తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Salt: ఉప్పు తగ్గించకపోతే మీ లైంగిక జీవితానికి దెబ్బే, ముందే జాగ్రత్త పడండి

Salt: ఉప్పు తగ్గించకపోతే మీ లైంగిక జీవితానికి దెబ్బే, ముందే జాగ్రత్త పడండి

Haritha Chappa HT Telugu

18 April 2024, 10:30 IST

    • Salt: భార్యాభర్తల మధ్య లైంగిక జీవితం ఆరోగ్యంగా ఉంటేనే వారి దాంపత్యం ఆనందంగా కొనసాగుతుంది. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల వారి మధ్య లైంగిక సంబంధం దెబ్బతినే అవకాశం ఉంది.
ఉప్పు
ఉప్పు (Pixabay)

ఉప్పు

Salt: ఉప్పు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, కూరల్లో ఉప్పు సరిపోకపోతే అప్పుడుకప్పుడే వేసుకొని కలుపుకొని తినడం వంటి పనులు చేయకండి. వీలైనంతగా ఉప్పు డబ్బాను దూరంగా పెట్టండి. అప్పుడే లైంగిక జీవితం ఆరోగ్యంగా సాగుతాయి. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల మీ సెక్స్ జీవితం నాశనం అయ్యే అవకాశం ఉంది. ఆహారంలో ఉప్పు తగ్గిస్తే భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం మరింత దృఢపడుతుంది. ఉప్పు అధికంగా తినేవారిలో లైంగిక అనుబంధం తగ్గే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Pulihora Recipe : ఆలయంలో ప్రసాదంలా రుచికరమైన పులిహోర చేయండి ఇలా..

Worst Egg Combination : గుడ్లతో కలిపి తినకూడని ఆహారాలు.. సైడ్‌కి ఆమ్లెట్ కూడా వద్దండి

Flaxseeds Gel : చర్మంపై ముడతలను తగ్గించే మ్యాజిక్ జెల్.. ఇలా ఉపయోగించండి

Mobile Side effects: నిద్రపోతున్నప్పుడు మొబైల్ తలగడ పక్కనే పెట్టుకొని నిద్రపోతున్నారా? మీలో ఈ మార్పులు వచ్చే అవకాశం

ఉప్పును తగ్గించాల్సిందే...

వంటల్లో వీలైతే చిటికెడు ఉప్పును తగ్గించే వండండి. మన శరీరానికి ఎంత అవసరమో అంత ఉప్పును తింటే సరిపోతుంది. నాలిక రుచి కోసం ఉప్పును జోడించకండి. ముఖ్యంగా మీ లైంగిక జీవితం కోసం ఉప్పును ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్‌లో ఒక అధ్యయనాన్ని ప్రచురించారు. ఆ అధ్యయనం ప్రకారం ఎక్కువ ఉప్పు తినే మగవారిలో అంగస్తంభన సమస్యలు పెరిగిపోతున్నట్టు తేలింది. మగవారు లైంగికంగా బలహీన పడుతున్నట్టు ఈ అధ్యయనం చెబుతోంది.

ఉప్పు తినడం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి పడుతుంది. ఇది హైపర్ టెన్షన్ కు కారణం అవుతుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారికి లైంగిక చర్యలో సంతృప్తి దొరకదు. అన్ని అవయవాలకు రక్తప్రవాహం తగ్గుతుంది. కాబట్టి లైంగిక జీవితంపై ఆ ప్రభావం పడుతుంది. రక్తపోటు కారణంగా పురుషులలో అంగస్తంభన సమస్యలు వస్తూ ఉంటే, స్త్రీలలో లైంగిక కోరిక తగ్గుతున్నట్టు అధ్యయనం చెబుతోంది.

రక్తనాళాలు విస్తరించడం లేదా కుదించుకుపోవడంలాంటివి ఈ ఉప్పు వల్ల జరుగుతున్నాయి. ఒక అధ్యయనంలో అధిక ఉప్పు తీసుకోవడం వల్ల లైంగిక జీవితం ప్రభావితం అయ్యే విధంగా ధమనులు దృఢంగా మారిపోతున్నట్టు తేలింది.

లైంగిక జీవితం బాగుండాలంటే

భార్యాభర్తల మధ్య లైంగిక జీవితం బాగుండాలంటే ఉప్పును తగ్గించడంతోపాటు వారిద్దరూ కొన్ని పనులను చేయాలి. భాగస్వాములతో లైంగిక జీవితం గురించి బహిరంగంగా మాట్లాడుకోవాలి. ఎలాంటి ఆందోళనలు, సమస్యలు ఉన్నా ఒకరికితో ఒకరు షేర్ చేసుకోవాలి. అలాగే ఇద్దరూ కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్, తృణధాన్యాలు వంటి సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల లైంగిక జీవితం ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి మానసిక స్థితిని మార్చేస్తుంది. ఇది మీ సెక్స్ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి ఒత్తిడి బారిన పడకుండా ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు, యోగా వంటివి చేస్తూ ఉండండి. అధిక ఒత్తిడి స్థాయిలు లైంగిక పని తీరును ప్రభావితం చేస్తాయి. శరీరానికి తగినంత నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర సరిపోకపోయినా భావోద్వేగాల్లో తేడాలు వస్తాయి. కాబట్టి లైంగిక జీవితం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర కూడా అవసరం.

టాపిక్

తదుపరి వ్యాసం