తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా మంచిదే.. ఎందుకో తెలుసా?

Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా మంచిదే.. ఎందుకో తెలుసా?

HT Telugu Desk HT Telugu

06 April 2023, 10:07 IST

google News
    • అక్షయ తృతీయను వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి నాడు చేసుకునే పవిత్రమైన హిందూ పండుగ. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దీనిని వైభవంగా నిర్వహిస్తారు. ఆనందం, విజయం, ఆశీర్వాదాలు ఇచ్చే.. చెడు లేని రోజుగా దీనిని పరిగణిస్తారు. అక్షయ తృతీయ సందర్భంగా దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
అక్షయ తృతీయ
అక్షయ తృతీయ

అక్షయ తృతీయ

Akshaya Tritiya 2022 | అక్షయ తృతీయను హిందువులు చాలా పవిత్రమైనరోజుగా భావిస్తారు. వేద జ్యోతిష్కులు కూడా దీనిని మంచి రోజుగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ రోజులో ఎలాంటి చెడు ఉండదు. అందుకే ఈ రోజు ఏ పని ప్రారంభించేందుకైనా వారు వెనుకాడరు. అక్షయ తృతీయను అఖతీజ్​ అని కూడా పిలుస్తారు. అక్షయ అనే పదం సంస్కృత నుంచి వస్తుంది. ఎప్పటికీ తరగనిది అని దీని అర్థం. ఫలితంగా ఈ రోజు ఏదైనా పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు జీవితాంతం వస్తాయని నమ్ముతారు. ఇది వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో తృతీయ తిథిలో వస్తుంది. ఈ సంవత్సరం మే 3వ తేదీన అక్షయ తృతీయను నిర్వహిస్తున్నారు.

శుభ ముహూర్తం, సమయం

* ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే 3వ తేదీన మంగళవారం వస్తుంది.

* అక్షయ తృతీయ పూజ ముహూర్తం: ఉదయం 5:49 నుంచి మధ్యాహ్నం 12:13 వరకు (వ్యవధి 6 గంటల 24 నిమిషాలు)

* తృతీయ తిథి ప్రారంభం: మే 3వ తేదీ ఉదయం 5:18 నుంచి మే 04 ఉదయం 7:32 గంటలకు ముగుస్తుంది.

హిందూ పురాణాల ప్రకారం త్రేతా యుగం.. అక్షయ తృతీయ నాడు ప్రారంభమైంది. సాధారణంగా అక్షయ తృతీయ, పరశురామ జయంతి, శ్రీమహావిష్ణువు 6వ అవతారపు జన్మదినం ఒకే రోజున వస్తాయి. అయితే తృతీయ తిథి ప్రారంభ సమయాన్ని బట్టి.. పరశురామ జయంతి అక్షయ తృతీయకు ఒక రోజు ముందు రావచ్చు.

బంగారం ఎందుకు కొంటారంటే..

అక్షయ తృతీయ పండుగ అదృష్టాన్ని, విజయాన్ని తెస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ రోజు చాలా మంది బంగారం కొంటారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజు బంగారం కొనగోలు చేస్తే.. ఎప్పటికీ క్షీణించదని భావిస్తారు.

హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఉగాది, అక్షయ తృతీయ, విజయ దశమి మూడు చంద్ర దినాలు.. ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించడానికి లేదా పూర్తి చేయడానికి ఎటువంటి ముహూర్తం అవసరం లేదు. దుకంటే అవి అన్ని చెడు ప్రభావం నుంచి విముక్తి ఇస్తాయి.

టాపిక్

తదుపరి వ్యాసం