తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Love Guru Tips | అమ్మాయిలను చేయాలంటే ఇంప్రెస్, అబ్బాయిల్లో ఉండాలి ఇలాంటి ఫీచర్స్

Love Guru Tips | అమ్మాయిలను చేయాలంటే ఇంప్రెస్, అబ్బాయిల్లో ఉండాలి ఇలాంటి ఫీచర్స్

HT Telugu Desk HT Telugu

22 June 2022, 21:25 IST

google News
    • అన్నీ అర్హతలు ఉన్నా మీకు ఏ ఆడతోడు దొరకడం లేదా? అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే మగాళ్లలో ఎలాంటి లక్షణాలు ఉండాలో ఎక్స్‌పర్ట్స్ చెప్పే సలహాలు ఇక్కడ ఉన్నాయి.
Relationship Tips
Relationship Tips (Pixabay)

Relationship Tips

మంచి ఉద్యోగం, సంపాదన, పేరు, హోదా ఇవన్నీ మెల్లగా ఎలాగో అలా సాధించవచ్చు. కానీ కోరుకున్న అమ్మాయిని సాధించాలంటే మాత్రం చాలా కష్టం. కొంతమంది మగవాళ్లకు అన్ని రకాల అర్హతలు ఉన్నా.. అమ్మాయిల విషయంలో మాత్రం చాలా వెనకబడి ఉంటారు. వారితో పోల్చితే ఏ అర్హత లేనివారు సైతం అమ్మాయిని మెప్పించి హీరో అవుతారు. జంటలుగా తిరుగుతూ సింగిల్స్ కింగ్ లను మెంటల్ గా టార్చర్ చేస్తారు. మరి అమ్మాయిలను చేయాలంటే ఇంప్రెస్ మీకు కావాలి కొన్ని ఫ్రెష్ ఐడియాస్. మీరు కూడా ఒక అమ్మాయిని ఇష్టపడి, ఆమెను మీ జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, ముందుగా అమ్మాయిల కోణం నుంచి ఆలోచించండి. ప్రతి అమ్మాయి తన జీవిత భాగస్వామిలో చూడాలనుకునే ఆ 5 లక్షణాల గురించి నిపుణులు కొన్ని సలహాలు ఇచ్చారు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

ఆడవారిని గౌరవించే సంస్కృతి

ప్రతి అమ్మాయి తన కాబోయే జీవిత భాగస్వామి తనకు పూర్తి గౌరవం ఇవ్వాలని కోరుకుంటుంది. ఆడవాళ్లను గౌరవించే అబ్బాయిలనే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. మర్యాదగా నడుచుకునే అబ్బాయిలు తొందరగా అమ్మాయిల హృదయానికి ఆకర్షితులవుతారు.

నిజాయితీ

ఏ బంధానికైనా నమ్మకమే ఆధారం. మీరు సరసాల సోగ్గాడు అయితే మీకు ఉన్న ఈ అలవాటు గురించి ఏ స్త్రీ అయినా త్వరలోనే తెలుసుకుంటుంది. అమ్మాయిల నుండి ఏదైనా దాచడానికి ప్రయత్నించవద్దు. నిజాయితీగా ఉండాలి. మీరు ఆ అమ్మాయిని నిజంగా ఇష్టపడితే, ఆమెను మీ జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంటే. లోపల ఏది ఉన్నా దాచకండి, బయటకు చెప్పేయండి. ఒప్పించడానికి ప్రయత్నించండి. అబద్ధాలతో మోసం చేయాలనుకునే అబ్బాయిలతో అమ్మాయిలు అలాగే ఉంటారు. అబ్బాయి చెడ్డవాడైనా సరే అతనిలో నిజాయితీ ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారు.

తెలివైన నిర్ణయాలు

ఏమి తెలియని అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడరు. జీవితంపై ఒక అవగాహన ఉండాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు. అబ్బాయిల్లో ఉండే ఈ గుణం వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. అప్పుడు వారికి మీపై ఒక భరోసా కలుగుతుంది. మంచి డిసీషన్ మేకింగ్ ఉండే అబ్బాయిలను ప్రతి అమ్మాయి ఇష్టపడుతుంది.

తోడు నిలిచేవారు

అబ్బాయిలు ఎవరైతే అమ్మాయిల కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని, వారి ప్రాముఖ్యతలు తెలుసుకొని నడుచుకుంటారో అలాంటి వారినే అమ్మాయిలు ఎప్పటికీ కోరుకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తనకు అండగా నిలిచే అబ్బాయిలను అమ్మాయిలు చాలా ఇష్టపడతారు.

హాస్య చతురత

నవ్వించే అబ్బాయిలు ఉంటే అమ్మాయిలు అలాంటి వారితో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండాలనుకుంటారు. ప్రతిసారీ నవ్వుతూ, ఉల్లాసంగా, సరదాగా ఉండే వ్యక్తి తనతో జీవితాంతం తోడుండాలని అమ్మాయిలు కోరుకుంటారు. మీలో హాస్య చతురత లేకపోయినా నవ్వుతూ పలకరించండి. అంతేకానీ కుళ్లు జోకులు, మీ బాధలు చెప్తే ఉన్న ఇంప్రెషన్ కూడా హాంఫట్ అవుతుంది జాగ్రత్త.

కాబట్టి అబ్బాయిలూ.. ఇప్పుడు అర్థం అయ్యింది కదా? లైలాను చేయాలంటే ఇంప్రెస్.. ఫాలో అయిపోండి పైన చెప్పిన చిట్కాస్!

టాపిక్

తదుపరి వ్యాసం