తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mixed Veg Pakodi: కూరగాయలన్నీ కలిపి మిక్డ్స్ వెజిటేబుల్ పకోడీ వేసేయండి, ఉల్లి పకోడీ కన్నా రుచిగా ఉంటాయి

Mixed Veg Pakodi: కూరగాయలన్నీ కలిపి మిక్డ్స్ వెజిటేబుల్ పకోడీ వేసేయండి, ఉల్లి పకోడీ కన్నా రుచిగా ఉంటాయి

14 September 2024, 15:30 IST

google News
  • Mixed Veg Pakodi: ఎప్పుడూ ఉల్లిపాయలతోనే పకోడీ వేస్తే బోర్ కొట్టేస్తుంది. ఇంట్లో కూరవండగా మిగిలిన ఏవైనా కూరగాయలుంటే వాటన్నింటినీ కలిపి ఇలా మిక్డ్స్ వెజ్ పకోడీ చేసేయండి. రెసిపీ చూసేయండి.

మిక్స్డ్ వెజ్ పకోడీ
మిక్స్డ్ వెజ్ పకోడీ

మిక్స్డ్ వెజ్ పకోడీ

సాయంత్రం పూట వేడివేడిగా తినడానికి ఎప్పుడూ పకోడీలు, బజ్జీలే తిని బోర్ కొడుతోందా? అయితే వాటికే కొత్త ట్విస్ట్ ఇచ్చి కొత్తగా చేసేయండి. ఉల్లిపాయలతో కాకుండా మిక్స్డ్ వెజిటేబుల్ పకోడీ ఒకసారి చేసి చూడండి. ఇంట్లో ఉన్న కూరగాయలు కలిపి వీటిని సులువుగా చేసుకోవచ్చు. అదెలాగో చూడండి.

వెజిటేబుల్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు:

పిండి కోసం:

సగం కప్పు శనగపిండి

పావుచెంచా పసుపు

చిటికెడు ఇంగువ

పావు చెంచా వాము

చెంచా కారం

తగినంత ఉప్పు

డీప్ ఫ్రైకి సరిపడా నూనె

కావాల్సిన కూరగాయ ముక్కలు:

పావు కప్పు క్యాబేజీ తరుగు

పావు కప్పు క్యారట్ ముక్కలు

పావు కప్పు క్యాలీఫ్లవర్ ముక్కలు

పావు కప్పు బీన్స్

పావు కప్పు క్యాప్సికం

పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు

కొద్దిగా కొత్తిమీర

పావు చెంచా అల్లం ముద్ద

రెండు మూడు పచ్చిమిర్చి సన్నని తరుగు

వెజిటేబుల్ పకోడీ తయారీ విధానం:

1. కూరగాయ ముక్కలన్నీ ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి కూడా వేసేయాలి.

2. అందులో పసుపు, ఉప్పు, కారం, ఇంగువ, వాము కూడా వేసేయాలి.

3. శనగపిండి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పకోడీలు వేసేలాగా కాస్త గట్టిగానే పిండి కలుపుకోవాలి.

4. ఇప్పుడు కడాయిలో నూనె తీసుకుని వేడెక్కాక కొద్దికొద్దిగా పిండి మిశ్రమం తీసుకుని పకోడీల్లాగా వేసుకోవాలి. రంగు మారి కరకరలాడుతున్నప్పుడు ఒక పేపర్ టవెల్ మీద వేసుకుంటే ఎక్కువగా ఉన్న నూనె పీల్చేసుకుంటుంది.

5. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ పకోడీలను మీకు నచ్చిన ఏదైనా సాస్ తో సర్వ్ చేసుకుంటే చాలు. చాలా రుచిగా ఉంటుంది.

తదుపరి వ్యాసం