తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fabric Estimator: ఏ డ్రెస్ కుట్టడానికి ఎన్ని మీటర్ల క్లాత్ అవసరం? కుర్తా నుంచి బ్లవుజు దాకా దేనికెంత కావాలంటే

Fabric Estimator: ఏ డ్రెస్ కుట్టడానికి ఎన్ని మీటర్ల క్లాత్ అవసరం? కుర్తా నుంచి బ్లవుజు దాకా దేనికెంత కావాలంటే

18 September 2024, 12:30 IST

google News
  • Fabric length Estimator: ఏదైనా డ్రెస్సు మీరే టైలర్ దగ్గర డిజైన్ చేయించుకుంటే ఏ డ్రెస్సుకు ఎన్ని మీటర్ల క్లాత్ తీసుకోవాలనే సందేహం ఉంటుంది. అబ్బాయిలు, అమ్మాయిల వివిద డ్రెస్సుల రకాలకు దేనికి ఎన్ని మీటర్ల క్లాత్ లేదా ఫ్యాబ్రిక్ అవసరం అవుతుందో చూడండి. 

ఏ డ్రెస్సుకు ఎన్ని మీటర్ల క్లాత్ అవసరం
ఏ డ్రెస్సుకు ఎన్ని మీటర్ల క్లాత్ అవసరం (freepik)

ఏ డ్రెస్సుకు ఎన్ని మీటర్ల క్లాత్ అవసరం

దసరా పండగకు షాపింగ్ మొదలుపెట్టారా లేదా? చాలా సమయం ఉంది అనుకుంటే పొరపాటే. ఏదైనా ప్రత్యేకమైన డ్రెస్సులు కుట్టించుకోవాలంటే షాపింగ్ ఇప్పుడే మొదలు పెట్టాల్సిందే. రెడీమేడ్ దుస్తులకు ఏ సమస్య ఉండదు కానీ, మీరే డిజైనింగ్ చేయించుకోవాలంటే ఓ సందేహం ఉంటుంది. ఎలాంటి డ్రెస్సుకు ఎన్ని మీటర్ల ఫ్యాబ్రిక్ అవసరం అనే ప్రశ్న ఉంటుంది. అందుకే ప్రతి డ్రెస్సుకు అమ్మాయిలకు, అబ్బాయిలకు ఎన్ని మీటర్ల క్లాత్ అవసరం అవుతుందో చూడండి.

కుర్తా, ప్యాంట్లు:

కుర్తాలు, ప్యాంట్లలో రకరకాల డిజైన్లుంటాయి. వాటన్నింటికీ వేరు వేరు మీటర్ల క్లాత్ అవసరం. అవేంటో చూడండి.

కుర్తాలు:

అనార్కలీకి ఎంత గేరా ఉంటే అంత బాగుంటుంది. కాబట్టి దీనికోసం కనీసం 5 మీటర్ల ఫ్యాబ్రిక్ అవసరం.

తక్కువ ఫ్లేర్ అనార్కలీ కుర్తీ కోసం మూడు నుంచి 4 మీటర్లు

మామూలు సల్వార్ కుర్తీకి రెండు నుంచి రెండున్నర మీటర్లు

షార్ట్ కుర్తీ 2 మీటర్లు

లాంగ్ కుర్తీ 3 మీటర్లు

మ్యాగ్జీ లెంగ్త్ డ్రెస్ కోసం 4 మీటర్లు

A లైన్ కుర్తా 2 మీటర్లు

అసిమెట్రిక్ (ముందు తక్కువ, వెనక ఎక్కువగా ఉండే డిజైన్) కోసం మూడున్నర మీటర్లు అవసరం

ప్యాంట్లు:

స్కిన్ టైట్ లేదా చుడీదార్ ప్యాంట్ కోసం రెండున్నర మీటర్లు

పలాజో ప్యాంట్ కోసం 3 మీటర్లు

సిగరెట్ ప్యాంట్స్ 2 మీటర్లు

దోతీ ప్యాంట్ లేదా పటియాలా ప్యాంట్ కోసం మంచి కుచ్చులు రావాలంటే 4 మీటర్ల క్లాత్ అవసరం

స్కర్టులు:

టీనేజ్ పిల్లలు, కాలేజీ పిల్లల కోసం స్కర్టులు వన్నె తగ్గని ఫ్యాషన్. అటు ట్రెండీగా, ఇటు కాస్త సాంప్రదాయ లుక్ వీటికుంటుంది. వీటిలోనూ రకాలుంటాయి. వాటికి ఎంత క్లాత్ అవసరమో చూద్దాం.

ఫ్లేర్డ్ స్కర్ట్ కోసం మూడున్నర నుంచి 4 మీటర్ల క్లాత్ అవసరం

తక్కువ ఫ్లేర్ ఉండే A లైన్ స్కర్ట్ కోసం 3 మీటర్లు

లెహెంగా కోసం 4 మీటర్లు

అబ్బాయిల డ్రెస్సుల కోసం:

అబ్బాయిల షర్ట్ రెండున్నర నుంచి 3 మీటర్లు

నెహ్రూ జాకెట్ లేదా కోట్ 2 నుంచి 3 మీటర్లు (చేతుల పొడవు బట్టి మారుతుంది)

కుర్తా 3 మీటర్లు

బ్లేజర్ 3 మీటర్లు

ప్యాంట్ రెండున్నర నుంచి 3 మీటర్లు

దోతీ ప్యాంట్ 5 మీటర్లు

ష్రగ్ ఒకటిన్నర్ నుంచి 2 మీటర్లు

చీర కోసం:

చీర నేరుగా కొనకుండా ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే ఐదున్నర నుంచి 6 మీటర్ల క్లాత్ అవసరం.

బ్లవుజులు:

సాదాసీదా బ్లవుజు కోసం 80 సె.మీ క్లాత్ అవసరం. చాతీ సైజ్ 36 దాటితే 1 మీటర్ క్లాత్ అవసరం అవుతుంది.

¾ స్లీవ్స్ ఉన్న బ్లవుజు కోసం 2 మీటర్ల క్లాత్ అవసరం

ప్రిన్సెస్ కట్ బ్లవుజ్ కోసం ఒకటిన్నర మీటర్ల క్లాత్ అవసరం

బ్లవుజ్ స్లీవ్స్, డిజైన్ బట్టి ఈ క్లాత్ ఎక్కువా తక్కువా అవసరం అవుతుంది.

 

 

 

 

 

తదుపరి వ్యాసం