తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Special Soups | వేసవి వేడిని తట్టుకోవాలా? అయితే ఈ సూప్స్ తాగండి..

Summer Special Soups | వేసవి వేడిని తట్టుకోవాలా? అయితే ఈ సూప్స్ తాగండి..

04 June 2022, 11:47 IST

google News
    • చలికాలంలో వేడిని తట్టుకోవడానికి చాలా మంది సూప్​లను ఆశ్రయిస్తారు. అవి చలిని దూరం చేసి.. కాస్త వెచ్చదనాన్ని అందిస్తాయి. మరి వేసవిలో వేడిని తగ్గించుకోవడం ఎలా అంటారా? అయితే వీటికి కూడా సూప్​లు ఉంటాయి అంటున్నారు ఆహార నిపుణులు.
వేసవిలో ఈ సూప్స్ తాగండి..
వేసవిలో ఈ సూప్స్ తాగండి..

వేసవిలో ఈ సూప్స్ తాగండి..

Heat The Beat with Summer Soups | అవునండీ.. వేసవి వేడిని తగ్గించుకోవడానికి కొన్ని సూప్​లు ఉన్నాయి. వీటిని ఇంట్లో తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక. చలికాలంలో మీకు వేడిని ఇచ్చి.. ఎలా ఉత్సాహాన్ని అందిస్తాయో.. అదే విధంగా వేసవి కాలంలో వేడిని తగ్గించేందుకు ఈ సూప్​లు అంతే ఉపయోగపడతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీటిని ట్రై చేసి.. ఈ సమ్మర్​ హీట్​ని బీట్​ చేయండి.

చల్లటి సూప్‌లు చేసే మేలు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇవి మిమ్మల్ని ఎండలో కూడా రిఫ్రెష్‌గా ఉంచుతాయి. ఇవి పూర్తిగా శీతలీకరణ పదార్థాలతో ప్యాక్ చేస్తాము. వేసవి వేడిని అధిగమించడానికి ఈ చల్లని సూప్ వంటకాలను ప్రయత్నించండి. వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

టొమాటో, దోసకాయ సూప్

తాజా జ్యూసీ టొమాటోలు, దోసకాయలతో తయారుచేసిన సూప్ మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతేకాకుండా మిమ్మల్ని హైడ్రేట్​గా ఉంచుతుంది. ఒక గిన్నెలో తరిగిన టమోటాలు, దోసకాయలు, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు వేయండి. అందులో బ్రెడ్ ముక్కలు, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, కొత్తిమీర తరుగు, మిరపకాయ వేసి బాగా కలపాలి. అన్ని మెత్తని పేస్ట్​గా చేసి.. చల్లారిన తర్వాత సర్వే చేసుకోండి.

బఠానీ, పుదీనా సూప్

చికెన్ స్టాక్‌లో పుదీనా కాడలను వేయండి. తరిగిన వెల్లుల్లి, పచ్చి బఠానీలు, ఉల్లిపాయలను ఆలివ్ నూనెలో వేసి మూడు-ఐదు నిమిషాలు ఉడికించాలి. మిక్సీలో చికెన్ స్టాక్, ఉప్పు, మిరియాలు వేసి ఎనిమిది-10 నిమిషాలు ఉడకనివ్వండి. సోర్ క్రీం వేసి సూప్ కలపండి. చల్లారిన తర్వాత రిఫ్రిజిరేటర్‌లో ఉంచి.. పుదీనా ఆకులతో సర్వ్ చేసుకోండి.

బచ్చలికూర, అవకాడో సూప్

బేబీ పాలకూర ఆకులను పాక్షికంగా ఉడకబెట్టండి. తరువాత బచ్చలికూర ఆకులను బ్లెండర్‌లో వేసి.. అవకాడోను జోడించాలి. ఒక కప్పు తాజా క్రీమ్, పచ్చి మిరపకాయలు వేసి బాగా కలపాలి. వెల్లుల్లి రెబ్బలు, తాజా అల్లం పేస్ట్, స్ప్రింగ్ ఆనియన్స్, నానబెట్టిన బాదం, ఉప్పు, మిరియాలు వేసి.. బాగా కలపండి. అనంతరం దీనిని ఫ్రిజ్​లో ఉంచండి. సర్వ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర, క్రీమ్​తో కలిపి తినండి.

పుచ్చకాయ, పుదీనా సూప్

యాంటీఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు, పోషకాలతో నిండిన పుచ్చకాయలు మిమ్మల్ని శక్తివంతంగా, హైడ్రేట్​గా ఉంచుతాయి. నిమ్మరసం, పుదీనా, తేనెతో పాటు క్యూబ్డ్ డీ-సీడ్ పుచ్చకాయను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. దీనిని కనీసం రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి. తాజా పుదీనా ఆకులతో గార్నిష్ చేసి చల్లారాక సర్వ్ చేయాలి.

తదుపరి వ్యాసం