Improve Concentration । మీ ఏకాగ్రతను పెంచేందుకు ఇవిగో చిట్కాలు!
16 April 2023, 19:07 IST
- Improve Concentration: ఏ పనిపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారా.. మీ ఏకాగ్రతను పెంచేందుకు ఈ చిట్కాలు పాటించండి.
Improve Concentration
ఏ పని చేసినా ఏకాగ్రతతో చేయాలంటారు. ఏకాగ్రత లేకుండా చేసే పని ఫలితాలను ఇవ్వదు. విద్యార్థులు పరీక్షల కోసం చదువుతున్నా, ఉద్యోగులు ఏదైనా ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నా లేదా ఒక పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నా ఏకాగ్రత అనేది ముఖ్యం. మనం మన పనిలో పెట్టే ఏకాగ్రతనే మన పనితీరును మెరుగుపరుస్తుంది, ఉత్పాదకతను పెంచుతుంది, మెరుగైన ఫలితాలను సాధించడంలో తోడ్పడుతుంది. అయితే నేటి వేగవంతమైన జీవితంలో చాలా మంది ఏకాగ్రతను సాధించడంలో విఫలమవుతున్నారు. ఒకేసారి వివిధ పనులను చక్కబెట్టడం, దైనందిన జీవితంలో నిరంతరంగా ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళనలు ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయి.
Ways To Improve Concentration- ఏకాగ్రతను పెంచే చిట్కాలు
మరి ఏకాగ్రతను సాధించాలి అంటే ఏం చేయాలి అన్న ప్రశ్నకు నిపుణులు కొన్ని మార్గాలను సూచించారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పరధ్యానాలను నివారించడం
ఏకగ్రతను కోల్పోతున్నామంటే మనం పరధ్యానంలో ఉంటున్నామని అర్థం. మీ ఏకాగ్రతను మెరుగుపరచడానికి పరధ్యానాన్ని నివారించడం అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. మీ దృష్టి మరల్చే (Distractions) అంశాలేవో గుర్తించండి. సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు, నిరంతరమైన ఫోన్ కాల్ సంభాషణలు లేదా చాటింగ్, లేదా పోర్నోగ్రఫీ దృశ్యాలు చూడటం, ఒకరి గురించి ఆలోచించడం, బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలు ఇలా అనేక రూపాల్లో పరధ్యానం రావచ్చు. అంతరాయాలను వదిలించుకోవడానికి, మీ ఫోన్‌ని పవర్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించండి, వాటికోసం రోజులో మరోసమయం కేటాయించండి, పనిపై దృష్టిపెట్టడానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి.
విరామాలు తీసుకోండి
ఏకాధాటి పని నుంచి క్రమం తప్పకుండా విరామాలు తీసుకోవడం వల్ల మీ మనస్సుకు విశ్రాంతినివ్వండి. మీరు మరలా రీఛార్జ్ అవడానికి స్వల్ప విరామం (Take a break) ఉపయోగపడుతుంది. ఇది మీ ఏకాగ్రతను మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది. రోజంతా చిన్న విరామాలు తీసుకోవడం వలన పనితీరును, ఉత్పాదకతను పెంచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. విశ్రాంతి తీసుకోవడానికి, పని నుండి కొన్ని నిమిషాలు దూరంగా ఉండండి, నడకకు వెళ్లండి లేదా మానసిక శ్రమ లేని చర్యలు తీసుకోండి.
శ్వాస వ్యాయామాలు ప్రాక్టీస్ చేయండి
శ్వాస వ్యాయామాలు (Breathing Exercises) మీ ఏకాగ్రతను మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో మీకు సహాయపడే అభ్యాసాలు. మీ పనిపై దృష్టి పెట్టలేనపుడు కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామాలు అభ్యాసం చేయండి. మీ నాసికా రంధ్రాల ద్వారా గాలి పీల్చుకోండి, నోటి ద్వారా వదలండి. మీ శ్వాసపై మీ దృష్టిని కేంద్రీకరించండి.
మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్
బుద్ధిపూర్వక ధ్యానం (Mindfulness Meditation) అనేది ఏకాగ్రతను మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగించే ఒక ప్రసిద్ధ టెక్నిక్. ఈ వ్యాయామం మీ శ్వాసపై మీ దృష్టిని కేంద్రీకరించడానికి, ప్రస్తుత క్షణంలో ఉండటానికి తోడ్పడుతుంది. మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ సాధన చేయడానికి, మీరు ఒక నిశబ్ద ప్రదేశాన్ని ఎంచుకోండి. కనీసం 10 నిమిషాల పాటు హాయిగా, అంతరాయం లేకుండా కూర్చోండి. మీ కళ్ళు మూసుకోండి, లోతైన శ్వాస తీసుకోండి. మీ ఆలోచనలు మీకు అంతరాయం కలిగిస్తే. మీరు శ్వాస తీసుకునేటపుడు ఒక శబ్దం, వదిలేటపుడు ఒక శబ్దం పలకండి లేదా మనసులోనే అనుకోండి.Pr