోజుల్లోనే మీకు ఫలితం కనిపిస్తుంది.
పోషకాలు ఎన్నో…
కొత్తిమీర ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఈ పోషకాలతో పాటు, కొత్తిమీరలో డైటరీ ఫైబర్, ఐరన్, మాంగనీస్, కాల్షియం, విటమిన్ కె, భాస్వరం వంటి పోషకాలతో నిండి ఉంటాయి. కొత్తిమీరను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
1. దృష్టిని మెరుగుపరుస్తుంది: కొత్తిమీరలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది మీ రెటీనాను రక్షిస్తుంది. ఇది మీ కళ్ళలో తేమను నిలిపేందుకు సహాయపడుతుంది.
2. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: కొత్తిమీరలో విటమిన్ ఎతో పాటు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అద్భుతమైన యాంటీఆక్సిడెంట్లు, మొక్కల ఆధారిత సమ్మేళనాలు మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
3. రక్తంలో చక్కెర స్థాయిలు: కొత్తిమీర డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వరకు తగ్గిస్తుందని తేలింది.
4. చెడు కొలెస్ట్రాల్ : కొత్తిమీరలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే శక్తి ఉంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే అద్భుతమైన సమ్మేళనాలు ఇందులో ఉన్నాయి.
5. ఎముకల ఆరోగ్యానికి: కొత్తిమీరలోని పోషఖాలు మీ ఎముక ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వీటిలో కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం నిండుగా ఉంటాయి.
6. పొట్ట ఆరోగ్యానికి: కొత్తిమీర ఆకులు తినడం వల్ల ఆకలిని పెంచుతుంది. పొట్ట ఉబ్బరం, పొట్ట అసౌకర్యం లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
7. చర్మ ఆరోగ్యానికి: కొత్తిమీర ఆకులలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు సహాయపడతాయి.
8. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది: కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు, కొత్తిమీర ఆకులు మూత్రవిసర్జన సవ్యంగా సాగేలా చేస్తాయి. ఇది మీ శరీరం నుండి అదనపు సోడియంను తొలగించడానికి, రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.