Winter Vagina: శీతాకాలంలో యోని సమస్యల నుంచి ఉపశమనం పొందడం ఎలా?
23 December 2024, 17:56 IST
Winter Vagina: చల్లటి వాతావరణంలో చర్మం పొడిబారడం సర్వ సాధారణం. శరీరంలోని మిగిలిన అవయవాల మాదిరిగానే మహిళల యోనిపై కూడా ఈ ప్రభావం పడుతుంది. ఫలితంగా శీతాకాలంలో యోని సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. దీన్నే వింటర్ వజైనా అంటారు. దీని నుంచి ఉపశమనం పొందడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
శీతాకాలంలో యోని సమస్యల నుంచి ఉపశమనం పొందడం ఎలా?
శీతాకాలంలో పడిపోతున్న ఉష్ణోగ్రత శరీరంలోని మిగిలిన భాగాల మాదిరిగానే ప్రైవేట్ భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్ లో పెదాల పగుళ్లు, చేతులు, కాళ్ల పొడిబారిన చర్మంతో పాటు మహిళల్లో యోని పొడిబారే సమస్య కూడా పెరుగుతుంది. దీన్నే వింటర్ వజైనా అని పిలుస్తారు.
వింటర్ వెగీనా అంటే ఏమిటి?
చల్లని వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, ప్రజలు ఇంటిని శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి హీటర్లను ఉపయోగిస్తారు. కానీ చల్లటి గాలి, హీటర్లను ఎక్కువగా వాడటం వల్ల చర్మంలోని తేమ శాతం తగ్గుతుంది. దీనివల్ల చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. చర్మంలో ఈ పొడిబారడం మిగిలిన అవయవాల మాదిరిగానే మహిళల యోనిని ప్రభావితం చేస్తుంది. శీతాకాలంలో, పొడి యోని సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని వింటర్ వజైనా అంటారు.
వింటర్ వెగీనా లక్షణాలు:
- యోని పొడిబారడం
- యోని ఎరుపు రంగులోకి మారడం
- యోనిలో మంట
- దురద,
- వాపు,
- యోని కుంచించుకుపోవడం
- మూత్ర విసర్జన చేసేటప్పుడు తీవ్రమైన నొప్పి
- యోని సంక్రమణ
- యోని చికాకు
శీతాకాలంలో యోని సమస్యలు ఎక్కువగా ఎందుకు వస్తాయి?
చలికాలంలో నీరు తక్కువగా తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండదు. దీని వల్ల చర్మం పొడిబారినట్టే మహిళల్లో యోని పొడిబారే సమస్య కూడా తలెత్తుతుంది. గర్భాశయం, యోని నుండి వచ్చే ద్రవాలు యోనిని తేమగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ యోనిలో తగినంత తేమ లేకపోతే, యోని సంక్రమణ, యోనిలో ఇతర సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యను నివారించడానికి, తగినంత నీరు త్రాగాలని, హైడ్రేటింగ్ లోషన్లను ఉపయోగించాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. సమస్య మరింత తీవ్రంగా ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.
శీతాకాలంలో యోని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా?
సరైన దుస్తులు:
శీతాకాలం వచ్చిందంటే ఓంటినిండా బట్టలు వేసుకుంటాం. ఇది మంచిదే కానీ ఇక్కడ గుర్తంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. బిగుతుగా ఉండే దుస్తులు యోని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కనుక లోదుస్తులు వదులుగా ఉండేలా చూసుకోండి. యోనికి గాలి అందడానికి, ఆరోగ్యకరమైన పిహెచ్ను నిర్వహించడానికి వదులుగా ఉండే దుస్తులు సహాయపడతాయి. కాటన్ ప్యాంటీలు ధరిస్తే మరింత మంచిది.
యోని ఉత్పత్తులు:
మహిళలు తమ కోసం యోని ఉత్పత్తులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రసాయన ఆధారిత ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిహెచ్ స్థాయి దెబ్బతింటుంది. యోని పొడిబారడకుండా ఉండటానికి కొబ్బరి నూనెను ఉపయోగించడం సురక్షితం.
సమతులాహారం
మీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలను ప్రతిరోజూ ఉండేలా చూసుకొండి. ఇవి శరీరానికి సరైన పోషణను అందించడంతో పాటు యోని ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
జంక్ ఫుడ్
శీతాకాలంలో యోని సమస్యలను తగ్గించుకునేందుకు జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించండి లేదా మొత్తం ఆపేయండి. తీపి, ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్ యోని పిహెచ్ స్థాయిలకు, హార్మోన్ల సమతుల్యతకు భంగం కలిగిస్తాయి. దీనివల్ల యోని పొడిబారడం, మంట, దురద, చికాకు వంటి సమస్యలు రావచ్చు.
వెచ్చని నీటితో స్నానం
శీతాకాలంలో చాలా మంది బాగా వేడినీటితో స్నానం చేస్తారు. ఇది హాయిగా అనిపించినప్పటకి కొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. నీరు ఎంత వేడిగా ఉంటే, మీ చర్మం నుండి అంత ఎక్కువ నూనె, తేమ తొలగిపోతాయి. ఫలితంగా చర్మం పొడిబారడం, యోని ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. చాలా వేడిగా ఉండే షవర్‌ని ఎంచుకోవడానికి బదులుగా గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి.
పరిశుభ్రత పాటించండి
మీ ప్యాడ్, టాంపోన్ లేదా మెన్స్ట్రువల్ కప్పును సమయానికి మార్చండి. ఇలా చేయడం ద్వారా మీరు యోని పొడిబారడం, దురదకు ప్రధాన కారణాలైన అలెర్జీలు, ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. మీరు బాత్రూమ్‌ని ఉపయోగించిన ప్రతిసారీ మీ యోనిని శుభ్రం చేసుకోవాలి.