Tips for Drinking Water: నిల్చొని గబాగబా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలిస్తే, ఇంకెప్పుడూ అలా తాగరు!
12 October 2024, 19:00 IST
Drink Water Properly: శారీరక శ్రమ లేదా ప్రయాణం చేసిన తర్వాత మనకి దప్పిక వేయడం సహజం. కానీ ఆ దప్పికని తీర్చుకోవడానికి తొందరపడి ఎలా పడితే అలా నీరు తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
నిల్చొని నీరు తాగొద్దు
మనలో చాలా మంది ప్రయాణం చేసి ఇంటికి వచ్చిన తర్వాత గబగబా వెళ్లి ప్రిజ్ ఓపెన్ చేసి నిల్చొన్న చోటనే నీళ్లు తాగేస్తుంటారు. నిజమే.. మన ప్రాథమిక అవసరాలలో నీరు ఒకటి. కానీ.. ఎలా పడితే అలా నీరు తాగితే మీ ఆరోగ్యానికే ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తి శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. అది చెమట లేదా మూత్రం ద్వారా మన శరీరం నుండి బయటకు వెళ్లిపోతుంది. దాంతో తగినంతగా హైడ్రేట్‌గా ఉండటం కోసం నీరు తాగుతుంటారు. మనిషి రోజుకి సగటున కనీసం 7-8 గ్లాసుల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నీరు తాగడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు
శరీరం నుంచి మలినాల్ని తొలగించడంలో నీరు సహాయపడుతుంది. మీ బరువును అదుపులో ఉంచుకోవచ్చు, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మీ చర్మం మృదువుగా, అందంగా మారుతుంది. డీహైడ్రేషన్ దరిచేరదు. అయితే నీరు తాగేటప్పుడు.. ఈ తప్పులు చేయవద్దు.
ప్లాస్టిక్ బాటిల్స్
మీరు నీరుని ఇంట్లో ప్లాస్టిక్ సీసాల్లో నింపుతుంటే వెంటనే ఆ అలవాటుని మానుకోండి. ఎందుకంటే.. ఆ నీరు తాగడం వల్ల మనిషి రక్తంలో క్యాన్సర్‌కు కారణమయ్యే మైక్రోప్లాస్టిక్‌లు చేరుతున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం సూర్యరశ్మి ప్లాస్టిక్ బాటిల్‌ను తాకినప్పుడు నీటిలోకి మైక్రోప్లాస్టిక్‌లను విడుదుల అవుతుంది.
గబాగబా తాగేయకూడదు
మీ ఎంత ప్రయాణం చేసి వచ్చినా లేదా అలసిపోయినా గబాగబా నీరుని తాగకూడదు. చిన్న సిప్స్ ద్వారా నెమ్మదిగా తాగాలి. అప్పుడే మీ జీర్ణవ్యవస్థను ఆ నీరు బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.అలానే మీ శరీరంలో జీవక్రియకు సపోర్ట్ లభిస్తుంది.
కూర్చుని తాగాలి
నిలబడి నీరు తాగొద్దు. మీకు ఆశ్చర్యంగా అనిపించినా.. మీరు చదివింది నిజమే. నీరు తాగడానికి అత్యంత ఖచ్చితమైన మార్గాలలో ఒకటి కూర్చుని తాగడం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నిలబడి నీటిని తాగినప్పుడు అవి నేరుగా మీ దిగువ పొత్తికడుపులోకి వెళ్లడం వల్ల పోషకాలు, ఖనిజాలు మీకు సరైన రీతిలో అందవని సూచిస్తున్నారు. అలానే మూత్రపిండాలు, మూత్రాశయం మీద ఒత్తిడి తెస్తుంది. కాబట్టి, నెమ్మదిగా కూర్చుని నీటిని తాగాలని సూచిస్తున్నారు.
కుండల్లేవ్.. రాగి బెస్ట్
మన పెద్దవారు మట్టి కుండలలో నీరు తాగేవాళ్లు. అలా తాగితే ఎలాంటి రసాయనాలు దరిచేరవు. అలానే మీ జీవక్రియను కూడా పెంచుతుంది. కానీ.. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ దాదాపు ప్రిజ్‌లు ఉంటుండంతో మట్టి కుండలు కరువయ్యాయి. అయితే నీరుని ప్లాస్టిక్ బాటిళ్లలో నింపే బదులు రాగి, స్టీల్, గ్లాస్ బాటిల్స్‌లో నింపుకుని తాగడం ఉత్తమం.