Spinach Banana Smoothie : స్పినాచ్ బనానా స్మూతీ ఇలా తయారు చేసి.. అలా అధిక రక్తపోటుకు గుడ్‌బై చెప్పండి
29 January 2024, 15:30 IST
- Spinach Banana Smoothie : అధిక రక్తపోటుదో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని నుంచి బయటపడేందుకు పాలకూర, అరటిపండు స్మూతీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
స్పినాచ్ బనానా స్మూతీ తయారీ విధానం
పాలకూరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే అరటిపండుతోనూ చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ రెండింటీ కాంబినేషన్‌లో చేసే స్మూతీతో రక్తపోటును తగ్గించుకోవచ్చు. ఇటీవలి కాలంలో చాలా మంది ప్రజలు రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారు. అధిక రక్తపోటు చాలా ప్రమాదకరం. ఈ సమస్య ఉంటే అది వివిధ ప్రమాదకరమైన వ్యాధులకు దారి తీస్తుంది. గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యం, స్ట్రోక్ కూడా వస్తాయి.
అధిక రక్తపోటు అనేది హృదయ సంబంధ సమస్యకు దారితీస్తుంది. ఈ సమస్య ఉన్నవారి ధమనులలో ప్రవహించే రక్తం ధమని గోడలపై అధిక ఒత్తిడిని కలిగించి, గుండె పనితీరులో సమస్యలను కలిగిస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారు వెంటనే నియంత్రించుకోవాలి.
సాధారణంగా అధిక రక్తపోటు ఉన్నవారు దానిని అదుపులో ఉంచుకోవడానికి రోజూ మాత్రలు వేసుకుంటూ ఉంటారు. కానీ అద్భుతమైన, రుచికరమైన పానీయంతో అధిక రక్తపోటు సమస్యను నియంత్రించవచ్చు. సింపుల్ గా ఇంట్లోనే రుచికరమైన స్మూతీని తయారు చేసి తాగడం ద్వారా అధిక రక్తపోటును తగ్గించుకోవచ్చు. ఈ స్మూతీని బచ్చలికూర, అరటిపండుతో తయారు చేస్తారు. ఇది రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తుంది.
అరటిపండ్లలో అధిక రక్తపోటును తగ్గించడానికి అవసరమైన పొటాషియం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల అరటిపండులో 358 మి.గ్రా పొటాషియం దొరుకుతుంది. అరటిపండ్లలో జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది.
రక్తపోటు రోగులకు కూడా పాలకూర చాలా ఉపయోగకరం. ఇందులో పొటాషియం పుష్కలంగా దొరుకుతుంది. 100 గ్రాముల బచ్చలికూరలో 558 మిల్లిగ్రాముల పొటాషియం ఉంటుంది. అంతే కాకుండా పాలకూరలో ఉండే ఐరన్ రక్తపోటు రోగులకు మంచిది.
స్మూతీని ఎలా చేయాలి
కావాల్సిన పదార్థాలు : అరటిపండు - 2, పాలకూర - 1 కప్పు, ఆరెంజ్ జ్యూస్ - 1/2 కప్పు, స్ట్రాబెర్రీ లేదా పైనాపిల్ - కొద్దిగా (కావాలనుకుంటే), ఫ్లాక్స్ సీడ్ లేదా చియా సీడ్ లేదా గుమ్మడి గింజ - 1/2 tsp.
అరటిపండ్లను తొక్క తీసి బ్లెండర్‌లో వేసి నారింజ రసంతో కలిపి బాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు పాలకూరను నీళ్లలో వడకట్టి అందులో 1/2 కప్పు నీళ్లు పోసి బాగా రుబ్బుకోవాలి. కావాలనుకుంటే స్ట్రాబెర్రీ, పైనాపిల్ వంటి పండ్లను కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. చివరగా గ్రౌండ్ స్మూతీని ఒక టంబ్లర్‌లో పోసి, దానిపై అవిసె గింజలు లేదా గుమ్మడి గింజలు లేదా చియా గింజలను చల్లి తాగేసేయాలి.
అధిక రక్తపోటు సమస్య ఉంటే బనానా స్పినాచ్ స్మూతీ చాలా ఆరోగ్యకరం. ఈ స్మూతీని నిత్యం తాగితే శరీరమంతా ఆరోగ్యంగా ఉంటుంది. అరటిపండ్లు, పాలకూరలో ప్రోటీన్లు దొరుకుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అనేక ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి.