Mutton Ribs Recipe : మటన్ ఇలా ఎప్పుడూ చేసి ఉండరు.. ఒక్కసారి ట్రై చేసి చూడండి
25 December 2023, 18:30 IST
- Mutton BBQ Ribs Curry In Telugu : నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మంది మటన్ అంటే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేయండి. మటన్ పక్కటెముకలతో రెసిపీ చేసి చూడండి.
బీబీక్యూ మటన్ రిబ్స్ రెసిపీ
మటన్ తింటే ఆ టేస్టే వేరు. తెలుగు రాష్ట్రాల్లో మటన్ అంచే చాలా మంది ఇష్టపడతారు. అయితే మటన్ కర్రీని వండటం అందరికీ తెలుసు. కానీ కొత్తగా ట్రై చేస్తేనే కదా కిక్కు. టేస్టీ టేస్టీగా లాగించేయెుచ్చు. అందుకోసమే బీబీక్యూ మటన్ రిబ్స్ తయారు చేయండి, చాలా ఈజీ. పెద్దగా కష్టమేమీ కాదు. ఇంట్లో అందరూ దీనిని ఇష్టంగా తింటారు. చిన్న పిల్లలు సైతం ఎంజయ్ చేస్తారు. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ప్లాట్ ఫామ్ 65 చెఫ్ వీహెచ్ సురేశ్ తెలిపారు. ఓసారి లుక్కేయండి..
కావాల్సిన పదార్థాలు
1. 8 మటన్ పక్కటెముకలు చిన్నగా కట్ చేసుకోవాలి.
2. 100గ్రా BBQ సాస్
3. 20 వెల్లుల్లి ముక్కలు
4. 1 జాజికాయ
5. 15 గ్రాముల నూనె
6. ఉప్పు, మిరియాలు (రుచికి సరిపడా)
బీబీక్యూ మటన్ రిబ్స్ తయారీ విధానం
ముందుగా మటన్ పక్కటెముకలను శుభ్రం చేసి ఆరబెట్టుకోవాలి. అవసరమైతే, పక్కటెముకల నుండి కొవ్వు లేదా పొరను తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో, 100 గ్రాముల BBQ సాస్‌లో వెల్లుల్లిని ముక్కలుగా చేసి కలుపుకోండి. జాజికాయను తురుముకొని లేదా మెత్తగా పొడి చేసి మ్యారినేట్ చేసేందుకు కలపండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, మిరియాలు అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మటన్ పక్కటెముకలకు బాగా పట్టేలా పూసుకోవాలి.
రుచి కోసం, రిబ్స్‌ను కనీసం 2 నుంచి 4 గంటలు లేదా రాత్రిపూట మ్యారినేట్ చేసుకోవచ్చు. ఓవెన్‌ను వేడి చేయండి. బేకింగ్ షీట్ తీసుకోవాలి. మ్యారినేట్ చేసిన మటన్ రిబ్స్ అందులో పెట్టుకోవాలి. పక్కటెముకలను తిప్పుతూ సుమారు 45-60 నిమిషాలు కాల్చండి. వంట కంప్లీట్ అయ్యే 10 నిమిషాల ముందు BBQ సాస్ ముక్కాలా మీద వేయండి. ఇప్పుడు BBQ మటన్ రిబ్స్ రెడీ. వేడిగా సర్వ్ చేయండి. ఎంజాయ్ చేస్తూ తింటారు.