తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thick Black Hair | కారుమబ్బులాంటి నల్లని, ఒత్తైన కురులు పొందాలంటే సహజ మార్గాలు!

Thick Black Hair | కారుమబ్బులాంటి నల్లని, ఒత్తైన కురులు పొందాలంటే సహజ మార్గాలు!

HT Telugu Desk HT Telugu

19 September 2022, 8:20 IST

google News
    • Thick Black Hair- Natural Ways: జుట్టు పలుచగా ఉన్నప్పుడు రసాయనిక షాంపూలు వద్దు, సహజ మార్గాలను అనుసరించటం ద్వారా నల్లటి, ఒత్తైన జుట్టును పొందవచ్చు. ఎలాగో ఇక్కడ చూడండి.
Ways to get thick black hair
Ways to get thick black hair (iStock)

Ways to get thick black hair

జుట్టు పలుచగా, బలహీనంగా ఉన్నపుడు తలపై వెంట్రుకలు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే జుట్టుకొనలు చిట్లి పోవడం, జుట్టు రాలిపోవడం సమస్యలు అదనంగా ఉంటాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు చాలా మంది అమ్మాయిలు హెయిర్ కటింగ్ చేసుకొని, తమ జడ పొడవును తగ్గించుకుంటారు. దీనివల్ల జుట్టు వాల్యూమ్ ఎక్కువ ఉన్నట్లు లుక్ వస్తుంది. అయితే ఈ ట్రిక్ ఎక్కువ కాలం పనిచేయదు. ఎందుకంటే వెంట్రుకలు పెరిగే కొద్దీ మళ్లీ పరిస్థితి మొదటికే వస్తుంది.

మీరు మీ జుట్టు పలుచబడటం గురించి ఆందోళన చెందుతుంటే. సహజ మార్గాల్లో ఒత్తైన జుట్టు పెరిగేలా మార్గాలను అన్వేషించండి. మీకోసం కొన్ని హెర్బల్ ఉత్పత్తులను (Thick Black Hair- Natural Ways ఇక్కడ సూచిస్తున్నాం. వీటిని కొంతకాలం జుట్టుకు అప్లై చేసి చూడండి, మీకు తేడా కనిపిస్తుంది. రసాయన ఉత్పత్తులతో పోలిస్తే సహజమైన హెర్బల్ ఉత్పత్తులు ఉపయోగించడానికి సురక్షితం, దుష్ప్రభావాలు తక్కువగా కనిపిస్తాయి.

మరి దృఢమైన, ఒత్తైన జుట్టు కోసం తలకు ఎలాంటి పదార్థాలను పట్టించాలో ఇప్పుడు చూడండి.

శికాకాయ్

పాతకాలంలో శీకాయను షాంపూ రూపంలో జుట్టును కడగడానికి ఉపయోగించేవారు. ఇప్పుడు మార్కెట్లో లభించే రసాయన ఉత్పత్తులు వాడటం కన్నా, మళ్లీ పాత వాటినే ఉపయోగించటం మేలు. ఉసిరి, రీతా, శికాకాయ్ కలిపి జుట్టును శుభ్రం చేసుకోవడం వలన జుట్టు మెరుస్తూ మృదువుగా మారుతుంది. ఉసిరి, రీతా, శికాకాయ్ సమాన పరిమాణంలో తీసుకొని నీటిలో ఉడకబెట్టండి. తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని జుట్టుకు పట్టించి కాసేపు అలాగే ఉంచాలి. ఈ హెర్బల్ పేస్టుతో జుట్టుకు సరైన పోషణ లభిస్తుంది. తరచుగా ఉపయోగించడం వలన జుట్టు మందంగా, బలంగా మారుతుంది.

బ్రహ్మి

బ్రహ్మి ఒక ఆయుర్వేద మూలిక, దీనిని వివిధ చికిత్సల కోసం ఉపయోగిస్తారు. ఈ మూలికలోని గుణాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం, ఆందోళనను తగ్గించడం, మూర్ఛ వ్యాధి చికిత్సకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాదు ఈ బ్రహ్మి మూలిక జుట్టుకు కూడా ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది. అధిక ఒత్తిడి కారణంగా జుట్టు రాలిపోతుంటే, అప్పుడు జుట్టుకు బ్రాహ్మిని రాయండి. ఇది చుండ్రు, దురద , చివర్లు చిట్లడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. మీరు జుట్టు పల్చబడటం వంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే, బ్రహ్మీ ఆకులను వేప ఆకులతో గ్రైండ్ చేసి ఉసిరి పొడిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు రాసుకొని సుమారు గంట తర్వాత చల్లటి నీటితో కడగాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే జుట్టులో తేడా కనిపిస్తుంది.

కలబంద

కలబంద అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా దీనిలోని గుణాలు చర్మ సౌందర్యానికి, కేశ సంరక్షణకు ప్రసిద్ధి. కలబంద జుట్టుకు తేమను అందించటంతో పాటు కేశాలను దృఢంగా మారుస్తుంది. పొడి జుట్టు, జుట్టు చిట్లిపోవడం, నిర్జీవంగా మారినట్లు ఉంటే కలబంద గుజ్జును జుట్టు మూలాలను తాకేలా అప్లై చేయండి. ఒక గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇది జుట్టును బలంగా, మందగా మారుస్తుంది.

తదుపరి వ్యాసం