Foods To Avoid With Papaya । బొప్పాయిపండు తిన్న తర్వాత ఇవి తిన్నారో మీ ఆరోగ్యం మటాష్!
Foods To Avoid With Papaya: బొప్పాయి తిన్న తర్వాత కొన్ని ఆహారాలు తినకుండా ఉండండి. వేటికి దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకోండి.
Foods To Avoid With Papaya: బొప్పాయిపండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కడుపుకు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఈ పండులో పాపైన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది పొట్టలోని పొరను ఆరోగ్యంగా ఉంచుతుంది, మీ కడుపుని చల్లబరచడంతో పాటు, మలబద్ధకం, పైల్స్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా బొప్పాయి అనేక చర్మ సమస్యలను నయం చేస్తుంది. రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోయిన వారికి బొప్పాయి తినమని సిఫారసు చేస్తారు.
ట్రెండింగ్ వార్తలు
అయితే ఈ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, బొప్పాయిపండును తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే బొప్పాయిలోని సమ్మేళనాలు ఇతర ఆహార పదార్థాలతో చర్యజరిపి దుష్ప్రభావాలను కలిగించవచ్చు. కాబట్టి మీరు ఈ పండు తిన్న తర్వాత వేటికి దూరంగా ఉండాలో అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. బొప్పాయి తిన్న తర్వాత మీరు తప్పక నివారించాల్సిన ఆహారాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
పాలు తాగకూడదు
బొప్పాయి తిన్న తర్వాత పాలు, పాల పదార్థాలు తీసుకోకూడదు ఎందుకంటే బొప్పాయి, పాలు రెండింటి కలయిక అజీర్ణం, కడుపు నొప్పి లేదా మలబద్ధకం సమస్యకు గురి చేస్తాయి. ఆకస్మికంగా కడుపు ఉబ్బరం, విరేచనాలకు కారణమవుతుంది. కాబట్టి బొప్పాయి తిన్న తర్వాత పాలు తాగవద్దు. అలాగే బొప్పాయితో పాటు పెరుగు కూడా తినవద్దు. బొప్పాయి తిన్న తర్వాత పెరుగు తినడం వల్ల శారీరకంగా హాని కలుగుతుంది. ఆయుర్వేద దృక్కోణంలో, బొప్పాయి వేడి గుణం కలిగి ఉంటుంది, పెరుగు చలువ గుణం కలిగి ఉంటుంది. అందుకే వీటిని కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
టీ తాగకూడదు
బొప్పాయి తిన్న తర్వాత టీ తాగడం వల్ల అది పాపైన్ ఎంజైమ్‌తో చర్య జరుపుతుంది, ఇది చాలా సమస్యలను కలిగిస్తుంది. అదనంగా టీ ఆకులలో కాటెచిన్లు ఉంటాయి, ఇవి బొప్పాయిలోని పాపైన్ సమ్మేళనంతో చర్యజరిపి గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది.
గుడ్డు తినకూడదు
బొప్పాయి తిన్న తర్వాత కోడిగుడ్లు తినడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఎందుకంతే బొప్పాయి విటమిన్ సి, పాపైన్ ఎంజైమ్‌లతో సమృద్ధిగా ఉంటుంది, గుడ్డులో ప్రోటీన్, ఒమేగా-3లు ఉంటాయి. ఈ రెండింటినీ ఒకేసారి తినడం వల్ల మీ కడుపులో గందరగోళం ఏర్పడుతుంది, ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు అనారోగ్యానికి గురి చేస్తుంది. అజీర్ణం, వికారం, మలబద్ధకం, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి.
నిమ్మకాయ అసలే వద్దు
బొప్పాయి, నిమ్మకాయలు కలిసి మీ శరీరంలో హిమోగ్లోబిన్ లోపాన్ని కలిగించే విష సమ్మేళనాన్ని ఏర్పరుస్తాయి. ఈ లోపం రక్తహీనతకు దారితీయవచ్చు, ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు అనారోగ్యానికి గురి చేస్తుంది.z
కాబట్టి, బొప్పాయి తిన్న తర్వాత వీటిని తినకుండా ఉండండి. అలాగే ఫుడ్ అలెర్జీ ఉన్నవారు, మధుమేహం ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, కిడ్నీ సమస్యలు వంటివి కలవారు బొప్పాయి తినకపోవడమే ఉత్తమం.