తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Attractive Personality । మీరు అయస్కాంతంలా అందరినీ ఆకర్శించాలంటే.. ఇవిగో చిట్కాలు

Attractive Personality । మీరు అయస్కాంతంలా అందరినీ ఆకర్శించాలంటే.. ఇవిగో చిట్కాలు

HT Telugu Desk HT Telugu

03 January 2023, 20:32 IST

    • Attractive Personality: మిమ్మల్ని అందరూ ఇష్టపడాలంటే మీది ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అయి ఉండాలి. అలాంటి వ్యక్తిత్వం మీరు కోరుకుంటే ఇక్కడ చిట్కాలు ఉన్నాయి.
Attractive Personality
Attractive Personality (Unsplash)

Attractive Personality

కొంతమంది చుట్టూ ఎప్పుడూ జనం ఉంటారు, వారితో ఎవరైనా మాట్లాడాలంటే ఎలాంటి మొహమాటం, ఇబ్బంది అడ్డురాదు, వారితో ఎవరైనా చాలా సౌకర్యంగా ఫీలవుతారు. అలాంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్లినా వారు అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఎందుకంటే వారి వ్యక్తిత్వం అయస్కాంతం లాంటిది. నిజానికి ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అన్నింటిలో రాణిస్తారు, వారికి ఇతరుల నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయి. వారి వద్ద ఒంటరితనం అనేదే ఉండదు. వినోదాలు, విహారయాత్రలతో చాలా సరదాసరదాగా సంతోషంగా గడిచిపోతుంది జీవితం.

ట్రెండింగ్ వార్తలు

Night Shift Effect : ఎక్కువగా నైట్ షిఫ్ట్‌లో పని చేస్తే ఈ సమస్య.. పాటించాల్సిన చిట్కాలు

Chia Seeds Benefits : చియా విత్తనాల ప్రయోజనాలు తెలుసుకోండి.. ఒక్క రోజులో ఎన్ని తివవచ్చు?

Pregnancy Tips : గర్భధారణలో సమస్యలను సూచించే సంకేతాలు, లక్షణాలు ఇవే

Baby First Bath : శిశువుకు మెుదటిసారి స్నానం చేయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

మనోహరమైన వ్యక్తిత్వం ఉంటే అందరినీ అయస్కాంతంలా ఆకర్షించవచ్చు. మీ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు. ఇది మీ నెట్‌వర్క్ పెంచటంతో పాటు, మీ వృత్తిపరమైన పురోగతికి కూడా సహాయపడుతుంది. ఇలా ఉండాలని చాలా మందికి అనిపిస్తుంది, తాము సంతోషంగా ఉంటూ, ఇతరులను సంతోషంగా ఉంచాలని అనుకుంటారు. కానీ వారి భావనలు మనసు నుండి బయటకు రావు. తమలో మంచితనం, మంచి వ్యక్తిత్వం ఉన్నప్పటికీ అది బయటకు కనిపించదు. దీంతో చాలా మందికి వీరిపై చెడు అభిప్రాయం కలుగుతుంది.

Tips to Have Attractive Personality- ఆకర్షణీయమైన వ్యక్తిత్వానికి చిట్కాలు

మీది మంచి వ్యక్తిత్వం అని అందరూ గుర్తించాలంటే, మీ చుట్టూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలంటే వ్యక్తిత్వ నిపుణులు కొన్ని చిట్కాలను అందించారు. అవేంటో మీరూ తెలుసుకోండి మరి.

ఆనందంగా ఉండండి

మీ జీవితంలో ఎలాంటి విచారకర సంఘటనలు ఉన్నప్పటికీ, మీ విచారాన్ని బయటకు ప్రదర్శించకండి. ఎల్లప్పుడూ ఆనందంగా నవ్వుతూ ఉండండి. ప్రపంచంలోని సంతోషకరమైన విషయాలను గమనించడం ద్వారా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇతరులతో నవ్వండి. కానీ, ఇతరులను చూసి నవ్వకండి. మంచి వ్యక్తిత్వానికి చిరునవ్వు చాలా ముఖ్యమైన అంశం. మీది చిరునవ్వుతో కూడిన ముఖం అయితే మీకు ఇతరులు ఆకర్షితులు అవుతారు. మీతో మాటలు కలుపుతారు. అదే మీరు విచారంగా ఉంటే, ఎప్పుడూ బాధలు చెబుతూ ఉంటే మీ చుట్టూ ఎవరూ ఉండరు, జాలిపడి వదిలేస్తారు.

