తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ibps Recruitment: Ibps రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు..వార్షిక వేతనం రూ. 12 లక్షలు!

IBPS Recruitment: IBPS రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు..వార్షిక వేతనం రూ. 12 లక్షలు!

HT Telugu Desk HT Telugu

23 May 2022, 21:03 IST

google News
    • IBPS Recruitment 2022: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
IBPS Recruitment 2022
IBPS Recruitment 2022

IBPS Recruitment 2022

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మే 31, 2022లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ. 12 లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులు నోటిఫికేషన్‌లో సమాచారాన్ని చెక్ చేయాలి. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీ వివరాలు:

పోస్ట్: రీసెర్చ్ అసోసియేట్స్

గ్రేడ్: E

అర్హత: అభ్యర్థులు కనీసం 55% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సైకాలజీ, ఎడ్యుకేషన్, సైకలాజికల్ మెజర్‌మెంట్, సైకోమాట్రిక్స్, మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి.

వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు వార్షక వేతనం సుమారు 12 లక్షలు

దరఖాస్తు రుసుము: రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు రూ. 1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

అనుభవం: అకడమిక్ రీసెర్చ్/టెస్ట్ డెవలప్‌మెంట్‌లో ఏడాది అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ను ఆపరేట్ చేయడంలో నైపుణ్యం అవసరం.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఎగ్జామినేషన్, ఐటమ్ రైటింగ్ ఎక్సర్‌సైజ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి

Step 1: అభ్యర్థులు ముందుగా IBPS అధికారిక వెబ్‌సైట్  సందర్శించాలి.

Step 2: హోమ్‌పేజీలో, స్క్రోల్‌లో కనిపించే నోటిఫికేషన్ లింక్‌ను క్లిక్ చేయాలి

Step 3: ఇప్పుడు రిజిస్ట్రేషన్ లింక్‌ను ఓపెన్ చేసి వివరాలను నమోదు చేసుకోండి.

Step 4: రూ. 1000 రుసుము చెల్లించి దరఖాస్తును సమర్పించండి.

Step 5: చివరిగా దరఖాస్తు ఫామ్‌ను ప్రింట్ అవుట్‌ తీసి మీ వద్ద ఉంచుకోండి.

తదుపరి వ్యాసం