Egg Fenugreek Curry Recipe । కోడిగుడ్డు టమోటా మెంతికూర.. కలిపి తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా!-tasty and nutritious egg fenugreek curry recipe in telugu
Telugu News  /  Lifestyle  /  Tasty And Nutritious Egg Fenugreek Curry Recipe In Telugu
Egg Fenugreek Curry Recipe:
Egg Fenugreek Curry Recipe: (slurrp)

Egg Fenugreek Curry Recipe । కోడిగుడ్డు టమోటా మెంతికూర.. కలిపి తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా!

26 May 2023, 13:06 ISTHT Telugu Desk
26 May 2023, 13:06 IST

Egg Fenugreek Curry Recipe: అనేక ఆరోగ్య ప్రయోజనాలను, పోషకాలు కలగలిసిన కోడిగుడ్డు టమోటా మెంతికూర వంటకాన్ని ఎలా చేయాలో ఈ కింద తెలుసుకోండి.

Healthy Recipes: రుచికరమైన మంచి భోజనం చేయాలంటే రుచికరమైన కూరలు ఉండాలి. టమోటాలు, కోడిగుడ్డుతో చాలా రకాల రుచికరమైన వంటకాలు సిద్ధం చేసుకోవచ్చు. ఈ రెండింటి కలయిక కూడా అద్భుతంగా ఉంటుంది, ఇందులో మెంతికూర కూడా కలుపుకుంటే మరింత ఫ్లేవర్ వస్తుంది. కోడిగుడ్డు టమోటా మెంతికూర రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. ఈ వంటకం ఎంతో రుచికరమైనదే కాదు, ఆరోగ్యకరమైనది కూడా.

కోడిగుడ్డులో ప్రోటీన్లు, విటమిన్లతో పాటు గుండెకు ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులను కలిగి ఉంటుంది. టొమాటోలో పొటాషియం, విటమిన్లు బి, ఇ లతో పాటు ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. మెంతికూర వ్యాధులతో పోరాడడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఈ పోషకాలు కలగలిసిన కోడిగుడ్డు టమోటా మెంతికూర వంటకాన్ని ఎలా చేయాలో ఈ కింద తెలుసుకోండి.

Egg Tomato Fenugreek Curry Recipe కోసం కావలసినవి

  • 4 గుడ్లు
  • 2 కప్పుల మెంతి ఆకులు
  • 2 ఉల్లిపాయలు
  • 6 టమోటాలు
  • 2 పచ్చిమిర్చి
  • 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1.5 టీస్పూన్లు కారం పొడి
  • 1/2 టీస్పూన్ పసుపు పొడి
  • 2 టీస్పూన్లు ధనియాల పొడి
  • 1/2 టీస్పూన్ గరం మసాలా
  • 2 టేబుల్ స్పూన్లు నూనె
  • తాజా కొత్తిమీర
  • ఉప్పు రుచికి తగినంత

కోడిగుడ్డు టమోటా మెంతికూర కర్రీ తయారీ విధానం

  1. ముందుగా కూరగాయలను, ఆకుకూరలను శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోండి.
  2. మొదటగా ఒక నాన్ స్టిక్ పాత్రలో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గరం మసాలా వేసి వేయించండి. ఆపైన మెంతి ఆకులు వేసి అన్నీ కలిపి కొద్దిగా ఉడికించాలి.
  3. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, తరిగిన టొమాటోలు, ఉప్పు వేసి కలపాలి. టమోటాలు ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసి కలపండి.
  4. ఇప్పుడు ఒక గిన్నెలో పచ్చసొనను వేరుచెసి గిలక్కొట్టండి. అందులో తగినంత కారం, ఉప్పు వేసి ఉడుకుతున్న కూరలో వేయండి, పచ్చసొన కూడా మెల్లగా జారవిడవండి. మూత పెట్టి 4 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించండి.
  5. గుడ్డు ఉడికిన తర్వాత మృదువుగా కలిపి మరో నాలుగు నిమిషాలు ఉడికించండి.
  6. చివరగా కొత్తిమీర ఆకులతో అలంకరించండి

అంతే కోడిగుడ్డు టమోటా మెంతికూర రెడీ. అన్నంతో లేదా చపాతీలతో వేడివేడిగా తినండి, రుచిని ఆస్వాదించండి.

సంబంధిత కథనం