ప్రశాంతంగా వ్యవహరించండి

ఎలాంటి ఒత్తిడిలోనైనా, ప్రశాంతంగా ఉండండి, పరిస్థితులను ప్రశాంతంగా ఎదుర్కోండి. ఇలాంటి వారంటే చాలా మందికి మంచి అభిప్రాయం కలుగుతుంది. ఎదుటి వారి కోపాన్ని వ్యక్తం చేసినా, మీరు ప్రశాంతంగా ప్రతిస్పందిస్తే అది మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది. నిరంతరం చిరాకు, ఒత్తిడిని ప్రదర్శించే వ్యక్తుల నుండి మనుషులు దూరం జరుగుతారు.

ఓపెన్ మైండ్

మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి, కానీ దానిని బలవంతంగా ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించవద్దు. అవతలి వ్యక్తి చెప్పేది సావధానంగా వినండి. ఇలాంటి వ్యక్తులతో మాట్లాడాలని, అభిప్రాయాలను పంచుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. ఎదుటివారు చెప్పేది వినకుండే వారే ఎల్లప్పుడూ కరెక్ట్ అనే వారితో ఎవరూ వేగలేరు.

అహంభావంతో ఉండకండి

అహంకారం ఎన్నటికీ పనికిరాదు. మీ వద్ద ఉన్నది, ఇతరుల లేదని ఎవరిని చిన్నచూపు చూడకూడదు, ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. తాము చాలా గొప్ప, ఎదుటి వారు ఎవరైతే మాకేంటి అనుకునే అహంకారులకు ఎవరైనా దూరంగా ఉంటారు. మీ అహాన్ని ఎవరూ ఇష్టపడలేరు. కాబట్టి అహంకార వైఖరిని వీడి, అందరూ ఒక్కటే అనే భావన కలిగినవారికే మద్ధతు ఎక్కువ ఉంటుంది.

ఇతరులను ప్రేమించడం నేర్చుకోండి

వీలైతే ప్రేమించండి డ్యూడ్స్.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఒకరి రూపం, ఒకరి గుణగణాలు చూసి కొందరితో ప్రేమగా, మరికొందరితో చిరాకుగా ఉండకండి. అందరినీ ప్రేమించడం నేర్చుకోండి, ఇతరులను నిందిస్తూ సమయాన్ని వెచ్చించకండి. ఇలా ఉన్నప్పుడు మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. వారు మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.

మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి

మిమ్మల్ని ఒకరు ప్రేమించాలంటే, ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలతో ఉండండి. ఇతరుల గురించి కూడా సానుకూలంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. మీ గురించి సానుకూల ఆలోచనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.

మీ జ్ఞానాన్ని పంచండి

మీ జ్ఞానాన్ని మీ వద్దే దాచుకోకుండా , మీకు తెలిసిన వాటిని ఇతరులకు చెప్పండి. వారికి సరైన మార్గదర్శకత్వం అందించండి. అయితే మీకే అన్నీ తెలిసినట్లు ప్రవర్తించకూడదు. ఇతరులకు అవసరమైనపుడు మద్దతును అందించండి. వీలైనప్పుడల్లా ఇతరులకు సహాయం చేయండి. మీరు మీ స్నేహితుడికి చేసే చిన్న సహాయం కూడా వారి జీవితంలో గొప్ప మార్పును తెస్తుంది. అనర్హులకు సహాయం చేయవద్దు.

ఇలాంటి లక్షణాలను అలవర్చుకుంటే అందరి దృష్టిలో మీది మంచి వ్యక్తిత్వం అనే అభిప్రాయం కలుగుతుంది, మీకు అందరూ ఆకర్షితమవుతారు.

తదుపరి వ్యాసం