తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hot Water: అదేపనిగా వేడి నీరు తాగితే ఆరోగ్యానికి ప్రమాదమే!

hot Water: అదేపనిగా వేడి నీరు తాగితే ఆరోగ్యానికి ప్రమాదమే!

30 December 2021, 16:01 IST

    • అదేపనిగా వేడి నీటిని తాగడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయట. నీరు వేడిచేసుకొని తాగే విషయంలో కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వేడి నీటిని తాగకపోవడం మంచిది. లేకుంటే అది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంతర్గత అవయవాలకు హాని కలిగించవచ్చు.
వేడినీరు
వేడినీరు

వేడినీరు

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని ఆరోగ్య నియమాలు తప్పకుండా పాటించాలి. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ప్రజల్లో ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది, ఆరోగ్య సూత్రాలు ఎక్కువగా పాటిస్తున్నారు. ఉదయం లేవగానే  నీళ్లు వేడి చేసుకొని ఖ్హాళీ కడుపున తాగేస్తున్నారు. అయితే ఇలా చేయడం కొంతవరకు మంచిదే అయినా అదేపనిగా వేడి నీటిని తాగడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయట. ఎలాంటి పరిస్థితుల్లో వేడి నీటిని తాగకూడదు? ఎంత మెుత్తంలో వేడి నీరు తాగితే శరీరానికి మంచిదో ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

డీహైడ్రేషన్

శరీరంలో అనేక పక్రియలకు నీరు అత్యవసరం. సాధారణంగా మన శరీరంలోనే 55-65 శాతం నీరు ఉంటుంది. కాబట్టి అవసరం మేరకే నీరు తాగాలి. డీహైడ్రేషన్‌కు గురైన సందర్భంలో వేడి నీటిని తాగొద్దు. అదేపనిగా వేడినీరు తాగితే కూడా శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.

మూత్రపిండాలపై ఒత్తిడి

శరీరం నుండి వ్యర్ధాలను తొలగించడంలో మూత్రపిండాల పాత్ర కీలకం. అయితే ఎక్కువగా వేడి నీరు తాగితే అవి మూత్రపిండాలపై ప్రభావం చూపి, వాటిపై పని ఒత్తిడిని పెంచుతుంది. శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి వేడి నీటిని మితంగా తీసుకోవాలి.

రాత్రి సమయంలో వేడి నీరు తీసుకోవద్దు

వేడి నీరు నిద్రను ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రాత్రి పడుకునేటప్పుడు వేడినీరు తాగడం వల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. రాత్రిపూట వేడినీరు తాగడం వల్ల మీ రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి పడుకునే ముందు వేడినీళ్లు తాగకండి.

శరీర అంతర్గత భాగాల్లో ఇబ్బందులు

వేడి నీరు ఎక్కువగా తాగటం వల్ల నోటిలో అల్సర్లు, చిన్న చిన్న పుండ్లకు కారణమవుతాయి. బాగా వేడిగా ఉన్న నీరు తాగడం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాలపై కూడా ప్రభావం చూపుతుంది. అన్నవాహిక, జీర్ణవ్యవస్థలో లైనింగ్ చాలా సున్నితంగా ఉంటుంది. వేడి నీటితో ఈ అవయవాలు ప్రభావితమవుతాయి. అలాగే వేడి నీటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువైతే అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

 

టాపిక్

తదుపరి వ్యాసం