International Dance Day 2022 | మీరు కూడా ఓ స్టెప్ వేయండి.. హెల్త్‌కి మంచిది..
29 April 2022, 11:33 IST
- డ్యాన్స్ అనేది ఒక కళకు రూపం. కొందరు బాధలోనూ, సంతోషంలోనూ డ్యాన్స్ చేస్తారు. ఇది మన మెంటల్ హెల్త్‌కి, ఫిజికల్ హెల్త్‌కి చాలా మంచిది. మీరు డ్యాన్స్ నేర్చుకుంటే.. అది పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది. అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా డ్యాన్స్ గురించి, ఈ డే గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ప్రపంచ నృత్య దినోత్సవం
World Dance Day 2022 | ఎవరూ చూడకుండా తలుపుల వెనుక అయినా లేదా వందలాది మంది వీక్షకుల మధ్య వేదికపై బహిరంగంగా అయినా.. మనలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా డ్యాన్స్ చేసే ఉంటాము. కాబట్టి ఈ అందమైన కళను, ఈ డ్యాన్స్ డేను జరుపుకోవడానికి ఆలోచించడం ఎందుకు? అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు డ్యాన్స్‌ను ఆదరించేలా ప్రోత్సహించడానికి ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని జరుపుతున్నారు.
ప్రదర్శన కళల కోసం యునెస్కో తన ప్రధాన భాగస్వామి అయిన ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ డ్యాన్స్ కమిటీ.. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఈ విద్యను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన అంతర్జాతీయ నృత్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల నృత్య కార్యక్రమాలు, పండుగలు చేసుకుంటారు. ప్రాంతీయ, సాంస్కృతిక, భాష, జాతి అవరోధాలకు అతీతంగా ప్రదర్శన కళలను ఉన్నతీకరించడానికి ఈ డ్యాన్స్ డేని సెలబ్రేట్ చేస్తారు.
చరిత్ర
ఇంటర్నేషనల్ డ్యాన్స్ కమిటీ, ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్ 1982లో స్థాపించబడ్డాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుతున్నారు. ఏప్రిల్ 29న ప్రముఖ నర్తకి జీన్ జార్జెస్ నోవెరే గౌరవార్థం దీనిని నిర్వహిస్తున్నారు. కళారూపం విలువను, ఔచిత్యాన్ని తెలియజేస్తూ.. ఈ డేను పండుగల చేస్తారు. డ్యాన్ ప్రాముఖ్యతను ఇంకా గుర్తించని ప్రభుత్వాలు, శాసనసభ్యులు, సంస్థలను మేల్కొలిపేందుకు దీనిని నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నృత్యకారులు డ్యాన్ ప్రాముఖ్యతను తెలిపేలా నృత్యిస్తూ.. అవగాహన పెంచుతారు.
ఈ డే లక్ష్యం ఏంటంటే..
అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని డ్యాన్స్ ప్రాముఖ్యతను అందరికీ తెలపడానికి, ఈ విద్యను ఎక్కువ మంది నేర్చుకునే ప్రోత్సాహిస్తారు. అంతే కాకుండా.. నృత్యాన్ని స్వీకరించడం, దాని సార్వత్రికతను ఆనందించడం, అన్ని రాజకీయ, సాంస్కృతిక, జాతి విభజనలను తగ్గించడం దీని లక్ష్యం. డ్యాన్స్‌తో ప్రజలందరినీ ఓ చోటకు చేర్చి.. ఆనందించేలా చేయడమే ఈ రోజు లక్ష్యం.
హెల్త్‌కి బెనిఫిట్
30 నిమిషాల డ్యాన్స్ క్లాస్.. ఓ రోజు జాగింగ్ సెషన్‌తో సమానం కాబట్టి.. డ్యాన్స్ అనేది కళారూపం మాత్రమే కాదు. ఇది మన మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ట్యాప్ డ్యాన్స్ అనేది మీ కాళ్ళను టోన్ చేయడంలో, కండరాల బలాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. హృదయరోగాలను దూరం చేస్తుంది. బెల్లీ డ్యాన్స్.. మీ మొత్తం శరీరం, కండరాలను టోన్ చేయడంలో సహాయం చేస్తుంది. భరత నాట్యం ఆరోగ్యకరమైన హృదయాన్ని అందించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఓర్పును, రక్త ప్రసరణను పెంచుతుంది. మీ బరువును అదుపులో ఉండేలా చేస్తుంది. కథాకళి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా కంటికి సంబంధించిన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీరు కూడా సంతోషంగా ఓ స్టెప్ వేయండి.
టాపిక్