తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Learning Games For Kids | ఆటలతో పాఠాలు చెబితే.. పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు, ఇలాంటి ఆటలు ఆడించండి!

Learning Games for Kids | ఆటలతో పాఠాలు చెబితే.. పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు, ఇలాంటి ఆటలు ఆడించండి!

HT Telugu Desk HT Telugu

11 January 2023, 12:06 IST

google News
    • Learning Games for Kids: ఆటలు అంటే ఇష్టపడని పిల్లలు దాదాపు ఉండరు, ఆటలతో పాఠాలు చెబితే, పిల్లలు ఏదైనా సులభంగా నేర్చుకుంటారు. పిల్లలతో ఇలాంటి గేమ్స్ ఆడించాలి. 
fun games to boost your child's learning
fun games to boost your child's learning (iStock)

fun games to boost your child's learning

తమ పిల్లలు అన్నింటిలో రాణించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకు పిల్లలకు సరైన జ్ఞానం, ఆలోచనాశక్తి, నేర్చుకునే సామర్థ్యం తల్లిదండ్రులు అందివ్వాలి. పిల్లలు అభ్యాసకులుగా విజయం సాధించడానికి చిన్నతనం నుండే బలమైన పునాదులు అవసరం. ఆటలు అంటే ఇష్టపడని పిల్లలు దాదాపు ఉండరు, కాబట్టి వారికి ఏదైనా నేర్పించడానికి కూడా కొన్ని సరదా ఆటలను ఎంచుకోవచ్చు. గేమ్-ఆధారిత అభ్యాసం అనేది మీ పిల్లలు నేర్చుకునే సామర్థ్యం మెరుగుపరిచే సాధనంలో ఒకటి.

ఆటలు పిల్లల్లో జ్ఞానం, సృజనాత్మకత, నైపుణ్యాల పెరుగుదలలో సహాయపడతాయి, అంతేకాకుండా పిల్లలలో భావోద్వేగ గుణాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. ఆటలతో పాటు నేర్చుకోవడం పిల్లలకు ఆనందదాయకంగా ఉండటమే కాకుండా, వారిలో ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది, జ్ఞానాన్ని ఎక్కువ కాలం నిలుపుకోవడంలో సహాయపడుతుంది, అలాగే వారికి ఏదైనా నేర్చుకోవడం పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుంది.

HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, డాక్టర్ విలోనా అనౌన్సియేషన్, MD, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మాట్లాడుతూ.. పిల్లలకు ఆసక్తి లేని నైపుణ్యాలు లేదా సబ్జెక్టులను నేర్పడానికి ఆటలు సమర్థవంతమైన సాధనాలుగా పనిచేస్తాయని అన్నారు. ఆటల ద్వారా నేర్చుకునే పిల్లలకు ఆలోచనా శక్తి, నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది, ఆనందంగా నేర్చుకుంటారని డాక్టర్ విలోనా అన్నారు.

Learning Games for Kids- పిల్లల అభ్యాసం సామర్థ్యం పెంచే ఆటలు

పిల్లల అభ్యాసాన్ని పెంచడం కోసం 5 గేమ్‌లను డాక్టర్ విలోనా సూచించారు, అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. మోనోపోలీ సూపర్ ఇ-బ్యాంకింగ్:

మోనోపోలీ అనేది ఒక క్లాసిక్ బోర్డ్ గేమ్. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఈ ఆట ఆడుతూ గొప్ప సమయాన్ని గడిపవచ్చు. ఈ ఆటలోని నిబంధనలు ప్రాథమిక ఆర్థిక అంశాలు, మనీ మేనేజ్‌మెంట్, ఇ-బ్యాంకింగ్ విధానాల గురించి నేర్పిస్తుంది. పిల్లలకు డబ్బు ఆదా చేయడం, ఖర్చు చేసే డబ్బుకు బాధ్యతగా ఉండటం మొదలైన అంశాలను ఈ గేమ్ నేర్పిస్తుంది.

2. జెంగా:

పిల్లల్లో నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి ఈ గేమ్ మంచి ఎంపిక. ఈ ఆట ఉద్దేశ్యం పిల్లలకు సహనం విలువను, ఒత్తిడి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలివిగా నేర్పిస్తుంది. అంతేకాకుండా కనులకు లోతైన పరిశీలన, చేతులకు సమన్వయం అందిస్తుంది.

3. గేమ్ ఆఫ్ లైఫ్:

గేమ్ ఆఫ్ లైఫ్ వంటి బోర్డ్ గేమ్‌లు సాహసాలు, ఆశ్చర్యాలతో కూడుకొన్నవి. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, కెరీర్‌ని ఎంచుకోవడం, కుటుంబ నిర్ణయాలలో బాధ్యత మొదలైనవి ఈ గేమ్ నేర్పిస్తుంది. ఈ గేమ్ లోని ట్విస్ట్‌లు, టర్న్‌లు ఆటగాళ్లను ఇతరులతో ఎలా మాట్లాడాలి, అవసరమైనప్పుడు సహాయం కోసం అడగడం, వారికి సానుభూతి చూపడం వంటివి నేర్పిస్తుంది. ఈ గేమ్ ఆడటం ద్వారా భావోద్వేగ మేధస్సు, సామాజిక నైపుణ్యాలు, నిర్ణయాత్మక నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడుతుంది.

4. కనెక్ట్ 4:

ఈ గేమ్ నాలుగు డిస్క్‌లను కనెక్ట్ చేయడానికి, ప్రత్యర్థి కదలికను అంచనా వేయడానికి, వారి కదలికలపై అప్రమత్తంగా ఉండటానికి అవకాశం కల్పిస్తుంది. పిల్లలకు తార్కికంగా ఆలోచించడం నేర్పుతూ అవకాశాల కోసం వెతకమని వారిని ప్రోత్సహిస్తుంది. నాలుగు డిస్క్‌లను వ్యూహాత్మకంగా లింక్ చేయాలనే తపనతో పిల్లలు వ్యూహరచన చేయడం, చురుగ్గా వ్యవహరించడం కూడా ఇది నేర్పుతుంది.

5. హంగ్రీ హంగ్రీ హిప్పోస్

ఈ గేమ్ సరదాగా, త్వరగా గడిచిపోయేది. కాబట్టి ఇది పిల్లలను ఉత్తేజపరుస్తుంది. ఈ ఆటకు ఉన్న వేగవంతమైన స్వభావం వలన పిల్లలు శ్రద్ధగా, పోటీతత్వంతో ఎలా ఉండాలో నేర్చుకుంటారు. త్వరగా ఎలా స్పందించాలో తెలుసుకుంటారు. చేతులు- కళ్ల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి ఇది ఒక గొప్ప మార్గం.

తదుపరి వ్యాసం