తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast: అల్పాహారం ఇలా తీసుకుంటే మిమ్మల్ని వ్యాధులు దరి చేరవు

Breakfast: అల్పాహారం ఇలా తీసుకుంటే మిమ్మల్ని వ్యాధులు దరి చేరవు

HT Telugu Desk HT Telugu

19 August 2023, 8:55 IST

google News
    • మన ఉదయం పూట అల్పాహారాన్ని హెవీగా తీసుకుంటాం. అయితే దీనిలో ఏం ఉండాలి? రోజూ వడలు, బోండాలు తీసుకుంటే ఏమవుతుంది?
అల్పాహారంలో ఏముండాలి?
అల్పాహారంలో ఏముండాలి?

అల్పాహారంలో ఏముండాలి?

మనం అల్పాహారం ఎలా తినాలి అనే విషయంలో ఇప్పటికీ చాలా గందరగోళం ఉంది. మనం డీప్ ఫ్రై అల్పాహారాలకు అలవాటుపడిపోతున్నాం. దీని వల్ల మన శరీరానికి కావాల్సిన కొవ్వుల కంటే చెడు కొవ్వులే పేరుకుపోయే ముప్పుంది. విభిన్న రకాల వడలు, గారెలు కచ్చితంగా డీప్ ఫ్రై చేయాల్సిందే. దీని వల్ల మనకు తెలియకుండానే చెడు కొవ్వులు తీసుకుంటున్నాం. జీర్ణ వ్యవస్థను, ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నాం. ఈ డీప్ ఫ్రైలు కేవలం అల్పాహారంతో ఆగిపోతున్నాయా అంటే అదీ లేదు. లంచ్‌లోకి ఫ్రైలు, సాయంత్రం స్నాక్స్, ఈవినింగ్ డిన్నర్లు.. దీంతో కొవ్వులు, ట్రైగ్లైజరిడ్లు తగ్గేదేలే అంటున్నాయి.

అల్పాహారం ఇలా తీసుకోండి..

ముందుగా ఒక వృత్తాకార ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్ తొమ్మిది అంగుళాల ప్లేట్ అయితే మంచిది. దానిని సగానికి విభజించండి. ఆ సగంలో మళ్లీ సగం విభజించండి. ఒక వైపు పిండి పదార్ధాలు (కార్బొహైడ్రేట్స్), మరొక వైపు ప్రోటీన్ ఉండే ఆహారం ఉంచండి. దీని వల్ల సమతుల్య ఆహారం సాధ్యమవుతుంది. ఇంకో వైపు సగం కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మీ ఆరోగ్యం గురించి ఇక చింతించాల్సిన పని లేదు.

మీరు గుడ్డు తినే వారైతే, మంచిగా ఉడికించిన గుడ్డును అల్పాహారంలో తీసుకోండి. లేదంటే ఒక కప్పు శనగలు, ఒక కప్పు పచ్చి బఠానీలు, ఒక కప్పు ఉడికించిన వేరుశెనగ తీసుకోండి.

ఇక మధ్యాహ్న భోజనానికి గంట ముందు పండ్లు తినండి. అది యాపిల్, నారింజ, పుచ్చకాయ, ద్రాక్ష, బొప్పాయి, అరటి, జామ, మామిడి, దానిమ్మ ఇలా ఏదైనా పండు కావచ్చు. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, ఒక మోతాదులో బాగా తీపినిచ్చే పండ్లకు దూరంగా ఉండండి. జామ పండ్లు, నారింజ, బొప్పాయి పండ్లతో సరిపెట్టండి.

మనం ఉదయం పూట పండ్లు తిన్నాం కాబట్టి రాత్రి డిన్నర్‌లోకి పచ్చి క్యారెట్లు, దోసకాయలు, పచ్చి ఉల్లిపాయలు వంటి సలాడ్ తీసుకోవచ్చు. ఇవి మీకు వీలును బట్టి ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు.

మొత్తంగా చెప్పాలంటే మీ శరీరం జీర్ణించుకునేంత, అవసరమైనంత మాత్రమే నూనెలు వాడాలి. లేదంటే కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోయి, ట్రైగ్లిజరైడ్లు పేరుకుపోయి జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చి చేరుతాయి. ముఖ్యంగా డయాబెటిస్, గుండె జబ్బులు దరి చేరుతాయి.

తదుపరి వ్యాసం