తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Smart Tv Cleaning Tips: టీవీ స్క్రీన్‍ను ఎలా పడితే అలా క్లీన్ చేయొద్దు.. ఈ టిప్స్ పాటించండి

Smart TV Cleaning Tips: టీవీ స్క్రీన్‍ను ఎలా పడితే అలా క్లీన్ చేయొద్దు.. ఈ టిప్స్ పాటించండి

03 December 2024, 12:30 IST

google News
    • Smart TV Cleaning Tips: స్మార్ట్ టీవీ స్క్రీన్‍లకు దుమ్ముపడుతూ ఉంటుంది. దాన్ని క్లీన్ చేసే సమయంలో స్క్రీన్‍పై గీతలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కొన్ని టిప్స్ పాటిస్తే శుభ్రంగా, ఎలాంటి గీతలు లేకుండా క్లీన్ చేసుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూడండి.
Smart TV Cleaning Tips: టీవీ స్క్రీన్‍ను ఎలా పడితే అలా క్లీన్ చేయొద్దు.. ఈ టిప్స్ పాటించండి
Smart TV Cleaning Tips: టీవీ స్క్రీన్‍ను ఎలా పడితే అలా క్లీన్ చేయొద్దు.. ఈ టిప్స్ పాటించండి

Smart TV Cleaning Tips: టీవీ స్క్రీన్‍ను ఎలా పడితే అలా క్లీన్ చేయొద్దు.. ఈ టిప్స్ పాటించండి

స్మార్ట్ టీవీల స్క్రీన్‍లపై దుమ్ము అంటుకుంటూ ఉంటుంది. మరకలు ఉంటే స్క్రీన్ చూసేందుకు అసలు బాగోదు. అందుకే తరచూ స్క్రీన్‍ను క్లీన్ చేస్తూ ఉండడం అవసరం. అయితే, స్క్రీన్‍ను క్లీన్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే గీతలు పడతాయి. ఇలాగే ఎక్కువ స్క్రాచ్‍లు పడితే డిస్‍ప్లే సరిగా కనిపించదు. అందుకే స్క్రీన్‍ను ఎలాపడితే అలా తుడిచేయకూడదు. ఎలాంటి టిప్స్ పాటించాలో ఇక్కడ చూడండి.

మైక్రోఫైబర్ క్లాత్ వాడాలి

టీవీ స్క్రీన్‍ను మైక్రోఫైబర్ క్లాత్‍తోనే తుడవాలి. సాధారణ క్లాత్‍లు రఫ్‍గా ఉంటాయి. వాటితో స్క్రీన్‍ను క్లీన్ చేస్తే గీతలు పడతాయి. టిష్యూలను అసలు వాడకూడదు. స్మార్ట్ టీవీల స్క్రీన్‍లు ఎస్‍సీడీ, ఎల్‍ఈడీ, ఓఎల్ఈడీ ప్యాన్‍ళ్లతో ఉంటాయి. ఈ స్క్రీన్‍లు సెన్సిటివ్‍గా ఉంటాయి. అందుకే వీటిని శుభ్రం చేసేందుకు మైక్రోఫైబర్ క్లాత్ వినియోగించాలి. క్లీన్ చేసే సమయంలో టీవీ ఆఫ్ చేసే ఉండాలి.

తుడిచే పద్ధతి ఇలా..

టీవీ స్క్రీన్‍ను తుడిచేందుకు ఓ క్రమంగా పాటించాలి. గందోళంగా, గజిబిజీగా స్క్రీన్‍పై టవల్‍తో రుద్దకూడదు. అడ్డంగా ఓసారి తుడిస్తే.. కింది నుంచి పైవరకు పూర్తిగా అడ్డంగా క్లీన్ చేయాలి. నిలువగా అయితే ఓసైడ్ నుంచి మరోసైడ్‍కు నిలువగానే తుడవాలి. అడ్డంగా, నిలువుగా వెంటవెంటనే రుద్దితే అంత బాగా క్లీన్ అవదు. ఛారలు, మసకలు ఉన్నట్టుగా అవుతుంది. ఓ టవల్‍కు దుమ్ము ఎక్కువగా అయిందనిపిస్తే.. వేరేది మార్చి తుడవాలి. టీవీ స్క్రీన్‍ను గట్టిగా అదిమి తుడవకూడదు. మైక్రోఫైబర్ క్లాత్‍తో సున్నితంగా క్లీన్ చేయాలి. గట్టిగా అదిమితే గీతలు పడే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి స్క్రీన్ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది.

స్ప్రేలు, కెమికల్స్ విషయంలో జాగ్రత్త

టీవీ స్క్రీన్‍లను క్లీన్ చేసేందుకు హానికర కెమికల్స్ అసలు వాడకూడదు. ఇవి వాడితే డిస్‍ప్లే మరకలు పడడమే కాకుండా.. డ్యామేజ్ కూడా కావొచ్చు. కోటింగ్ దెబ్బతినొచ్చు. అల్కహాల్, అమ్మోనియా లాంటివి వినియోగించకూడదు. ప్రత్యేకంగా టీవీ స్క్రీన్‍ల కోసం స్ప్రేలు లభ్యమవుతాయి. వాటిలోనూ ఎలాంటి పదార్థాలు వాడారో చూసిన తర్వాతే టీవీని క్లీన్ చేసేందుకు వినియోగించాలి. అలాగే, స్ప్రేలోని ద్రావణాన్ని నేరుగా టీవీపై వేయకూడదు. ముందుగా మైక్రోఫైబర్ క్లాత్‍పై స్ప్రే చేసి.. దానితో స్క్రీన్‍ను క్లీక్ చేయాలి. ఇలా చేస్తే చుక్కలు కూడా పడకుండా ఉంటుంది.

అంచులకు దూది వాడాలి

టీవీ డిస్‍ప్లేను క్లీన్ చేసినా.. సన్నగా ఉండే అంచుల వద్ద కాస్త దుమ్ము ఉంటుంది. దీన్ని క్లాత్‍తో తుడవలేం. అందుకే అంచులను క్లీన్ చేసేందుకు దూది వాడాలి. దూదిని కాస్త ఉండలా చేసుకొని అలా నాలుగు అంచుల వెంట తుడవాలి. దీంతో దుమ్ము దూదికి అంటుకుంటుంది. దీంతో స్క్రీన్ మొత్తం క్లీన్ చేసినట్టు అవుతుంది.

తదుపరి వ్యాసం