తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ceiling Fan Cleaning Tips : 5 నిమిషాల్లో సీలింగ్ ఫ్యాన్ క్లీన్ చేసేందుకు సూపర్ చిట్కాలు

Ceiling Fan Cleaning Tips : 5 నిమిషాల్లో సీలింగ్ ఫ్యాన్ క్లీన్ చేసేందుకు సూపర్ చిట్కాలు

Anand Sai HT Telugu

16 February 2024, 12:30 IST

google News
    • Ceiling Fan Clean Tips : ఫ్యాన్ లేకుండా ఉండాలంటే కష్టం. ఏ కాలమైన కొందరి ఇళ్లలో ఫ్యాన్ తిరుగుతూ ఉండాలి. అయితే దీని మీద పేరుకుపోయిన దుమ్మును తొలగించుకునేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.
సీలింగ్ ఫ్యాన్ క్లీనింగ్ టిప్స్
సీలింగ్ ఫ్యాన్ క్లీనింగ్ టిప్స్ (Unsplash)

సీలింగ్ ఫ్యాన్ క్లీనింగ్ టిప్స్

ఎండాకాలం వస్తుంది. ఒక్కసారి సీలింగ్ ఫ్యాన్ తీసి.. దానికున్న దుమ్ము దులపాలని చాలా మంది అనుకుంటారు. అయితే దానిపై పేరుకుపోయిన దుమ్మును తొలగించడం అంటే అంత ఈజీ కాదు. చాలా కష్టపడాలి. ఫ్యాన్ దుమ్ము పోవాలంటే ఏదైనా క్లాత్ తీసుకుని కొందరు రుద్దుతూ ఉంటారు. కానీ దాని నుంచి ఫలితం తక్కువే ఉంటుంది. తక్కువ కష్టంతో సీలింగ్ ఫ్యాన్‌ను 5 నిమిషాల్లో క్లీన్ చేసేందుకు కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి కచ్చితంగా మీరు తెలుసుకోవాలి.

ప్రతి ఒక్కరి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది. కానీ శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. అటువంటి దానిని శుభ్రం చేసేందుకు కచ్చితంగా కొన్ని టిప్స్ పాటించాలి. అప్పుడే ఫ్యాన్ శుభ్రంగా ఉంటుంది. బాగా తిరుగుతుంది. ప్రతిరోజూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం అంత తేలికైన పని కాదు. ఎంత శుభ్రం చేసినా దుమ్ము, ధూళి ఉంటుంది. అది కాస్త వెళ్లి ఫ్యాన్ మీద ఉంటుంది. మరోవైపు పండుగలు, ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కొన్ని వస్తువులను శుభ్రం చేయడం మనకు అలవాటు. రోజురోజుకూ చెత్త పేరుకుపోతోందని క్లీన్ చేస్తూ ఉంటాం. అలాంటి వాటిలో ఒకటి సీలింగ్ ఫ్యాన్.

ఫ్యాన్‌ను మనం రోజూ వాడుకుంటాం.. కానీ రోజూ శుభ్రం చేయలేం. ప్రత్యేక రోజుల్లో మాత్రమే శుభ్రం చేయడం వల్ల దానిపై దుమ్ము పేరుకుపోయి వెంటనే తొలగించడం కష్టమవుతుంది. ఈ సమస్యను ఎదుర్కొంటే.. శుభ్రపరచడాన్ని సులభతరం చేయడానికి కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూడండి..

వెనిగర్

డస్టీ సీలింగ్ ఫ్యాన్‌ను వెనిగర్ తో నిమిషాల్లో తలతల మెరిసేలా మార్చుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో వెనిగర్, ఒక టీస్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేసి ఫ్యాన్ పై అప్లై చేయాలి. తర్వాత 5 నిమిషాల తర్వాత తడి కాటన్ క్లాత్‌తో బాగా శుభ్రం చేసుకోవాలి.

ఆలివ్ ఆయిల్

ఫ్యాన్ రంగు చెక్కుచెదరకుండా ఉండాలంటే ముందుగా ఫ్యాన్ రెక్కను గుడ్డతో తుడవండి. తర్వాత దానిపై ఆలివ్ ఆయిల్ రాసుకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత, దాని రెక్కలను కాటన్ గుడ్డతో శుభ్రం చేయండి. ఇది మెరిసేలా మారుతుంది. మీ ఫ్యాన్ కొత్తగా కనిపిస్తుంది.

బేకింగ్ సోడా

మీరు బేకింగ్ సోడా, సబ్బును ఉపయోగించి ఫ్యాన్‌ను శుభ్రం చేయవచ్చు. ముందుగా, బేకింగ్ సోడా, సబ్బును బాగా కలపండి. ఒక గుడ్డ లేదా స్పాంజితో ఫ్యాన్‌ను శుభ్రం చేయండి.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనెతోనూ సీలింగ్ ఫ్యాన్ శుభ్రం చేసుకోవచ్చు. దీనికోసం కొన్ని చుక్కల కొబ్బరి నూనె ఫ్యాన్ మీద వేయండి. ఆ తర్వాత బ్రెష్ లాంటిది తీసుకుని క్లీన్ చేయండి. అనంతరం ఓ క్లాత్ తీసుకుని తూడవాలి.

ఫ్యాన్‌ను కచ్చితంగా శుభ్రం చేయాలి. లేదంటే దుమ్ము పేరుకుపోయి ఇబ్బందులు కలుగుతాయి. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు దానిపై ఉన్న చిన్న దుమ్ము రేణువులు మనలోకి వెళ్లే అవకాశం ఉంది. అందుకే పైన చెప్పిన చిట్కాలను పాటించి 5 నిమిషాల్లో ఫ్యాన్ శుభ్రం చేసుకోండి.

తదుపరి వ్యాసం