Drinking Hot Water | రోజూ ఒక గ్లాస్ వేడి నీరు తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుందట!
05 July 2022, 12:44 IST
- గోరు వెచ్చని నీటిని తాగటం వలన పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తుందని నివేదికలు పేర్కొన్నాయి.
Hot Water Benefits
గతంలో యాభై ఏళ్లు పైబడిన వారికి కొలెస్ట్రాల్ పెరగటం, గుండె జబ్బులు రావటం జరిగేది. కానీ ప్రస్తుత కాలంలో 30-40 ఏళ్లు ఉన్నవారు కూడా అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులతో బాధపడుతున్నారు. నిజానికి కొలెస్ట్రాల్ ప్రతి ఒక్కరికి అవసరమే. ఇది కాలేయంలో తయారయ్యే ఒక రకమైన మైనం లాంటి కొవ్వు పదార్ధం. ఇది రక్తంలో అలాగే శరీరంలోని అన్ని కణాలలో ఉంటుంది. కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. కణాల, కణజాలాలు నిర్మాణానికి అలాగే హార్మోన్లు, విటమిన్ డి , బైల్ యాసిడ్ తయారీకి కొలెస్ట్రాల్ అవసరం అవుతుంది. అయితే ఇది ఎక్కువైతే మాత్రం చాలా ప్రమాదం. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ అలాగే ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
శారీరక శ్రమ లేకపోవడం, హానికారక ఆహరపు అలవాట్లు, అతిగా మద్యపానం సేవించడం, ఒత్తిడి, మానసిక ఆందోళనలు ఇతర ఎన్నో కారణాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. ఇది తగ్గించుకోవాలంటే ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అలవర్చుకోవడం తప్పనిసరి. మంచి పోషకాలు కలిగిన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, ఒత్తిడిని నివారించుకోవాలి. వీటన్నింటితో పాటు వేడి నీరు తాగటం వలన కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను కొంతమేర నియంత్రించుకోవచ్చని పలు నివేదికలు పేర్కొన్నాయి.
కొలెస్ట్రాల్ అదుపులో
వేడి నీరు పొట్ట కొవ్వును తగ్గించడంతో పాటు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అదనంగా వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. కొలెస్ట్రాల్‌ను సరైన స్థాయిలో ఉంచడానికి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 2 టీస్పూన్ల తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. ఈ అలవాటు మీ బరువును కూడా అదుపులో ఉంచుతుంది. అదే సమయంలో ప్యాక్ చేసివచ్చే ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తులు, మాంసం మొదలైన వాటికి దూరంగా ఉండాలి. వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మలబద్ధకం నుంచి ఉపశమనం
మరిన్ని ప్రయోజనాలను పరిశీలిస్తే.. రోజులో ఎప్పుడైనా చల్లటి నీటిని కాకుండా కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని తాగితే కడుపు క్లియర్ అవుతుంది. ఇది జీర్ణవ్యవస్థను చక్కగా ఉంచుతుంది. భోజనం చేసిన తర్వాత ఒక కప్పు వేడినీరు తాగడం అలవాటు చేసుకోండి. మలబద్ధకం, కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఇతర ఉదర సంబంధింత సమస్యలను నివారించవచ్చు.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి
మీ జీర్ణ శక్తిని పెంచుకోవడానికి గోరువెచ్చని నీటిని తాగండి. ఈ వేడి నీరు లూబ్రికెంట్‌గా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణ అవయవాలను హైడ్రేట్ చేస్తుంది. అంతేకాకుండా మలినాలను తొలగించి శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది.